OTTలోకి రాబోతున్న బిగ్‌బాస్ విన్నర్ క్రేజీ మూవీ.. ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ మధ్య కాలంలో అనేక మంది సినిమాలు చేస్తున్నారు. కొత్తగా ఇండస్ట్రీలకు వచ్చిన వాళ్లు కూడా హీరోలుగా మారుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లిన వాళ్లు అయితే చాలా మందే హీరోలుగా మారుతూ సినిమాలు చేస్తున్నారు. వాటి ఫలితం ఎలా ఉన్నా వారు మాత్రం సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఓ బిగ్ బాస్ విన్నర్ తాజాగా ఒ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో.. అంతకు మించిన స్పాంటేనియస్ తో బిగ్ బాస్ షోలో ఉండి బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించాడు. అలాగే యాంకరింగ్ చేస్తూ కూడా అందరినీ మెప్పించగలిగాడు కుర్రాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అయితే ఇటీవలే ఈయన సౌండ్ పార్టీ అనే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సంజయ్ శేరి. అయితే ఈ సౌండ్ పార్టీ అనే చిత్రంలో వీజే సన్నీ సరసన హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్రలు నిర్మాతలుగా వ్యవహరించగా... శివ నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వీరాజ్, చలాకీ చంటి, శైలజ ప్రియ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.
అయినప్పటికీ వీజే సన్నీ ఫ్యాన్స్ మాత్రం బాగానే కుషీ అయ్యారు. కామెడీతో పాటు రొమాంటిక్ యాంగిల్ లో సాగిన ఈ సినిమాను బాగానే ఆదరించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ముఖ్యంగా ఈ వారమే రాబోతున్నట్లు తాజాగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఆహా ప్రకటించింది. ఆహా వేధికగా ఈ సినిమా మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అదే విషయాన్ని ఎక్స్ వేధికగా ఆహా సంస్థ ప్రకటించింది.

వీజే సన్నీ హీరోగా, హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఓటీటీ వేధికగా ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ ఎంజాయ్ చేయమంటూ చెప్పుకొచ్చింది. సడెన్ గా ఈ సినిమా రాబోతున్నట్లు ప్రకటించడంతో వీజే సన్నీ ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. శివరాత్రి రోజు ఈ కామెడీ సినిమా చూసి జాగారం చేయొచ్చని భావిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











