Bigg Boss Telugu 6 నాగార్జునపై ఆర్టిస్ట్ జ్యోతి కామెంట్స్.. అతని వెటకారమంటూ షాకింగ్ గా!
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌజ్ లో రెండు రోజులుగా టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఈ పోటీలో గెలిచిన ఇంటి సభ్యులు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో ఇప్పటికే అనుకోని సన్నివేశాలు ఎదురయ్యాయి. ఎప్పుడు గొడవపడే శ్రీహాన్, ఇనయా సుల్తానా మధ్య రొమాంటిక్ సీన్స్ నడిచాయి. ఇక ఫినాలే టాస్క్ లో ఒక్కొక్కరికీ పాయింట్స్ ద్వారా వాళ్ల స్థానాన్ని ఉంచారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ల ఆట తీరుపై పై బీబీ కేఫ్ ద్వారా రివ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బీబీ కేఫ్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఇంట్రెస్టింగ్ విషయాలతో..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి హాజరయ్యారు. ఆమెను యాంకర్ అరియానా క్వశ్చన్స్ వేయగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

బిగ్ బాస్ బెస్ట్..
బిగ్ బాస్ సీజన్ 6లో బాగా నచ్చిన 6 విషయాలు చెప్పండని అరియానా గ్లోరి అడగ్గా.. ప్రతి సీజ్ లో బిగ్ బాస్ ఈజ్ ది బెస్ట్. తర్వాత నాగార్జున గారు అని చెప్పి నవ్వేసింది జ్యోతి. అనంతరం ఇనయా సుల్తానా ఇన్నిరోజులు ఉంటుందని నేను అస్సలు అనుకోలేదని జ్యోతి అంటే.. ఏం నచ్చింది ఇనయా గేమ్ లో అని అరియానా గ్లోరి అడిగింది. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. గేమ్ ప్లాన్ ఏంటో కూడా తెలియకుండా అప్పుడప్పుడు ట్విస్ట్ లు ఇస్తుంటుందని జ్యోతి చెప్పారు.

అది ఒక స్వీట్ ఫైట్..
టికెట్ టు ఫినాలే టాస్క్ లో శ్రీహాన్, ఇనయాది అసలు గొడవలా అనిపించిందా అని అరియానా గ్లోరి అడగ్గా.. అది ఒక స్వీట్ ఫైట్ అన్నమాట. ఎంత రొమాంటిక్ గా ఉంది. ఏంటంటే.. అది కొంచెం.. గిల్లికజ్జాలు ఆడుకుంటున్నారు అంటూ ఇద్దరు నవ్వుకున్నారు. శ్రీసత్య లైక్ ఆర్ డిస్ లైక్ అని జ్యోతిని అరియానా అడిగితే.. ఆమె వెరీ కన్నింగ్.. వెరీ వెరీ కన్నింగ్ అని జ్యోతి చెబుతూ చేతిలో లైక్ సింబల్ పట్టుకున్నారు.

ఇచ్చిపడేస్తుంది..
కీర్తి గురించి అరియానా అడగ్గా.. బేసిక్ గా తను సెల్ఫ్ డిఫెండర్ అన్నమాట. అంటే చాలావరకు ఎవరన్నా.. ఏదైనా బురద చల్లినా తను ఊరుకోదు. ఇచ్చిపడేస్తుందన్నమాట. తర్వాత శ్రీహాన్ గురించి జ్యోతిని అరియానా గ్లోరి అడిగితే.. కొన్నిసార్లు తను వెక్కిరంచే స్టైల్ మాత్రం నచ్చలేదు నాకు. ఈ వెటకారం అనేది అని ఆమె చెప్పింది. రేవంత్ గురించి చెబుతూ.. అతను ఒక ఆటమ్ బాంబ్ లాగా. అసలు ఎప్పుడు పేలుతాడో కూడా తెలియదంటూ నవ్వేసింది జ్యోతి.

పూర్తిగా ఊహించలేనిది..
ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గేమ్ మాత్రమే కాదు.. ఆడియెన్స్ ఓటింగ్ కూడా ఎవరం అంచనా వేయలేకపోతున్నామని అరియానా గ్లోరి అంటే.. బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. బిగ్ బాస్ పూర్తిగా ఊహించలేనిది అని జ్యోతి చెప్పారు. ఇలా బీబీ కేఫ్ తాజా ఎపిసోడ్ ప్రోమోను ముగించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురు 13వ వారం నామినేషన్లలో ఉన్నారు.
12 వారాలకు 13 మంది..
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 12 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. తాజాగా 12వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంచారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ 13 మంది వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











