Bigg Boss Nonstop finale: చరిత్ర సృష్టించిన బిందుమాధవి.. వారికి అంకితం ఇస్తున్నా అంటూ ఎమోషనల్
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు తెలుగు టెలివిజన్ సీజన్స్‌ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 కూడా పూర్తి అయింది. హౌస్లోకి 17 మంది కంటెస్టెంట్స్ వస్తే.. చివరకు ఏడుగురు కంటెస్టెంట్ లతో మిగిలిపోగా.. ఈ సారి టైటిల్ విన్నర్‌గా తెలుగు అమ్మయి బింధు మాధవి నిలిచారు. రెండో స్థానంలో అఖిల్ సార్థక్ ఉన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే

చరిత్ర
తెలుగు బిగ్ బాస్ సీజన్లు అన్నింటిలో బిందు మాధవి విన్నర్‌గా నిలిచిన మొదటి మహిళ కంటెస్టెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. బిగ్ బాస్ 2017లో ప్రారంభమైన మొదటి సీజన్‌లో శివ బాలాజీ, రెండవ సీజన్‌లో కౌషల్, మూడోవ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగవ సీజన్‌లో అభిజీత్, ఐదవ సీజన్‌లో సన్ని గెలవగా.. మొదటి సారి ఈ కొత్త ఫార్మాట్‌లో ఓ మహిళగా టైటిల్ విన్నర్ గా నిలిచింది.

టైటిల్ బిందునే
చివరి వారం మిగిలిన వారి లెక్కలు చూస్తే అనిల్ రాథోడ్, మిత్రశర్మ, అరియనా గ్లోరీ, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవిలు ఉన్నారు. వీరిలో ముందుగా అనిల్ రాథోడ్, తరువాత మిత్రశర్మ, తరువాత బాబా భాస్కర్, తరువాత అరియనా గ్లోరీ, తరువాత యాంకర్ శివ బయటకు రాగా చివరికి అఖిల్ సార్ధక్, బిందు మాధవి మధ్య టైటిల్ ఫైట్ నెలకొంది. ఇక చివరికి నాగార్జున ఇద్దరినీ టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించాడు కానీ చివరికి టైటిల్ బిందునే గెలుచుకుంది.

కన్నీరు పెడుతూ
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షో విజేతకు టైటిల్‌తో పాటు 40 లక్షల ప్రైజ్ మనీ కూడా అందింది. అయితే విజేతగా నిలిచిన అనంతరం మాట్లాడుతూ బిందు మాధవి ఎమోషనల్ అయింది. తన తండ్రి తన గురించి చెప్పిన మాటలు విని వెళ్లి ఆయనను గట్టిగా హత్తుకుంది. అమ్మానాన్నల హగ్ చేసుకుని బిందు మాధవి ఎమోషనల్ అయింది. తాను అందుకున్న ట్రోపీని అఖిల్‌తోనూ బిందు మాధవి షేర్ చేసుకుంది.. అనంతరం బిందు మాధవి కన్నీరు పెడుతూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది.

సక్సెస్ చాలా లేటుగా
ఓటు చేసిన వాళ్లకు, చేయని వాకూ, తనను ఆదరించిన వాళ్లందరికీ థ్యాంక్స్ అని చెబుతూ లేట్ బ్లూమర్స్ అందరికీ ఈ ట్రోఫీ అంకితం చేస్తున్నానని పేర్కొంది. ఇక తన జీవితంలో తనకు సక్సెస్ చాలా లేటుగా వచ్చింది.. చాలా ఏళ్ల తరువాత ఈ విన్నింగ్ ట్రోపీ వచ్చిందిని పేర్కొంది.

నమ్మకాన్ని వదలకండి
ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కొందరికి విజయం రాదు.. కొంత మంది నమ్మకాన్ని వదిలేస్తారు.. కానీ కొంత మంది చివరి వరకు నమ్మకంతో పోరాడుతున్నారు, అలా ఏ రంగం అయినా సరే మీపై మీకు నమ్మకం ఉంటే.. చివరి వరకు మీ లక్ష్యాన్ని వదలకండి.. గెలుస్తామన్న నమ్మకాన్ని వదలకండి అని బిందు మాధవి ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











