Bigg Boss Nonstopలో షాక్...అఖిల్ మీద బిందు తండ్రి పొగడ్తల వర్షం.. ఆడపులీ అంటూనే!
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి సీజన్ గా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షో మొదట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కానీ వెంటనే జాగ్రత్త పడిన యాజమాన్యం ఈ షో ను ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత వరకు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఎప్పటిలాగే ఈ నాన్ స్టాప్ సీజన్ లో కూడా ఫ్యామిలీ సీజన్ పెట్టారు. ఇక ఎప్పటిలాగే మొత్తం ఎమోషనల్ గా ఈ ఫ్యామిలీ ఎపిసోడ్స్ చూపిస్తున్నారు. ఇక బిందు మాధవి తండ్రి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాక కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసాడు. ఆ వివరాలు

సింహ స్వప్నంగా
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా శనివారం రాత్రి ఎపిసోడ్‌లో బిందు మాధవి తండ్రి హౌస్‌లోకి వచ్చింది చూపించారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ రేసులో ఉన్నట్లు ఖాయం అయిపోయింది. హౌస్‌లో ఆడపులిలా విజృంభిస్తూ తనతో పోటీ పడుతున్న అందరికీ సింహ స్వప్నంగా మారింది. అయితే ఆమె తండ్రి లోపలికి వస్తే ఆమెకు మరింత బూస్ట్ లభిస్తుందని అందరూ ఆశించారు అదేవిధంగా ఆమెకు బూస్ట్ లభించడమే కాక ఆమె శత్రువులా ఫీల్ అవుతున్న అఖిల్ నటరాజ్ మాస్టర్ లకు కూడా ఆయన బూస్ట్ ఇచ్చాడు.

ఎంతో ప్రేమగా
హౌస్‌లోకి వచ్చిన మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ గుసగుసలు ఆడుతూ.. వాళ్లు ఎవరికోసం అయితే వచ్చారో వాళ్ల కోసమే అన్నట్టుగా మాట్లాడి మాకు మా వాళ్లే ముఖ్యం అన్నట్లు ప్రవర్తిస్తే బిందు మాధవి తండ్రి మాత్రం.. హౌస్‌లో ఉన్న వాళ్లందరికీ నిండు మనసుతో ఆశీస్సులు అందించారు. బిందు మాధవిని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ ఆమెను ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ ఉండడానికి ప్రయత్నిస్తున్న అఖిల్, నటరాజ్ మాస్టర్‌లతో సైతం ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది.

అఖిల్‌ని సైతం
లోపలికి వచ్చీ రాగానే ఆడపులీ.. హౌఆర్‌యూ.. ఆడపులీ అంటూ బిందు మాధవిని గుండెలకు హత్తుకున్న ఆయన ఆ తరువాత ఇంటిలో ఉన్న వాళ్ల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సేవకుడు కాని వాడు నాయకుడు కాలేడని, ఆట ఆడుతూనే సేవకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నావ్ అని నటరాజ్ మాస్టర్‌పై ప్రశంసలు కురిపించారు. బిందు మాధవి నాకు ఆగర్భ శత్రువు ఆమె నాకు పోటీ అని భావించి అన్ని విషయాల్లో ఆమెను టార్గెట్ చేస్తున్న అఖిల్‌ని సైతం ఆయన ప్రశంసించాడు.

ఆట బాగుంది అంటూ
'అఖిల్ నీ ఆట చాలా కళాత్మకంగా ఉందన్న ఆయన 64 విద్యల్లో చాలా విద్యలు తెలిసిన వాడిలా ఆడుతున్నావు .. ఆల్ ది బెస్ట్ అని దీవించారు. అలా ఒక్కొక్కరి గురించి మాట్లాడిన ఆయన అందరికీ కొంత బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరిగా తన కుమార్తె బిందు గురించి మాట్లాడుతూ.. బిందు నువ్వు నిజాయితీగా నిస్సంకోచంగా నివురుగప్పిన నిప్పులా.. ఆడ పులిలా ఆడుతున్నావ్.. అలాగే ఆడు.. అని చెప్పుకొచ్చారు.

బెస్ట్ ఇన్స్టిట్యూషన్
ఇదంతా ఒక ఎత్తు అయితే చివరిలో బయటకు వెళ్లే సమయంలో బిగ్ బాస్ షోపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'కొంతమంది మంది ఎందుకు ఈ బిగ్ బాస్.. ఎవరిని ఉద్దరించడానికి ఈ బిగ్ బాస్ అని కామెంట్స్ చేస్తున్నారని, వాళ్ళకి చెబుతున్నానని అంటూ ఆయన కామెంట్స్ చేశారు. పిచ్చివాళ్లారా.. తెలుసుకోండి, ఈ షో శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని ఆయన చెప్పుకొచ్చారు. మిగాతా అందరికంటే భిన్నంగా ఉన్న ఆయన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











