O Amazing Mitraaw అంటూ హోస్ట్ నాగార్జున ప్రశంసలు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఫైలిస్టుగా మిత్రా శర్మ

బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోలో మిత్రా శర్మ తనదైన శైలిలో దూసుకెళ్తున్నది. కంటెస్టెంట్ల నుంచి ఎదురైన ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలుచుకొని టైటిల్ రేసులో ముందుకెళ్తున్నది. టాప్ 7 ఫైనలిస్టుల్లో ఒకరిగా తన బలమైన ముద్రను ప్రేక్షకులు, బిగ్‌బాస్ అభిమానులపై వేసింది. అయితే హోస్ట్ నాగార్జున నిర్వహించిన వీకెండ్ షోలో మిత్రా శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీకెండ్ ఎలిమినేషన్స్ మధ్య ఆటపాటలతో నాగార్జున ఆసక్తిగా షోను ముందుకు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు ఇచ్చిన ఓ టాస్క్ సందర్భంగా మిత్రాపై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ టాస్క్ సందర్భంగా ఏం జరిగిందంటే..

ఇంటి సభ్యుల్లో ప్రతీ ఒక్కరిని మరో కంటెస్టెంట్‌ను కప్ గెలిస్తే ఎలా ఫీలవుతారో అలా విన్నింగ్ స్పీచ్ ఇస్తూ.. ఇమిటేట్ చేయాలని టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా శివను మిత్రా శర్మ మాదిరిగా నటించమని చెప్పాడు. దాంతో శివ స్టేజ్ మీదకు వచ్చి.. నా హ్యాష్ ట్యాగ్ OAM అని చెప్పండి. OAM అని గట్టిగా చెప్పండి. OAM అని పలుసార్లు అనడం వల్లే నాకు ఈ ట్రోఫి వచ్చింది. బిందు కూడా OAM అని ప్రమోట్ చేసింది. నేను ఇంత ఫేమస్ అయ్యాననే అంటే ఓఏఎం.. అందుకే నేను గెలిచాను అని శివ ఇమిటేట్ చేశాడు. దాంతో OAM అంటే ఏమిటి అని నాగార్జున అడిగితే.. ఓ అమేజింగ్ మసాలా అని శివ చెప్పాడు. దాంతో OAM అంటే.. ఓ అమెజింగ్ మసాలా కాదు.. O Amazing Mitraaw అని నాగార్జున అనడంతో మిత్రా శర్మ పొంగిపోయింది. ఆ మాట బాగుంది.. నేను దానిని తీసుకొంటాను. అని మిత్రాశర్మ హ్యాపీగా ఫీలయ్యింది.

Actress Mitraaw Sharma become as Bigg Boss Nonstop Finalist. Nagarjuna praises Mitraaw Sharma as O amazing Mitraaw

ఇక శివను మిత్రా శర్మ అనుకరించి ఆకట్టుకొన్నది. ట్రోఫిని పట్టుకొని.. నేను ఎన్నో అవమానాలు, మాటలు పడ్డాను. కానీ నా ప్రయాణాన్ని ఆపలేదు. నన్ను కాంట్రవర్సి శివ అన్నారు. కానీ ఇప్పుడు నన్ను విన్నర్ శివ అని అంటారు. ఈ ట్రోఫిని నా చెల్లి జమున, డాడీ, అమ్మకు ఇద్దాం. ఇది మీది.. ఇది మీ అందరిది అని శివ మాదిరిగా మిత్రాశర్మ నటించి మెప్పించింది.

ఇక మిత్రా శర్మ తాజా వారానికి సంబంధించిన ఓటింగ్ విషయానికి వస్తే..అత్యధికంగా 26 శాతం ఓట్లు సాధించి.. ఫైనలిస్టుగా నిలిచింది. ఇంటి సభ్యుల్లో అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్‌గా నిలవడం విశేషం.

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు ఇది చివరి వారం. ప్రస్తుతం 11వ వారంలోకి ఈ షో ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫినాలేలో విజేతగా నిలువడానికి ఏడుగురు కంటెస్టెంట్లు సిద్దంగా ఉన్నారు. మిత్రా శర్మ టాప్ 5లో చేరేందుకు తన టాలెంట్‌తో నెటిజన్లను, బిగ్‌బాస్ అభిమానులను ఆకట్టుకొన్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X