twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Nonstop: అరియానా దిగజారిపోయావు.. ఆ సెంటిమెంట్‌తో రెచ్చిపోయిన నటరాజ్ మాస్టర్

    |

    బిగ్ బాస్ నాన్ స్టాప్ షో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి కాగా ఆ ఎనిమిది వారాలకు గాను ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ కూడా ఎప్పటిలాగే అనేక గొడవలతో సాగాయి. ఇక తొమ్మిదో వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే అరియానా - నటరాజ్ మాస్టర్ మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

     బ్యాట్‌ తో బద్దలు కొట్టి

    బ్యాట్‌ తో బద్దలు కొట్టి

    ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు గత సీజన్లలో కనిపించిన మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన ఏడు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చొక్కారపు, మహేష్ విట్టా, అజయ్ కతుర్వార్ ఎలిమినేట్ అయ్యారు.

    ప్రతి వారం లాగానే ఈ వారం నామినేషన్స్‌ కూడా వాడీ వేడిగా సాగాయి. ప్రతివారం ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో నామినేషన్స్ పెడుతున్న బిగ్ బాస్‌ ఈ వారం కూడా అదే తరహాలో కాన్సెప్ట్ తో బిగ్‌ బాస్‌ ఇంట్లో వాతావరణాన్ని వేడెక్కించాడు.

    దిష్టిబొమ్మలు పెట్టి వాటిపై కుండలు పెట్టి బ్యాట్‌ తో బద్దలు కొట్టి అలా నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఇక వారం అంతా ఈ రోజు కోసమే ఎదురు చూసే కంటెస్టెంట్ లు ఎప్పటిలాగే రెచ్చిపోయారు.

     వేరే ఆలోచనలు

    వేరే ఆలోచనలు

    కంటెస్టెంట్ లు అంతా వారి కారణాలు చెబుతూ ఈ ఆరు రోజులు దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కారు. అయితే చాలా మంది మధ్య పెద్ద రచ్చే జరిగింది కానీ అందరికంటే ఎక్కువగా నటరాజ్ మాస్టర్‌- అరియానా మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. తొలుత నటరాజ్ మాస్టర్ ను అరియానా గ్లోరీ నామినేట్ చేసింది.

    నామినేట్ చేసి మొన్న గేమ్ ఆడుతున్నపుడు హమీదా యాంకర్ శివతో కలిసి స్ట్రాటజీ చేస్తుందని కన్ఫాం చేశారని, ఆ స్ట్రాటజీ ఏమిటి అని అడగగానే అది ఏమిటో చెప్పలేదు కానీ ఆమెకు స్ట్రాటజీ ఉందని అందరికీ చెప్పారని పేర్కొంది. అలా చేస్తున్నావా అని అడిగితే ఆమె లేదని చెప్పిందని అంటే ఆమె ఏమీ చేయకపోయినా మీరు మా మనస్సులో ఆమె గురించి వేరే ఆలోచనలు రేకెత్తించారు.

    మళ్ళీ రచ్చ

    మళ్ళీ రచ్చ

    అలా చేయడం తప్పు అని ఆమె పేర్కొంది. దానికి నటరాజ్ మాస్టర్ బాగుంది, రోజు అంతా కుర్చుని బాగా ప్లాన్ చేసావ్ అంటూ కామెంట్ చేశాడు. నీ ఫేవరెట్స్ ఎవరినీ చేయకుండా భలే దొరికాడు వీడు అని నామినేట్ చేశావని అన్నాడు. అంతేకాదు నువ్వు స్వార్థపూరిత విషమని అన్నాడు. దీంతో ఆ మాట తీసుకులేక పోయిన అరియానా మీరు మొదటి వారం నుంచి నాకు సపోర్ట్ చేస్తారని అన్నారని కానీ ఎప్పుడూ చేయలేదని పేర్కొంది. అంతేకాదు ఎందుకు ముందు నుంచి మీ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తున్నారు.

    నేను ఎందుకు మీ మీద డిపెండ్ అవ్వాలి అంటూ ప్రశ్నించింది. అయితే భలే ప్లాన్ చేశావులే ఇక వెళ్ళు అంటూ నటరాజ్ మాస్టర్ ఎప్పటిలాగే రెచ్చ కొట్టాడు. ఇక అరియానా మరోపక్క హమీదాను నామినేట్ చేసింది. ఇక ఆ తరువాత నటరాజ్ మాస్టర్ అనిల్ రాథోడ్ ను నామినేట్ చేశారు. అలాగే అరియానాను నామినేట్ చేసి మళ్ళీ రచ్చ మొదలుపెట్టారు.

     దిగజారిపోయానంటారా?

    దిగజారిపోయానంటారా?

    నేను నిన్ను సపోర్ట్ చేస్తానని చెప్పానా అంటే అవును చేస్తానని చెప్పారు కదా, అంటే అది ఆ గేమ్ వరకే సీజన్ అంతా చేస్తానని చెప్పలేదు కదా అని అన్నారు. అయితే అది నిజం కాదని అరియానా అరవడం మొదలు పెట్టింది. ఇక ఇదే సమయంలో గేమ్ విషయంలో తన కుమార్తెపై ఒట్టు వేయాలని అరియానా అడగడాన్ని నటరాజ్‌ మాస్టర్‌ తప్పుబట్టారు.

    గేమ్ కోసం అరియానా అంత దిగజారిపోతావా? అంటూ ప్రశ్నించారు. దిగజారిపోతావా? అంటూ మాట్లాడడంతో ఇక అరియానా కోపంతో ఊగిపోయింది. గేమ్ ఇంపార్టెంట్ అని మీరే చెప్తారు కదా? దానిని నేను సీరియస్ గా తీసుకుని ఆడటం మొదలు పెడితే దిగజారిపోయానంటారా? ఇలా ఎందుకు సెల్ఫిష్, సిగ్గులేని మనిషి అంటూ అరియానా కేకలు పెట్టడం మొదలు పెట్టింది.

    అరుస్తున్నా వినిపించుకోకుండా

    అరుస్తున్నా వినిపించుకోకుండా

    అక్కడి నుంచి మొత్తం గార్డెన్ అంతా నడుస్తూ అరవడం మొదలు పెట్టింది. అంతేకాక నటరాజ్ మాస్టర్ అప్పటికి కూడా చల్లారక పోవడంతో మళ్ళీ ఆమె ఇప్పుడైనా మీరు అనలేదని మీ పాప మీద ఒట్టేయండి మాస్టర్‌ అంటూ గట్టిగానే అడిగింది. అయితే ఆమె డ్రామా చేస్తుందని, ఆమెకు ఫ్లాట్ కొనుక్కునేందుకు డబ్బులు వచ్చేశాయి అని అందుకే గేమ్ ఆడడం లేదని అంటారు.

    ఆ తరువాత కూడా నటరాజ్ మాస్టర్‌ మళ్లీ ఇంత దిగజారిపోతావా అంటూ మళ్లీ రెచ్చిపోయాడు. అయితే ఆమె ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా నటరాజ్ మాస్టర్ అరుస్తూ ఆమె కుండ బద్దలు కొట్టి చివరకు తన నామినేషన్‌ ను కంప్లీట్ చేశాడు.

    English summary
    Ariyana glory fight with Nataraj master in 9th-week nominations became a hot topic in Bigg Boss Nonstop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X