twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: శ్రీ సత్యపై అర్జున్ కల్యాణ్ ఫీలింగ్ మారిందా? ఆమె ఆటతీరుపై షాకింగ్ కామెంట్స్!

    |

    ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌజ్ లో గత కొన్ని రోజులుగా ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి పొందేందుకు హౌజ్ మేట్స్ చాలా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంటి సభ్యులను భయపెట్టేందుకు డార్క్ రూమ్ ఏర్పాటు చేసి అందులోకి ఒక్కొక్కరిగా పంపిస్తున్నారు. గత ఎపిసోడ్ లో డార్క్ రూమ్ లోకి వెళ్లేందుకు శ్రీసత్య భయంతో నిరాకరించింది. దీంతో రూ. లక్ష సాధించుకునే అవకాశం కోల్పోయారు ఇంటి సభ్యులు. ఇదిలా ఉంటే తాజాగా బీబీ కేఫ్ కు శ్రీ సత్య వెనుక పడి, ప్రేక్షకులతో ఎలిమినేట్ అయిన అర్జున్ కల్యాణ్ హాజరయ్యాడు. అతన్ని బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరి ఇంటర్వ్యూ చేసింది.

    మాజీ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ హాజరై..

    మాజీ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ హాజరై..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు ప్రస్తుత సీజన్ మాజీ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

    బిగ్ బాస్ ను సపోర్ట్ చేయడానికి..

    బిగ్ బాస్ ను సపోర్ట్ చేయడానికి..

    అర్జున్ కల్యాణ్ కు స్వాగతం పలికింది అరియానా గ్లోరి. తర్వాత ఇద్దరు కలిసి అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమా పాటకు డ్యాన్స్ వేశారు. ఫ్రెండ్ కు (శ్రీ సత్య) సపోర్ట్ చేయడానికి వచ్చావా ఇవాళ అని అర్జున్ కల్యాణ్ ను అరియానా గ్లోరి అడిగింది. లేదు, నిజానికి బిగ్ బాస్ ను సపోర్ట్ చేయడానికి వచ్చాను అని అర్జున్ కల్యాణ్ చెబితే ఏంటీ అని షాక్ అయింది అరియానా గ్లోరి. దీంతో అర్జున్ కల్యాణ్ నవ్వేశాడు.

    నచ్చట్లేదు కాబట్టే అలానా..

    నచ్చట్లేదు కాబట్టే అలానా..

    హౌజ్ లో ఉన్నప్పుడు శ్రీ సత్యకు బాగా సపోర్ట్ చేశావ్.. తనతో ఉన్నావ్.. మరి బయట ఎందుకు సపోర్ట్ చేయట్లేదని అరియానా గ్లోరి అడగితే.. ఎవరు బాగా ఆడితే వాళ్లు గెలిస్తే బెటర్ కదా అని అనుకున్నాను అని అర్జున్ అన్నాడు. అంటే శ్రీ సత్య ఆట నచ్చట్లేదా అని క్వశ్చన్ చేసింది అరియానా గ్లోరి. తను కూడా చెప్పేది ఏంటంటే.. నా ఆట నచ్చితే సపోర్ట్ చేయండి అంటుంది ఎప్పుడైనా.. అని అర్జున్ అన్నాడు. దీనికి నచ్చట్లేదు కాబట్టే సపోర్ట్ చేయట్లేదా మరి అని తిరిగి క్వశ్చన్ చేసింది అరియానా. లేదని కాదు అని అర్జున్ కల్యాణ్ వివరణ ఇచ్చుకోబోతుంటే.. దొరికిపోయావ్ నువ్ అని అరియానా అంది.

    ఇప్పుడు కొట్టుకుంటున్నారేంటీ..

    ఇప్పుడు కొట్టుకుంటున్నారేంటీ..

    హౌజ్ లో ఉన్నప్పుడు ఆట ఒకలా ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే ఇంకొకలా ఉంటుంది. నీ గురించి బాగా బ్యాక్ బిట్చింగ్ చేసింది ఎవరు అని అరియానా గ్లోరి అడిగితే.. అరే వీడు నా వెనుకాల పడుతున్నాడు అని ఎవరో కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చాడు అర్జున్ కల్యాణ్. శ్రీహాన్-శ్రీ సత్య మధ్య మొదటి నుంచి ఉన్న మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇప్పుడు చివరికి వచ్చే సరికి కొట్టుకుంటున్నారేంటీ అని అడిగింది అరియానా.

    ఏమన్నా ఊరుకోవుగా..

    శ్రీహాన్ ఆర్గ్యూ చేసిన పాయింట్స్ కూడా కరెక్టే, కానీ అలా వాదించకుండా ఉండాల్సిందేమో, మరి హార్ష్ గా వెళ్లిపోయాడనిపించిందని అర్జున్ కల్యాణ్ తెలిపాడు. శ్రీ సత్యను ఏమన్నా ఊరుకోవు కదా.. హౌజ్ వరకి అని అరియానా గ్లోరి అంటే.. నవ్వుతో సమాధానం చెప్పాడు అర్జున్ కల్యాణ్. అతని మాటలు చూస్తుంటే శ్రీసత్యపై ఇంకా ప్రేమ ఉన్నట్లు ఒకలా, ఒపినీయన్ మారినట్లు మరోలా అనిపిస్తోంది. తర్వాత కీర్తికి 100కు 85 శాతం ఇచ్చాడు అర్జున్ కల్యాణ్. అలాగే శ్రీహాన్ కు అర్జున్ కల్యాణఅ 97 శాతం ఇవ్వగా.. శ్రీ సత్య ఆట తీరుకు ఇచ్చేలోపు ప్రోమోను ముగించారు.

    English summary
    Bigg Boss Telugu 6 Eliminated Contestant Arjun Kalyan About Sri Satya Game And Love In BB Cafe With Ariyana Glory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X