Bigg Boss OTT 2 సీజన్ ప్రారంభం.. కంటెస్టెంట్స్ ఎవరంటే? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2 షోకు రంగం సిద్దమైంది. సల్మాన్ ఖాన్ హెస్ట్‌గా అంగరంగ వైభవంగా ఈ షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం రాత్రి అంటే జూన్ 17వ తేదీన ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానున్నది. ఈ రియాలిటీ షోలో వివాదాస్పద వ్యక్తులు, నిత్యం వార్తల్లో సంచలనాలు నమోదు చేసే సెలబ్రిటీలు, టెలివిజన్ తారలు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రముఖులు భాగస్వామ్యం కాబోతున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ గురించి? ఈ సీజన్‌లో పాల్గొనే తారల గురించిన వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. డబుల్ డెక్కర్ బస్సుపై ఓటీటీ నిర్వహించే హౌజ్ వద్దకు చేరుకొన్నారు. సల్మాన్ ఖాన్ రాగానే మీడియా కెమెరాలు చకచకా తమ పని తాము చేసుకొంటూ పోయాయి. హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు.

బిగ్‌బాస్ ఓటీటీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటీటీ వల్ల మన సంస్కృతిని పాడు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటాను. కంటెంట్ ఇంప్రూవ్‌మెంట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకొంటాను. ఓటీటీ గైడ్‌లైన్స్ అమలు అయ్యేలా నేను చర్య తీసుకొంటాను. అశ్లీలత, అసభ్యత, బూతులు లేకుండా చర్యలు తీసుకొంటున్నాం. పిల్లలు చూస్తుంటారు కాబట్టి క్లీన్ కంటెంట్ ఉండేలా చూసుకొంటాం అని సల్మాన్ ఖాన్ అన్నారు.
బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 2లో ఎవరెవరూ ఉన్నారనే విషయంలోకి వెళితే.. ఆలియా సిద్దిఖి, పలక్ పురస్వాని, అవినాష్ సచ్‌దేవ్, మనీషా రాణి, ఆకాంక్ష పూరి, జియా శంకర్, ఫలక్ నాజ్, సైరస్ బ్రోచా, జద్ హదీద్, బేబికా ధ్రువే తదితరులు ఉన్నారు. ఇంకా కొంత మంది పేర్లు వెల్లడి కావాల్సి ఉన్నాయి.
ఆలియా సిద్దిఖి విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ మాజీ భార్య. అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ సపరేట్ అయ్యారు. ఇక సైరస్ బరుచా విషయానికి వస్తే.. ప్రముఖ వీడియో జాకీ. ఎంటీవీ బ్రాకా షో ద్వారా సుపరిచితులు. జాద్ హదీద్ లెబనాన్‌కు చెందిన మోడల్. దుబాయ్‌లో ఉంటున్నాడు. మిడిల్ ఈస్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే మోడల్స్‌లో ఒకరు.

ఇక బిగ్‌బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. ప్రముఖ ఓటీటీ ఛానెల్ జియో సినిమాలో ప్రసారం కానున్నది. ఓటీటీ షో 24 గంటలపాటు ప్రసారం కానున్నది. వారాంతంలో హోస్ట్ సల్మాన్ ఖాన్ వచ్చి ఆ వారం ఎపిసోడ్‌ను, సెలబ్రిటీని ఎలిమినేట్ చేస్తారు. ఈ ఓటీటీ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











