twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: బెస్ట్ హోస్ట్ ఎవరనే విషయంపై గొడవ.. తేల్చనున్న చైతూ!

    |

    అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో మంచి సక్సెస్ సాధించింది. దీంతో వరుస పెట్టి సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు ఆరో సీజన్ కూడా పూర్తి కానుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ లోపల ఇంటి సభ్యులు టాస్క్ లు, గేమ్స్ ఆడితే బయట వాళ్ల గేమ్, మాటతీరు, ప్రవర్తన తదితర అంశాలపై సెలబ్రిటీలను బీబీ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇలా ఎక్కువగా ఇంటర్వ్యూ చేసింది అరియానా గ్లోరి, యాంకర్ శివ. మరి వీళ్ల బెస్ట్ హోస్ట్ ఎవరనే చర్చ ముందుకొచ్చింది.

     బెస్ట్ హోస్ట్ గొడవ..

    బెస్ట్ హోస్ట్ గొడవ..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య విన్నర్ గొడవ మొదలైంది. అదేంటనే వివరాల్లోకి వెళితే..

     స్పెషల్ గెస్ట్ ఉండాలి..

    స్పెషల్ గెస్ట్ ఉండాలి..

    బీబీ కేఫేలో ఇవాళ లాస్ట్ డే. లాస్ట్ డే అంటే సెలబ్రేషన్స్ ఉండాలి. స్పెషల్ గెస్ట్ ఉండాలి అని బ్యూటిఫుల్ అరియానా గ్లోరి చెబుతుండగా యాంకర్ శివ ఎంట్రీ ఇచ్చాడు. యాంకర్ శివ డ్యాన్స్ చేస్తుంటే చిరాకు పడిన అరియానా.. బీబీ కేఫేలో ఇవాళ లాస్ట్ డే. ఆఖరి రోజు అంటే ఎవరో స్పెషల్ గెస్ట్ వస్తారనుకుంటే నువ్ వచ్చావేంట్రా బాబు అని అరియానా అంది. ఈ బీబీ కెఫే మీద నీకు ఎంత హక్కు అయితే ఉందో దానికి నాకు వెయ్యి రెట్లు ఎక్కువుంది అని యాంకర్ శివ చెప్పాడు.

     ఎవరిదీ చాలా సేఫ్ ఆన్సర్స్..

    ఎవరిదీ చాలా సేఫ్ ఆన్సర్స్..

    వారానికి (ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం) ఒకరోజు వచ్చే నీకు.. 90 ఎపిసోడ్స్ చేసిన నాకు ఎంత వెయిటేజ్ ఉందిరా అని యాంకర్ అరియానా అంది. సరే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఎవిక్ట్ అయిన వాళ్లను ఇంటర్వ్యూ చేశావ్ కదా.. ఎవరిది నీకు చాలా బెస్ట్ అనిపించింది.. ఎవరిదీ చాలా సేఫ్ ఆన్సర్స్ అనిపించింది అని అరియానా అడిగింది. మన బీబీ కేఫేలో గుర్తుండిపోయే ఎపిసోడ్ ఏదైనా ఉందంటే గీతూ.. వన్ వీక్ ట్రెండింగ్ బంద్ అని యాంకర్ శివ చెప్పుకొచ్చాడు.

    బెస్ట్ హోస్ట్ నువ్వా.. నేనా..

    బెస్ట్ హోస్ట్ నువ్వా.. నేనా..

    మరి నీకు ఎవిక్ట్ అయిన వాళ్లలో ది మోస్ట్ గ్లామరెస్ట్ కంటెస్టెంట్ అనిపించార్రా అని అరియానా అడిగితే.. సీజన్ 4లో అయితే నువ్వు అనుకోవాలి అని ఆలోచిస్తూ శివ చెబుతుంటే అరియానా స్మైల్ ఇచ్చింది. దీనికి ఏంటీ బ్లష్ అవుతున్నావా అని నవ్వించాడు శివ. ఈ బీబీ కేఫేకు బెస్ట్ హోస్ట్ నువ్వా.. నేనా అనేది చెప్పడానికి ఒక గెస్ట్ రాబోతున్నాడన్నమాట అని యాంకర్ శివ చెప్పాడు.

     బీబీ కెఫే ట్రెండింగ్ లోకి..

    బీబీ కెఫే ట్రెండింగ్ లోకి..

    యాంకర్ శివ గెస్ట్ రాబోతున్నాడని చెప్పగానే ఆర్జే చైతూ ఎంట్రీ ఇచ్చాడు. చైతూ.. నేను బెస్ట్ హోస్ట్ కదా కెఫేకి అని అరియానా అరిచి మరి చెప్పింది. అరియానా విషయానికొస్తే.. వచ్చామా.. కూర్చున్నామా.. మేకప్ వేసుకున్నామా.. సరే వెళ్తుందని చెప్పేసి వెళ్లిపోవడం ఇది చేస్తావ్ అని ఆర్జే చైతూ అన్నాడు. తర్వాత శివ విషయానికొస్తే.. శివ యాంకరింగ్ చేస్తున్నాడు కాబట్టి బీబీ కెఫే ట్రెండింగ్ లోకి వెళ్లింది అట్లాంటివి లేవు కాకా అని శివకు పంచ్ ఇచ్చాడు చైతూ

    బెస్ట్ హోస్ట్ ఎవరంటే..

    మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ హోస్ట్ అనేది ఎవరో నేను తేల్చబోతున్నాను.. జనాలు కూడా రియలైజ్ కాబోతున్నారు అని చెప్పిన ఆర్జే చైతూ.. ఒక చేత్తో శివ హ్యాండ్.. మరో చేత్తో అరియానా హ్యాండ్ పైకి లేపే ప్రయత్నం చేశాడు. బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్ ను ఎలా ప్రకటిస్తారో సేమ్ అలాగే చైతూ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ వచ్చాక ఎవరు బెస్ట్ హోస్ట్ అని తేలనుంది.

    English summary
    Bigg Boss Telugu 4 Contestant Ariyana Glory Fight With Anchor Shiva Over BB Cafe Best Host In BB Cafe Episode 90 Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X