twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: గురిపెట్టానంటే కొట్టాల్సిందే గన్ షాట్ తో బాలదిత్యా ఎంట్రీ.. అతను ఎవరంటే..

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ఈసారి విభిన్నమైన కంటెస్టెంట్స్ హైలెట్ కాబోతున్నారు. ఇక అందులో ప్రముఖ సీనియర్ నటుడు బాలాదిత్య కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. ఇక బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్లో బాలాదిత్య 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతను గన్ షాట్స్ తో ఎంట్రీ ఇచ్చిన బలదిత్యా తన ఆల్ రౌండర్ ప్రదర్శన గురించి చెప్పాడు. అయితే అతను ఎక్కడి నుంచి వచ్చాడు అతని కెరీర్ ఎలా సాగింది అనే వివరాల్లోకి వెళితే..

    గుంటనక్క కార్డ్ తో ఎంట్రీ..

    గుంటనక్క కార్డ్ తో ఎంట్రీ..

    బాలాదిత్య వచ్చి రాగానే నాగర్జునని చూసిన సంతోషంలో మీరు నటించిన కొన్ని సినిమాల్లో నేను బాల నటుడిగా నటించాను అని ముఖ్యంగా హలో బ్రదర్ సినిమా నాకు చాలా ఇష్టం అని అన్నాడు. అలాగే నాకు ఒక కూతురు ఉంది అని తనకు బంగార్రాజు సినిమా అంటే చాలా ఇష్టమని మీతో మాట్లాడతాను అంటే ఒకసారి మా అన్నయ్యకు ఫోన్ చేసి మిమిక్రీ చేయమని చెప్పినట్లుగా తన అనుభూతులను తెలియజేశాడు. ఇక నాగార్జున ప్రత్యేకంగా ఇటీవల బాలాభిత్యకు పుట్టిన పాపకు సంబంధించిన మరో ఫోటోను కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అది చూసి బాలాదిత్యా సంతోషించాడు. ఇక గుంట నక్క కార్డ్ తో బాలాదిత్యా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

    అసలు పేరు..

    అసలు పేరు..

    బాలాదిత్య అసలు పేరు ఆదిత్య. అతను టెలివిజన్ నటుడిగా సినిమా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఎక్కడ వివాదాలకు తావివ్వకుండా చాలా మంచి నటుడు అని సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఏలూరుకు చెందిన బాలాదిత్య 1982 మార్చి 9వ తేదీన జన్మించాడు. చెన్నైలో తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాదులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

    చిన్నప్పటి హీరోల పాత్రలతో

    చిన్నప్పటి హీరోల పాత్రలతో


    బాలాదిత్య 1991 నుంచి తన సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. మొదట అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపును అందుకున్నాడు. 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం' అనే సినిమా ద్వారా అతని కెరీర్ మొదలైంది. దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గానే అతను 24 సినిమాల్లో నటించాడు. ఇక అందులో రౌడి గారి పెళ్ళాం, జంబలకిడిపంబ, హలో బ్రదర్, హిట్లర్ అలాగే సమరసింహారెడ్డి వంటి సినిమాల్లో చిన్నప్పటి హీరోగా మంచి పాత్రలో బాలదిత్యా నటించాడు.

    హీరోగా ప్రయత్నాలు

    హీరోగా ప్రయత్నాలు

    ఇక 2003 తర్వాత అతను యుక్త వయసులోకి రాగానే హీరోగా తన కెరీర్ను మొదలుపెట్టాడు. హీరోగా వచ్చిన ఫస్ట్ సినిమా చంటిగాడు. ఆ తర్వాత కీలుగుఱ్ఱం, వంశం, సంధ్య అనే సినిమాలతో కూడా బాలాదిత్య బిజీ హీరోగా మారిపోయాడు. ఇక అతనికి మంచి గుర్తింపు అందించిన సినిమాలలో '1940లో ఒక గ్రామం' అనే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి.

     ప్రేమ పెళ్లి

    ప్రేమ పెళ్లి


    ఇక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సినిమా హీరోగా మారిన తర్వాత 2013 వరకు కూడా ఇతని పేరు ఆదిత్య గానే ఉండేది. కానీ 2016 తర్వాత అతను తన పేరును బాలాదిత్య మార్చుకున్నాడు. ఇక తర్వాత అతను హైదరాబాదులోనే మానస లక్ష్మీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక తన సినిమా కెరీర్ పై కూడా ఇటీవల కాలంలో బాలాదిత్య చాలా సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నాడు. విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకునేందుకు అతను ఆసక్తి చూపిస్తున్నాడు.

    బిగ్ బాస్ 6లో

    బిగ్ బాస్ 6లో


    అయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాలాదిత్య మరో స్థాయికి చేరుకోలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా బిగ్ బాస్ 6 వ సీజన్ ద్వారా తన కెరీర్ ను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇక ఈసారి బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ సీనియర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టబోతున్న బాలాదిత్య ఎంతవరకు కొనసాగుతాడో చూడాలి.

    English summary
    bigg boss telugu 6 contestant actor baladitya full biography details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X