Don't Miss!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6 హౌజ్ లో ఫుడ్ పై బాలాదిత్య షాకింగ్ కామెంట్స్.. అతనుంటే సమస్య రాదంటూ!
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌజ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. అంటే ఈ పోటీలో గెలిచిన ఇంటి సభ్యులు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో ఊహించని సన్నివేశాలు కనిపించాయి. సీజన్ మొదటి నుంచి ఎప్పుడు అరుచుకునే శ్రీహాన్, ఇనయా సుల్తానా మధ్య రొమాంటిక్ సీన్స్ నడిచాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ల ఆట తీరుపై పై బీబీ కేఫ్ ద్వారా రివ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మాజీ కంటెస్టెంట్ బాలాదిత్య హాజరయ్యాడు. పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
2017లో ప్రారంభం..
అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది.
రాజశేఖర్ తో కలిపి 13 మంది..
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 12 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. తాజాగా 12వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంచారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ 13 మంది వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌజ్ లో 8 మంది మిగిలారు.
మాజీ కంటెస్టెంట్ బాలాదిత్య హాజరు..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు ప్రస్తుతం నడుస్తున్న సీజన్ లో పదోవారం ఎలిమినేట్ అయిన బాలాదిత్య హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
ఎప్పుడూ ఊహించలేం..
బిగ్ బాస్ అంటే ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అరియానా అడగ్గా.. నాలో నాకు తెలియని చాలా విషయాలు నాకు అర్థమయ్యాయని బాలాదిత్య తెలిపాడు. ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ అయిపోతుంది.. టాప్ ఫైట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందని అడిగితే.. మనం ఎప్పుడు ఏం ప్రిడిక్ట్ చేయలేం. ఏ సమంయలో ఏమైనా జరగొచ్చని బాలాదిత్య అన్నాడు. నామినేషన్స్ మాత్రం చాలా ఫైర్ గా జరిగాయయని అరియానా అంటే.. కొంతమంది ఎలా నామినేట్ చేస్తారంటే.. నేను వీన్ని నామినేట్ చేయాలనుకుంటున్నానని నామినేట్ చేస్తారని బాలాదిత్య అన్నాడు.
అతనుంటే ఫుడ్ సమస్య రాదు..
రోహిత్ చాలా కష్టపడి కెప్టెన్ కాలేకపోయాడు కానీ, రేషన్ మేనేజర్ అయ్యాడండీ అని అరియానా అంటే.. రోహిత్ లాంటి వాడు రేషన్ మేనేజర్ అయితే ఫుడ్ విషయంలో ఎలాంటి సమస్య రాదని నేను కూడా అనుకున్నా.. ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తా అని బాలాదిత్య అన్నాడు. తర్వాత ఇంటి సభ్యుల గేమ్ పై పర్సంటేజ్ లెక్కన మార్క్స్ ఇచ్చాడు. శ్రీహాన్ కు 98 శాతం ఇచ్చి అతను స్మార్ట్ గేమర్. తనను తను దిద్దుకునే విధానం చాలా బాగుంటుందని చెప్పాడు బాలాదిత్య.
ఏదైనా జరగొచ్చు..
రోహిత్ కు 96 శాతం ఇస్తూ అతను టాస్కుల్లో ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటల్ గా వెరీ కంపోజ్ డ్, అలాగే మంచి వ్యక్తి అని అన్నారు బాలాదిత్య. ఇనయాకు 98 పర్సంట్ ఇచ్చాడు. తన మాట తీరుకు 2 శాతం తగ్గించినట్లు చెప్పాడు. ఆదిరెడ్డికి, రేవంత్ కి 98 శాతం ఇచ్చాడు బాలాదిత్య. రేవంత్ మంచి వ్యక్తి కానీ, క్రిటికల్ సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం అన్ బ్యాలెన్స్ అవుతాడని చెప్పాడు. దీంతో నాకు ఒక్కరికీ కూడా 100 పర్సంట్ ఇచ్చినట్లు అనిపించలేదని అరియానా అంటే.. ఎందుకంటే ఇది బిగ్ బాస్ గేమ్ కాబట్టి. ఏదైనా జరగొచ్చు అని నవ్వేశాడు బాలాదిత్య.