Bigg Boss OTT 2 2 బిగ్‌బాస్ ఓటీటీలో సంచలనం.. రెండు రోజుల్లో ఇద్దరు ఎలిమినేట్.. ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ ఓటీటీ 2 సీజన్ హిందీలో రంజుగా, రసవత్తరంగా మొదలైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా జూన్ 17వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో సంచలన సంఘటనలు నమోదయ్యాయి. ఆట ప్రారంభమైన రెండో రోజే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం సెన్సేషన్‌గా మారింది. సల్మాన్ ఖాన్ షోలో ఊహించని విధంగా గేమ్ సాగుతుండటం ఆడియెన్స్‌ను షోపై దృష్టిపెట్టేలా చేసింది. తాజా ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఓటీటీ 2 (Bigg Boss OTT 2) సీజన్‌లో స్టార్ కంటెస్టెంట్ ప్రకాశ్ కుమార్ అలియాస్ పునీత్ సూపర్ స్టార్‌కు భారీ షాకిచ్చారు. ఇంటి సభ్యులతో దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించినందుకు, అలాగే ఇంటిలోని ప్రాపర్టీని ధ్వంసం చేసినందుకు గాను బిగ్‌బాస్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. రెండో రోజే కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

ఇక రెండో ఎలిమినేషన్ విషయానికి వస్తే.. పలక్ పురస్వనికి గట్టి దెబ్బ తగిలింది. పలక్ పురుస్వని, ఆకాంక్ష పురి ఎలిమినేషన్ బాధ్యతను బిగ్‌బాస్ పబ్లిక్ చేతిలో పెట్టాడు. మూడు గంటల్లో ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దాంతో పలక్‌ను ఎలిమినేట్ చేస్తూ పబ్లిక్ తీర్పు చెప్పారు. అయితే పలక్ ఎలిమినేషన్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చారు.
ఫలక్ ఇంటిలో ఉండటానికి మరో అవకాశం బిగ్‌బాస్ ఇచ్చారు. బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న కరెన్సీ సిస్టమ్ ద్వారా ఫలక్ తలరాతను తేల్చే ప్రయత్నం చేశారు. 30 వేల కరెన్సీని సంపాదించాలని పలక్‌కు టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్‌లో విజయం సాధిస్తే.. ఫలక్ ఇంటిలో ఉంటుంది. అయితే ఫలక్ ఎలిమినేషన్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
బిగ్‌బాస్ ఓటీటీ 2 సీజన్‌లో స్టార్ హీరోయిన్ పూజా భట్, సైరస్ బ్రోచా, ఫలక్ నాజ్, జియా శంకర్, మనీషా రాణి, జాద్ హడిడ్, బేబికా ధ్రుర్వే, అలియా సిద్దిఖీ, అభిషేక్ మల్హాన్ తదితరులు కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఇంకా పలువురు కంటెస్టెంట్లు తొలి రెండు రోజుల్లో సంచలనాలు నమోదు చేసేందుకు ప్రయత్నించారు.

బిగ్‌బాస్ ఓటీటీ 2 సీజన్ క్రేజీగా ప్రారంభమైంది. తొలి సీజన్‌కు కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే.. రెండో సీజన్‌కు సల్మాన్ ఖాన్‌ను హోస్ట్‌గా తీసుకొచ్చారు. ఈ సీజన్ ప్రస్తుతం జియో సినిమా యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ప్రతీ రోజు 9 గంటలకు హైలెట్స్ ప్రసారం అవుతున్నాయి. ఇక 24 గంటలపాట లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











