Bigg Boss Nonstop : రచ్చరచ్చగా నామినేషన్స్.. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి కావడంతో ఇప్పుడు బిగ్ బాస్ ను ఓటీటీ వేదికగా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట డిస్నీ +హాట్ స్టార్ యప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంది. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ ఎప్పటిలాగే వాడీ వేడిగా సాగాయి. ఇక తొమ్మిదో వారం ఎవరెవరు ఎవరెవరిని నామేనిట్ చేశారు? చివరికి ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కుండలను బ్యాట్‌ తో బద్దలు కొట్టి

కుండలను బ్యాట్‌ తో బద్దలు కొట్టి

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎప్పుడూ జరిగే విధంగానే నామినేషన్స్‌ వాడీ వేడిగా సాగాయి. ప్రతివారం ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో నామినేషన్స్ పెడుతున్న బిగ్ బాస్‌ ఈ వారం కూడా అదే తరహాలో ఒక కొత్త కాన్సెప్ట్ తో నామినేషన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. దిష్టిబొమ్మలు పెట్టి వాటిపై కుండలు పెట్టి నామినేట్ చేయాలనుకున్న వారి కుండలను బ్యాట్‌ తో బద్దలు కొట్టి నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు.

ఓ రేంజ్ లో ఫైర్

ఓ రేంజ్ లో ఫైర్

ఇక వారం అంతా ఈ రోజు కోసమే ఎదురు చూసే కంటెస్టెంట్ లు ఎప్పటిలాగే తమ వారం రోజుల ఫ్రస్టేషన్ ఈ నామినేషన్స్ లో చూపించారు. అఖిల్ కెప్టెన్ కావడంతో అతనికి ఈ నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. అయితే అఖిల్ మాత్రం యాంకర్ శివ, హమీదలను నామినేట్ చేశాడు.

ఈ నామినేషన్ సమయంలో అఖిల్ కి శివకి మళ్లీ బాత్రూమ్ టాపిక్ వచ్చింది. ఆ తర్వాత అరియానా నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయగా ఆయన ఎప్పటిలానే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

మీద మీదకి వచ్చారని

మీద మీదకి వచ్చారని

అరియనా స్వార్థం అని, ఆమె అసలు గేమ్ ఆడటం లేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఆయన కామెంట్స్ కు అరియనా కూడా ధీటుగా సమాధానం చెప్పింది. ఆ తరువాత హమీదను అరియానా నామినేట్ చేసింది. యాంకర్ శివ ముందు నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేస్తూ గేమ్ ఆడే సమయంలో తన మీద మీదకి వచ్చారని ఇకపై అలా చేయొద్దని చెప్పాడు. ఆ తరువాత మిత్రాశర్మను శివ నామినేట్ చేశాడు.

గట్టి గట్టిగా అరిచి

గట్టి గట్టిగా అరిచి

దీంతో మిత్రా బాధపడుతూ గట్టి గట్టిగా అరిచింది. ఇక హమీద అరియనా, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేసింది. ఈ క్రమంలో వారిద్దరితో హమీదకు గొడవైంది. అషురెడ్డి యాంకర్ శివను నామినేట్ చేసింది. కొద్దిరోజుల నుంచి తనతో ప్రవర్తించిన తీరు బాలేదు అని కారణం చెప్పింది. ఆ తర్వాత బాబా భాస్కర్ ని నామినేట్ చేసింది. మిత్రాశర్మ యాంకర్ శివను నామినేట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. ఆ తర్వాత బిందు మాధవిని నామినేట్ చేసింది.

 ఈ వారం ఎవరెవరంటే

ఈ వారం ఎవరెవరంటే

అనిల్ నటరాజ్ మాస్టర్, బాబా మాస్టర్ లను నామినేట్ చేశారు. బిందు మాధవి మిత్రశర్మ, యాంకర్ శివలను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. అనిల్, అరియానాలను నామినేట్ చేశాడు. అలా రచ్చ రచ్చగా సాగిన నామినేషన్స్ తరువాత ఈ వారం నామినేట్ అయిన సభ్యులుగా నటరాజ్ మాస్టర్, శివ, మిత్రాశర్మ , అరియనా, బాబా భాస్కర్, హమీద, అనిల్ నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X