Bigg Boss Nonstop : వాడీ వేడిగా ఈ వారం నామినేషన్స్.. ఎవరెవరు అయ్యారంటే?

దేశంలోనే మరే షోకూ దక్కనంత రేటింగ్‌ను సొంతం చేసుకున్న షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ ఇప్పుడు చివరికి వచ్చింది. ఈ నేపథ్యంలో నామినేషన్స్ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 10 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చొక్కారపు , మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డిలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇక బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ఎంతో ముఖ్యమైనవి. సాధారణంగా ప్రతి వారం ఇవి అనుకున్నట్లుగానే రచ్చ రచ్చగా జరుగుతుంటాయి.

ఇక 11వ వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు.ఈ నామినేషన్స్ లో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పాలి. ఈ వారానికి కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఇక నామినేషన్ ప్రాసెస్ రెండు రోజుల పాటు జరిగింది. ముందుగా బిందు మాధవి.. అఖిల్, నటరాజ్, మిత్రాలను నామినేట్ చేసింది. ఆ తరువాత అనిల్ బాబా భాస్కర్, అరియనా, అఖిల్ లను నామినేట్ చేశాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్.. బిందు మాధవి, అరియనా, బాబా భాస్కర్ లను నామినేట్ చేశాడు. ఆ తర్వాత అనిల్ రాథోడ్, యాంకర్ శివలను నామినేట్ చేశాడు.

Bigg Boss Nonstop : 11th week nominations list is here

యాంకర్ శివ.. ముందు మిత్రాశర్మను నామినేట్ చేయగా.. వారిద్దరి మధ్య వాదన తారాస్థాయికి చేరడంతో మిత్ర శర్మ ఐరన్ స్టాండ్ కి చేయి వేసి కొట్టుకుంది. దీంతో అఖిల్ పరిస్థితి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత యాంకర్ శివ నటరాజ్ మాస్టర్, అఖిల్ లను నామినేట్ చేశాడు. ఇక బాబా భాస్కర్.. అనిల్, నటరాజ్ మాస్టర్, మిత్రాశర్మలను నామినేట్ చేశాడు. మిత్రశర్మ.. అరియానా, యాంకర్ శివ, బాబా భాస్కర్ లను నామినేట్ చేసింది. ఆలా ఈ వారం కెప్టెన్స్ కూడా ఎవరూ లేకపోవడంతో ఫైనల్ గా ఈ వారం హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు మిత్రా శర్మ, బాబా భాస్కర్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాష్టార్మ్ అరియనా, అఖిల్ కాగా ఈ అందరూ ఇప్పుడు నామినేషన్స్ లోకి వెళ్ళిపోయారు. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X