Bigg Boss Nonstop : నామినేషన్లలోకి ఆరుగురు.. వస్తూనే బింధుకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాబా భాస్కర్
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి ఎంటర్ అయింది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో మహేష్ విట్టా ఎలిమినేట్ కాగా బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో అన్ని రోజులు ఒక ఎత్తైతే, నామినేషన్స్ రోజు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నవాళ్లు కూడా నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం అన్నీ పక్కనపెట్టేసి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఎనిమిదో వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

పెద్ద రాచ్చకే దారి తీసి
సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్లు ఆసక్తికరంగా మారాయి. ఆ నామినేషన్ల ఘట్టంలో ముందుగా అజయ్ అనిల్, హమీదలను టాస్క్ లో బిహేవియర్ బాగోలేదని చెబుతూ నామినేట్ చేశాడు. ఆ తర్వాత అరియనా వంతు రావడంతో అషురెడ్డి, అఖిల్ లను నామినేట్ చేసింది. ఈ విషయంలో అరియానాకు అషురెడ్డి, అఖిల్ ఇద్దరితో పెద్ద మాటల యుద్ధం జరిగింది. అరియానా అసలు గేమ్ ఆడటం లేదని.. బిగ్ బాస్ హౌస్ కి వెకేషన్ కి వచ్చింది అంటూ అషురెడ్డి పేర్కొనడం పెద్ద రాచ్చకే దారి తీసింది.

వెటకారంగా కామెంట్స్
ఇక అనిల్ వంతు రావడంతో నటరాజ్ మాస్టర్, అజయ్ లను నామినేట్ చేశాడు. హమీద నామినేట్ కూడా అజయ్, అషురెడ్డిలను చేయడంతో ఇద్దరూ ఆమెపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. 'హమీద నీ మెంటల్ స్టేటస్ బాగానే ఉందా..?' అంటూ అషురెడ్డి అడగడంతో హమీదకు ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చింది. ఆ తర్వాత అఖిల్ తనని నామినేట్ చేసిన అరియనాను నామినేట్ చేస్తూ తను గేమ్ ఆడటం లేదని అనడంతో ఆమె కూడా ఎక్కడా తగ్గకుండా చాలా వెటకారంగా కామెంట్స్ చేసింది.

చాలాసేపు మాటల యుద్ధం
అలాగో మరో ఆప్షన్ ఉండడంతో ఎప్పటిలానే తనకు గట్టి పోటీ అని భావిస్తున్న బిందుని అఖిల్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఈక్రమంలో ఎలిమినేట్ అయి బయటకు వెళ్లి స్రవంతిని ఎమోషనల్ గా వాడుకున్నావు అంటూ అఖిల్ ని బిందు కామెంట్ చేసింది. దీంతో అఖిల్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇక నటరాజ్ మాస్టర్ అనిల్, హమీదలను నామినేట్ చేయగా హమీద, నటరాజ్ మధ్య చాలాసేపు మాటల యుద్ధం నడిచింది.

వాగ్యుద్ధం
ఇక మిత్రశర్మ.. అషురెడ్డి, బిందు మాధవిలను నామినేట్ చేసి స్రవంతి టాపిక్ తీసుకురావద్దని బిందుతో అనడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్యుద్ధం నడిచింది. ఇక అషురెడ్డి.. మిత్రాశర్మ, హమీదలను, బిందు మాధవి.. అఖిల్, అజయ్ లని నామినేట్ చేసింది. యాంకర్ శివ.. అషురెడ్డి, అఖిల్ లను నామినేట్ చేశాడు.

స్పెషల్ పవర్స్
అలా ఈ వారం అఖిల్, అషురెడ్డి, బిందు మాధవి, అనిల్, హమీద, అజయ్ నామినేట్ అయ్యారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు తలకు జండూ బాం రాసుకున్న బాబా భాస్కర్ కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. నామినేట్ అయిన ఆరుగురి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో బాబా భాస్కర్ బిందుమాధవి పేరు చెప్పారు. అలా ఈ వారం నామినేషన్స్ లో అఖిల్, అషురెడ్డి, అనిల్, హమీద, అజయ్ నిలిచారు.


Click it and Unblock the Notifications











