twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ariyana Glory: అది నాకు నిజంగానే ఒక ఎమోషన్.. కన్నీళ్లు పెట్టుకున్న అరియానా గ్లోరి

    |

    బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారా అనేకమంది సెలబ్రిటీలుగా మారారు. అప్పటివరకు ఓ మాదిరిగా సాగుతున్న కెరీర్ బిగ్ బాస్ ఫేమ్ తో ఊపందుకుంటోంది. అలా దివి వాద్యా, అషు రెడ్డి, అఖిల్ సార్థక్, సోహైల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ద్వారా అధిక పాపులారిటీ తెచ్చుకున్న మరో బ్యూటి అరియానా గ్లోరి. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్, ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొని ఫినాలే వరకు చేరుకుంది. ప్రస్తుతం బీబీ కేఫ్ హోస్ట్ చేస్తోన్న అరియానా గ్లోరిని అదే బీబీ కేఫ్ లో ఆర్జే కాజల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఎలా సాగిందన్న వివరాల్లోకి వెళితే..

    అరియానాను హోస్ట్ చేసిన కాజల్..

    అరియానాను హోస్ట్ చేసిన కాజల్..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సరికొత్తగా అందరినీ హోస్ట్ చేసిన యాంకర్ అరియానా గ్లోరిని ఆర్జే కాజల్ ఇంటర్వ్యూ చేసింది.

    గెస్ట్ కు టార్చర్..

    గెస్ట్ కు టార్చర్..

    ఇన్ని ఎపిసోడ్స్ నువ్ హోస్టింగ్ చేశావ్ కాబట్టి అని ఆర్జే కాజల్ చెబుతుంటే.. ఇప్పుడు నువ్ నన్ను రోస్ట్ చేస్తావ్ అని అరియానా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. నువ్ ప్రతీరోజు గెస్ట్ కు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో.. ఇవాళ హోస్ట్ గా నేను నీకు పెట్టబోతున్నాను అని ఆర్జే కాజల్ చెప్పింది. దీనికి నేను హోస్ట్ గా ఉంటే గెస్ట్ కు టార్చర్.. నేను గెస్ట్ గా ఉంటే హోస్ట్ కు ఫ్రాక్చర్ అని మరోసారి నవ్వించింది అరియానా గ్లోరి.

    కచ్చితంగా నువ్ కాదు..

    కచ్చితంగా నువ్ కాదు..

    ఈ మొత్తం సీజన్ లో నీకు బాగా నచ్చిన గెస్ట్ ఎవరు అని ఆర్జే కాజల్ అడిగింది. దీనికి అమ్మో.. ఇరుకులో పెట్టేసావ్ గా అని అరియానా అంటే.. ఇందులో ఇరుకు ఏముందిలే.. చెప్పు అంటూ సిగ్గుపడింది ఆర్జే కాజల్. ఎందుకంత సిగ్గు పడుతున్నావ్ కాజల్.. కచ్చితంగా నువ్ కాదు.. అని అరియానా అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఆర్జే కాజల్. నువ్ ప్రతీరోజు కొన్ని కొన్ని మీమ్స్ వేసేదానివి. అందులో బాగా గుర్తుండిపోయిన మీమ్ ఏది అని కాజల్ అడిగింది.

    అది నా ఫేవరెట్..

    అది నా ఫేవరెట్..

    ఆర్జే కాజల్ మీమ్స్ గురించి అడగ్గా.. శ్రీసత్యది కేక్ మీమ్ ఒకటి ఉంటుంది అని చెప్పిన అరియానా గ్లోరి అది నా ఫేవరెట్ రా అని చెప్పింది. ఆ మీమ్ చూసి ఇద్దరు తెగ నవ్వుకున్నారు. తర్వాత వెంకటేష్ బాడీగార్డ్ మూవీలో అలీ వేసుకున్న లేడీ గెటప్ ను చూపిస్తూ పైన వాసంతి కృష్ణన్ రెడీ అయిన ఫొటోను ఉంచారు. ఇది చూసి ఇద్దరు తెగ నవ్వుకున్నారు. ఈ మీమ్ వాసంతి చూసిందో లేదో తెలియదు కానీ అంటూ ఫన్ క్రియేట్ చేసింది కాజల్.

    చాలా మిస్ అవుతా..

    నాకు బిగ్ బాస్ అనేది నిజంగానే ఒక ఎమోషన్. సొసైటీలో ఒక ఐడెంటిటీ ఉండాలని నాకు ఎప్పుడూ ఉండేది. దానికోసం నేను చాలా కష్టపడ్డాను. బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ఐడెంటిటీతోపాటు రెస్పెక్ట్ అంతా ఇంతా కాదు. అండ్ నేను కెఫేను నిజంగా మిస్ అవుతా కాజల్ అంటూ చాలా ఎమోషనల్ అయింది అరియానా గ్లోరి. ఐ మిస్ యూ బిగ్ బాస్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అరియానాను ఓదార్చే ప్రయత్నం చేసింది ఆర్జే కాజల్.

    English summary
    Bigg Boss Telugu 4 Contestant Ariyana Glory Gets Emotional About Bigg Boss With RJ Kajal In BB Cafe Episode 89 Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X