Bigg Boss బిగ్‌బాస్ హోస్ట్‌గా సీనియర్ స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్.. తొలి కంటెస్టెంట్ ఎవరంటే?
దేశంలో అత్యధిక మంది ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ హిందీలో ఓటీటీ సీజన్ 3 ప్రారంభానికి అన్ని హంగులు పూర్తి చేసుకొన్నది. అయితే ఇప్పటి మాదిరిగా కాకుండా ఈ సారి హోస్ట్ మారడంతో అందరిలో ఆసక్తిని రేపుతున్నది. ఇప్పటి వరకు ఎన్నో సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరించిన సూపర్ స్టార్‌ను పక్కన పెట్టి.. మరో స్టార్ హీరోను హోస్ట్‌గా పెట్టడం బిగ్‌బాస్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. మారిన హోస్ట్ వివరాల్లోకి వెళితే..
హిందీ బిగ్‌బాస్ అంటే సల్మాన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ అంటే బిగ్‌బాస్ షో.. గత 17 సీజన్లుగా ఆయన హోస్ట్‌గా మెప్పించడం కాదు.. అదరగొట్టడంతో ఆ షో హిట్టు కావడానికి ప్రధాన కారణం. అలాంటి హోస్ట్ లేకుండా ఆయన స్థానంలో అనిల్ కపూర్ తీసుకు రావడం ఓ రకంగా షాక్ గురి చేస్తున్నది.

అయితే బిగ్‌బాస్ ఓటీటీని తొలుత కరణ్ జోహర్‌ను హోస్ట్‌గా పెట్టి ప్రారంభించారు. అయితే రెండో సీజన్‌కు వచ్చే సరికి మళ్లీ సల్మాన్ ఖాన్‌ను హోస్టుగా నియమించారు. దాంతో రెండో సీజన్‌కు భారీగా వ్యూవర్ షిప్ వచ్చింది. అయితే మూడో సీజన్‌కు సల్మాన్ ఖాన్ మార్చడం అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది.
అయితే బిగ్‌బాస్ ఓటీటీ 3వ సీజన్‌కు హోస్ట్‌గా ఎంపిక కావడంపై అనిల్ కపూర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాకు ఓ కలలా అనిపిస్తున్నది. నాకు ఓ డ్రీమ్ టీమ్‌ను కూడా అప్పగించారు. ఈ షోకు హోస్ట్‌గా రావడంతో నవ యవ్వనం వచ్చిందా అనే ఫీలింగ్ కలుగుతున్నది అని అనిల్ కపూర్ అన్నారు.

ఇక బిగ్‌బాస్ ఓటీటీ షో అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ షో జూన్ 21వ తేదీన ప్రారంభం కానున్నది. ఈ షోను జీయో సినిమా ఓటీటీ ఛానెల్‌లో 9 గంటల నుంచి స్టీమింగ్ అవుతుంది. అలాగే ఊట్ చానెల్‌లో కూడా చూడొచ్చని కూడా చెబుతున్నారు.
ఇక బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3లో తొలి కంటెస్టెంట్‌గా వడపావ్ గర్ల్ అలియాస్ చంద్రిక దీక్షిత్ ఎంపికయ్యారు. సోషల్ మీడియాలో వడపావ్ గర్ల్‌గా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. ఫుడ్ వ్లాగర్ అయిన ఆమె వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. దాంతో ఆమెను షోలోకి తొలి కంటెస్టెంట్‌గా తీసుకొన్నారు.


Click it and Unblock the Notifications











