Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తో నాకు వచ్చేది ఏం లేదు.. ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ముగిసింది. 21 మంది కంటెస్టెంట్లలో సింగర్ రేవంత్ టైటిల్ కొట్టగా.. శ్రీహాన్ రన్నరప్ గా నిలిచాడు. ఇక టాప్ 3, 4, 5లోకి కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్ చేరుకున్న విషయం తెలిసిందే. వీళ్లందరూ డిసెంబర్ 18న నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో ఒక్కొక్కరిగా షో నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చారు. వీరిని బీబీ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకునేలా చేశాడు. దానికి సంబంధించిన ప్రోమో వివరాల్లోకి వెళితే..

టాప్ 5 కంటెస్టెంట్ల ఇంటర్వ్యూ..
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినట్ అయిన ఇంటి సభ్యులను బీబీ కేఫ్ ద్వారా నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 18 ఆదివారంతో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ముగిసింది. ఈ ఆరో సీజన్ లో విన్నర్ గా రేవంత్, రన్నర్ గా శ్రీహాన్ నిలవగా టాప్ 3, 4, 5లో కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. వారందరిని తాజాగా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ.

సరిగ్గా ఉపయోగించుకున్నారా..
ఎలా ఉంది బిగ్ బాస్ 15 వారాల జర్నీ అని టాప్ 5 కంటెస్టెంట్స్ ను యాంకర్ శివ అడగితే.. జీవితంలో ఒక్కసారి వచ్చే అనుభవం ఇది అని రోహిత్ అంటే.. అమెజింగ్ ఫీలింగ్ అని కీర్తి భట్, జర్నీ చాలా హ్యాపీ బ్రో.. కానీ చాలా టఫ్ జర్నీ అని ఆదిరెడ్డి తెలిపాడు. ఈ బిగ్ బాస్ ఆఫర్ ని లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అన్నారు కదా.. దీన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నారా అని అడిగాడు యాంకర్ శివ.

హౌజ్ లోకి వెళ్లడానికి మీ ఎజేండా ఏంటీ..
ఇక్కడ రివ్యూస్ చేసేటప్పుడు నెగేటివ్ అనిపించింది.. అక్కడ కంటెస్టెంట్ గా చేసినప్పుడు అనిపించదు అని ఆదిరెడ్డి అంటే.. జనాలు ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దామన్న మైండ్ సెట్ తో వెళ్లాను నేను అని రోహిత్ చెప్పాడు. ఇంతమందితో ఉన్నాను కదా హ్యాపీనే అని కీర్తి చెప్పింది. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడానికి మీ ఎజేండా ఏంటీ అని యాంకర్ శివ అడిగాడు. నా ఫ్యామిలీ నాకు దొరికింది అని కీర్తి చెప్పుకొచ్చింది.

మెరీనా వెళ్లిపోయాక స్టార్ట్ అయింది..
మన కెరియర్ లో ఒక బూస్ట్ ఉంటుంది ఒక స్టెప్ హెడ్ అవుతాము కచ్చితంగా ముందుగా అని రోహిత్ ఆన్సర్ చేయగా.. నేను కెరీర్ ఆర్టిస్ట్ అవ్వేం కాదు కదా.. లోపలికి పోయినా.. బయటకు వచ్చినా నాకు పెద్దగా పోయేదేం ఉండదు అని ఆదిరెడ్డి తెలిపాడు. రోహిత్ లో అసలు గేమ్ మెరీనా గారు వెళ్లిపోయాక స్టార్ట్ అయింది అని శివ అంటే.. తను ఉన్నప్పుడు కూడా నేను అదే గేమ్ ఆడాను అని రోహిత్ బదులిచ్చాడు.

ఏకాభిప్రాయం కెప్టెన్ అవ్వలేకపోయారు..
నాకు ఏదైనా ఒపినీయన్ చేప్పాలని ఎవరితో అయినా అనిపిస్తే.. ఈ అమ్మాయికి చెబితే బాగుంటుంది అని అనిపించింది అని ఆదిరెడ్డి చెప్పగా.. ఒక బాధ్యతను నేను తీసుకుని కొన్ని కొన్ని మాట్లాడటం జరిగింది అని కీర్తి చెప్పుకొచ్చింది. కెప్టెన్సీ టాస్క్ లో ఏకాభిప్రాయం వల్ల ఎప్పుడు మీరు కెప్టెన్ అవ్వలేకపోయారు అని యాంకర్ శివ అడిగాడు. తుది నిర్ణయం అయినా కూడా ఆ సంచాలక్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉండాలని కీర్తి చెప్పింది.
డబ్బులు తీసుకోవచ్చు కదా..
రేషన్ తక్కువగా ఉంది కాబట్టి హౌజ్ ను లీడ్ చేయలేకపోతాడేమో అని రోహిత్ అన్నాడు. నేను టాస్క్ లు ఆడకుండా ఉండి అస్సలు ఏమి లేకుండా ఉండి ఉంటే మాట్లాడొచ్చు అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. టాప్ 3 అసలు ఎక్స్ పెక్ట్ చేశావా అని యాంకర్ శివ అడిగితే.. ఊహించలేదని ఆదిరెడ్డి చెప్పాడు. డబ్బులు తీసుకోవచ్చు కదా అని శివ అడిగితే.. రూ. 50 లక్షలు ఇచ్చిన ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకుని ఉండేవాన్ని కాదు అని ఆదిరెడ్డి అన్నాడు. డబ్బులు తీసుకుని బయటకు రావడం నాకు ఇష్టం లేదు అని కీర్తి చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











