‘ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్నావా?’
బిగ్‌బాస్ హిందీ ఓటీటీ 3 ఆసక్తికరంగా, రసవత్తరంగా మొదలైంది. ఇంటిలో యూట్యూబర్, సోషల్ మీడియాలో ఇన్‌ప్లూయెన్సర్ అర్మాన్ మాలిక్‌పైనే అందరి దృష్టి పడింది. కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా ప్రేక్షకుల కూడా ఆయన ఆట తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే.. అర్మాన్ ప్రస్తుతం బిగ్‌బాస్ ఇంటిలో ఇద్దరు భార్యలతో ప్రవేశించడమే ఆసక్తిగా మారింది. అయితే తాజాగా ఆయనను కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
అర్మాన్ తన ఇద్దరు భార్యలతో రావడంపై దేవోలీనా భట్టాచార్జీ స్పందిస్తూ.. ఇలా ఇద్దరు భార్యలతో రావడం ఎంటర్‌టైన్‌మెంటా? ముమ్మాటికి ఇది ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. పక్కా బూతు షోగా మార్చేశారు. ఇది సోషల్ మీడియా రీల్ కాదు.. రియల్ లైఫ్ అని అన్నాడు.

అర్మాన్ మాలిక్ ఇంటిలోకి ప్రవేశించగానే నీవు కంటెస్టెంట్ కరణ్ సెటైర్ విసిరాడు. నీవు చాలా అదృష్టవంతుడివి. ఇద్దరు భార్యలతోని ఇంటిలోకి రావాలంటే పెట్టి పుట్టాలి. నిజంగా నీవు లక్కీ పర్సన్‌వే. ఇంత పెద్ద ఇంటిలో ఇద్దరు భార్యలతో నీవు ఎంజాయ్ చేసేయ్ అని కరణ్ కుద్రా అన్నారు.
అయితే కరణ్ కుంద్రా ఓ అడుగు ముందేసి.. జనాలకు ఒక్క భార్యను హ్యాండిల్ చేయడమే కష్టంగా ఉంది. నీవు ఇద్దరిని ఎలా మెయింటెన్ చేస్తున్నావు. అది కూడా కెమెరా మధ్య ఇద్దరు భార్యలతో ఎలా ఉంటావు. ఈ షోలో ఎలా మేనేజ్ చేస్తావో వేచి చూడాల్సిందే అని కామెడీ చేశాడు.

తాజాగా ఇంటిలో దీపక్ చౌరాసియాకు అర్మాన్ మాలిక్ మధ్య భారీ గొడవ జరిగింది. ప్రతీ విషయంలో వేలు పెట్టకు. నీలాంటి వాడిని నా ఆఫీస్‌కు వస్తే.. రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంచుతాను అని దీపక్ అంటే.. నా ఇంటికి వస్తే.. గేటు బయటే నిలబెడుతాను అంటూ ఘాటుగా జవాబిచ్చాడు.
అనిల్ కపూర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోలో వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్‌వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా, దీపక్ చురాసియా, టీవీ నటుడు సాయి కేతన్ రావు, టారోట్ కార్డ్ రీడర్ మునీషా ఖత్వానీ, మోడల్ సనా సుల్తాన్ ఖాన్, యూట్యూబర్ అర్మాన్ ఖాన్, అర్మాన్ మాలిక్ భార్య పాయల్ మాలిక్, అర్మాన్ మాలిక్ రెండో భార్య క్రితికా మాలిక్, బాక్సర్ నీరజ్ గోయట్, ర్యాపర్ నాయేజ్, టీవీ నటి పలౌమీ పోలో దాస్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











