Bigg Boss Nonstop టాప్ 7 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్.. ఎవరికి హయ్యెస్ట్, ఎవరికి లీస్ట్ అంటే?
బిగ్‌బాస్ షో అంటే ఇష్ట పడేవాళ్లే కాదు, ఇష్టపడని వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. బిగ్‌బాస్ కాన్సెప్ట్‌ను తిట్టిపోస్తూనే షో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా కోకొల్లలు. అయితే ఎవరెన్ని చెప్పినా, ఏమి చెప్పినా బుల్లితెర ఆడియన్స్ మాత్రం బిగ్‌బాస్ షోను విపరీతంగా ఆదరిస్తారు. అలా తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను ప్రేక్షకులు విజయవంతం చేశారు. ఈ ధైర్యంతో నిర్వాహకులు బిగ్‌బాస్ ఓటీటీని కూడా ముందుకు తీసుకువచ్చారు. ఇక చివరి వారానికి చేరిన ఈ నాన్ స్టాప్ సీజన్ లో ఉన్న టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒక లుక్కు వేద్దాం.

జనానికి బాగా నోటెడ్
కేవలం హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మొదట్లో కొంత ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా ఆ తరువాత ఆసక్తికరమైన సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, సన్నివేశాలు, బోల్డు సీన్స్, లవ్ ట్రాకులు, శృతి మించిన బూతుల గొడవలు చూపించడంతో జనానికి బాగా నోటెడ్ అయింది.

ప్రస్తుతం హౌస్‌లో
మొదట 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కూడా చేరడంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 18కి చేరుకుంది. ఇప్పటివరకు శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్, అజయ్, హమీదా, అషూ, నటరాజ్ వరసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్ మిగిలారు.

మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశాలు
ఈ టాప్ 7లో నుంచి ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదనుకోండి అది వేరే విషయం. ఇక ప్రస్తుతానికి షోలో ఉన్న ఏడుగురి రెమ్యునరేషన్లు ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

అందరికంటే ఎక్కువగా
ఇక ఈ సీజన్ లో అఖిల్ సార్థక్, బిందుమాధవి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎలాగైనా ఈసారి టైటిల్ గెలవాలని కసిగా ఆడిన అఖిల్‌కు అతడి అభిమానులు సపోర్ట్ చేస్తుంటే, ఆడపులి అంటూ క్రేజ్ తెచ్చుకున్న బిందుమాధవికి ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సీజన్ లో అందరికంటే ఎక్కువగా అఖిల్ సార్థక్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.

బాబా భాస్కర్ కు
ఆయనకు వారం రోజులకు గాను రెండు లక్షల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని అంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో బిందు వారం రోజులకు గాను లక్షా డెబ్భై ఐదు వేల దాకా అందుకుంటోంది. ఇక వీరి తరువాత అరియానకు కూడా లక్ష డెబ్భై ఐదు వేల దాకా సొమ్ములు అందుతున్నాయని అంటున్నారు. బాబా భాస్కర్ కు వారానికి లక్షన్నర దాకా రెమ్యునరేషన్ అందుతోందని అంటున్నారు.

అందరికంటే తక్కువగా
ఇక శివ కూడా వారానికి లక్ష నలభై వేల దాకా అందుకుంటున్నారని అంటున్నారు. అంతేకాక మిత్రా కూడా లక్ష పాతిక వేల రూపాయలు అందుకుంటుందని అంటున్నారు. అందరికంటే తక్కువగా అనిల్ రాథోడ్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే అందుకుంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











