twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Nonstop : బిందు మాధవి vs శివ.. అది నచ్చలేదన్న బిందు.. ఇన్ని రోజులు ఏం చేశావన్న శివ!

    |

    తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా సాగడంతో బిగ్ బాస్ ఓటీటీని నాన్ స్టాప్ పేరిట మొదలు పెట్టారు. ఇక ఆ షో కూడా విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి కాగా ఆ ఎనిమిది వారాలకు గాను ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ కూడా ఎప్పటిలాగే అనేక గొడవలతో సాగాయి. అయితే తొమ్మిదో వారం నామినేషన్స్ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా చాలా క్లోజ్ అనుకుంటున్నా బిందు మాధవి -శివ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. ఆ వివరాల్లోకి వెళితే

    ఎనిమిది మంది ఔట్

    ఎనిమిది మంది ఔట్

    ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త వాళ్లతో పాటు గత సీజన్లలో కనిపించిన మాజీ కంటెస్టెంట్లు కూడా కొంత మంది ఉన్నారు. అలా పాత కొత్త కలయికలతో ఏర్పాటు చేసిన టీమ్ కాస్త నిరాశాజనకంగా ఉన్నా వాళ్ళ చేతే జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బిగ్ బాస్ టీమ్.

    ఇక గడిచిన ఎనిమిది వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చొక్కారపు, మహేష్ విట్టా, అజయ్ కతుర్వార్ ఎలిమినేట్ అయ్యారు.

    వారం రోజుల ఫ్రస్టేషన్

    వారం రోజుల ఫ్రస్టేషన్

    ఇక ఎప్పుడూ జరిగే విధముగానే ప్రతి వారం లాగానే ఈ వారం నామినేషన్స్‌ కూడా వాడీ వేడిగా సాగాయి. ప్రతివారం ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో నామినేషన్స్ పెడుతున్న బిగ్ బాస్‌ ఈ వారం కూడా అదే తరహాలో ఒక కొత్త కాన్సెప్ట్ తో బిగ్‌ బాస్‌ హౌస్ లో వాతావరణాన్ని వేడెక్కించాడు.

    దిష్టిబొమ్మలు పెట్టి వాటిపై కుండలు పెట్టి నామినేట్ చేయాలనుకున్న వారి కుండలను బ్యాట్‌ తో బద్దలు కొట్టి నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు. ఇక వారం అంతా ఈ రోజు కోసమే ఎదురు చూసే కంటెస్టెంట్ లు ఎప్పటిలాగే తమ వారం రోజుల ఫ్రస్టేషన్ తీర్చుకున్నారు.

    గుర్తుంది అన్నావు

    గుర్తుంది అన్నావు

    మరీ ముఖ్యంగా బిందు మాధవి స్నేహితులుగా ఉన్న యాంకర్ శివను కూడా నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బిందు మాధవి శివను నామినేట్ చేస్తూ ''శివ లాస్ట్ వీక్ నాకు ఎఫెక్ట్ అయిన విషయంలో నువ్వు అక్కడ నాకు స్టాండ్ తీసుకోకపోవడం నిన్ను నామినేట్ చేయడానికి ముఖ్య కారణం, ఎందుకంటే ఆ విషయం మీద మనం ముందే మాట్లాడుకున్నాం, నామినేషన్స్ కంటే ముందు నేను నిన్ను అడిగాను ఇలా అన్నారు నీకు గుర్తుంది కదా అంటే గుర్తుంది అన్నావు, అక్కడికి వెళితే చెప్పమని చెప్పాను.

    నువ్వేం చేస్తావని

    నువ్వేం చేస్తావని

    కానీ అక్కడికి వెళ్ళాకా నువ్వు నాకు తెలియదు అని వెనకడుగు వేయడం నచ్చలేదని పేర్కొంది. దానికి శివ నువ్వు ఏదో గుర్తుందా అని అడిగావు, కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు ఏం మాట్లాడతావో తెలియకుండా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని గుర్తుండి లేని విషయాన్ని నేను మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించాడు. అయితే నీకు గుర్తుండి అన్నావు కదా, ఆ గుర్తున్నదే చెప్పమని అన్నాను అంటే గుర్తున్నది నేనే చెప్పి అక్కడ అతను ఇలా అన్నాడని నేనే అంటే నువ్వేం చేస్తావని ప్రశ్నించాడు.

    బాధపెట్టిందంటూ

    బాధపెట్టిందంటూ

    అయితే నేను విన్నాను అనే మాట కూడా అనలేదు కదా అంటే వెంటనే అఖిల్ ను సాక్ష్యంగా తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇన్ని రోజులు చెప్పకుండా నువ్వు ఆదివారం నాడు ఆ పాయింట్ తీస్తావు అని నేను కలగన్నానా? అలా ఎందుకు చెబుతున్నావంటూ శివ ప్రశ్నించాడు. అయితే ఆ మాట నన్ను బాధపెట్టిందంటూ బిందు సీరియస్ అయ్యింది కూడా. ఇలా అంటే ఇక మీద తెలిసినా చెప్పాలనిపించదని యాంకర్ శివ చెప్పుకొచ్చాడు.

    English summary
    Bindhu madhavi nominates anchor shiva in 9th week nominations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X