Bigg Boss Nonstop : అపరిచితుడులా మిత్రా శర్మ.. మామూలు పెర్ఫార్మన్స్ కాదుగా.. మబ్బులిడిపోయే విధంగా!
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికి ఏడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదవ వారంలోకి ఎంటర్ అయింది. 8వ వారం లో కూడా ఒకరు ఎలిమినేట్ కావాలి కాబట్టి నామినేషన్ ప్రక్రియ సోమవారం నాడు చేపట్టారు. ఇక ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోని మిత్రశర్మ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మాత్రం రెచ్చిపోయింది. తనలో ఉన్న అపరిచితుడిని నిద్రలేపింది. ఈ నామినేషన్స్ లో మిత్రశర్మ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

గుర్తింపు లేకపోయినా
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లోకి కొత్త కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మిత్రశర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే ఆమె చేసిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు కాబట్టి. ఆమె కొత్త కంటెస్టెంట్ అనే తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. హౌస్ లో కూడా ఆమె పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోదు. ఎప్పటికప్పుడు సైలెంట్ గా నే ఉంటూ ఇప్పటివరకు హౌస్లో కొనసాగుతోంది. ఆమెకు బిగ్ బాస్ అండదండలు ఉన్నాయి కాబట్టి పెద్దగా గుర్తింపు లేకపోయినా ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతోంది అనే ప్రచారం అయితే ఉంది.

రెస్పెక్ట్ స్పెల్లింగ్ తెలుసా?
ఆ సంగతి పక్కన పెడితే 8వ వారం జరిగిన నామినేషన్స్ లో మిత్రశర్మ రెచ్చిపోయింది.. అషురెడ్డిని నామినేట్ చేస్తూ.. 'నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు.. నువ్వు ఫింగర్ చూపిస్తే నేను చూపిస్తా.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అసలు నీకు రెస్పెక్ట్ స్పెల్లింగ్ తెలుసా? అని అషు వెటకారం చేయడంతో.. నీకు తెలుసు కదా.. స్పెల్లింగ్ అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత బిందు మాధవిని నామినేట్ చేస్తూ అఖిల్ విషయంలో వెళ్లి పోయిన స్రవంతి గురించి మాట్లాడటం నాకు నచ్చలేదు.. అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది.

బయట ఉన్నది ఒక్కరే
అయితే వెళ్లిపోయిన వాళ్ల గురించి మాట్లాడకూడదు అని ఏమైనా రూల్ ఉందా? నువ్వు బయట వాళ్ల గురించి ఎప్పుడూ మాట్లాడలేదా? అని బిందు మాధవి ప్రశ్నించింది. గేమ్‌లో ఉన్న వాళ్లగురించే మాట్లాడుతున్నావా? అని మిత్రాకి కౌంటర్ ఇవ్వడంతో మిత్రాలోని అపరిచితుడు నిద్ర లేచాడు. నాకు తల్లిదండ్రులు లేరు.. బయట ఉన్నది ఒక్కరే.. అందుకే వాళ్ల గురించి చెప్తున్నా తప్పితే గేమ్‌లో ఉన్న వాళ్ల గురించి మాట్లాడలేదు.. నువ్వు వెళ్లిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం మానెయ్యమని అనడంతో బిందు మాధవి..

ఒకే ఒక్క బా
నువ్వు బయట వాళ్ల గురించి చెప్పడం మానేస్తావా? అయితే అని అడిగింది. ఇక మాటతో ఎమోషనల్ అయ్యి సరే అయితే ఈరోజు నుంచి నేను నా బా.. గురించి మాట్లాడను, నాకు ఎవరూ లేరు.. ఒకే ఒక్క బా ఉన్నాడు.. నేను చనిపోయినా కూడా తలకొరివి పెట్టే మనిషి లేడు తెలుసా? అంటూ బోరు బోరున ఏడవడం మొదలు పెట్టింది. ఇదెక్కడ గోల అనుకున్న బిందు మాధవికి నవ్వు వచ్చింది.

ఇదేం ట్విస్ట్
ఇక ఈక్రమంలో ఆమె నవ్వుతూ వెళ్లి బిందు మాధవిని హగ్ చేసుకుందో తెలియలేదు. ఈ సీన్ చూసిన బాబా భాస్కర్.. ఇదేం ట్విస్ట్ తల్లే.. ఇంతసేపు తిట్టుకుని హగ్ చేసుకుంటున్నారు అనుకున్నాడు పాపం. ఇక స్పెషల్ పవర్ తో బిందు మాధవిని బాబా భాస్కర్ సేవ్ చేయడం ద్వారా.. అఖిల్, అనీల్, హమీదా, అషురెడ్డి, అజయ్ ఈ ఐదుగురు నామినేషన్‌లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











