Bigg Boss TRP Ratings బిగ్‌బాస్ ఓటీటీ 2 బడ్జెట్ ఎంత? సల్మాన్ ఖాన్ రియాలిటీ షో హిట్టా? ఫట్టా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 అట్టహాసంగా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఊహించని విధంగా పూజా భట్ లాంటి అగ్ర హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ రియాలిటీ షో కొంత క్రేజీగా మారింది. తొలి రెండు రోజుల్లోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌ను ఎదుర్కొనడంతో రియాలిటీ షో మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. అయితే బిగ్ బాస్ ఓటీటీ తొలి వారం ఏ రేంజ్ టీఆర్పీని సాధించింది? ఈ షో బడ్జెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 షోలో కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. పూజా భట్, అభిషేక్ మల్హన్, పూనీత్ కౌర్, పలక్ పురుస్వాని, అవినాష్ సచ్‌దేవ్, మనీషా రాణి, జియా శంకర్, జాడ్ హడీడ్, ఫలక్ నాజ్, సైరస్ బ్రోచా, బేబికా ధుర్వే, ఆకాంక్ష పూరి, ఆలియా సిద్ధిఖి ఉన్నారు.

 Bigg Boss OTT 2

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 భారీ బడ్జెట్‌తో ప్రారంభించారు. గతంలో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 1 కంటే ఎక్కువగానే బడ్జెట్‌తో ఈ షోను డిజైన్ చేశారు. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2‌ను సుమారు 500 కోట్ల రూపాయలతో ప్రారంభించినట్టు సమాచారం. వీటికి అదనంగా కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 తొలివారం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మినిమమ్‌గా నిర్వహించిన ప్రమోషన్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే తొలివారం కొన్ని సంచలన సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ షోపై అందరి దృష్టిపడింది. దాంతో తొలి వారం 25 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది.

 Bigg Boss OTT 2

ఇక బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 సీజన్ రెండో వారంలో భారీగా పుంజుకొన్నది. తొలివారంతో పోల్చుకొంటే రెండో వారంలో రెండింతలు వ్యూస్‌ను సాధించింది. రెండోవారంలో ఈ షో 50 లక్షల వ్యూస్ సాధించింది. హాట్ హాట్‌గా సంఘటనలు, కాంట్రవర్సీలు ఈ షోను ఆసక్తికరంగా మార్చాయి. అయితే 50 లక్షల వ్యూస్ అనేది ప్రస్తుతం యావరేజ్‌గానే పరిగణిస్తున్నారు.

బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 విషయానికి వస్తే.. జియో సినిమా యాప్‌లో ప్రసారం అవుతున్నది. ఇటీవల ఐపీఎల్‌తో జియో సినిమా యాప్ మరింత పాపులారిటీ అయ్యింది. తాజాగా ఓటీటీ షోతో మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నది. ఈ యాప్‌లో 24 గంటలపాటు ఓటీటీ షోను చూడవచ్చు. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో హైలెట్స్‌తో కూడిన బులెటిన్‌ను ప్రసారం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X