twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 సూర్యతో ఆ రిలేషన్ ఇంకా ఉంది, హౌజ్ లోనే అది నేర్చుకున్నా: ఆరోహి రావు

    |

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఈ సీజన్ 80 రోజులు పూర్తి చేసుకోగా 81వ ఎపిసోడ్ బుధవారం ప్రసారమైంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ నుంచి 11 వారాల్లో 12 మంది ఇంటి సభ్యులు బయటకు వెళ్లారు. ఇక ఈ 12 వారం నామినేషన్లలో 9 మంది ఇంటి సభ్యులకు ఏడుగురు నామినేట్ అయ్యారు.

    అయితే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఈ వారం ఫ్యామిలీ వీక్ తో ఎమోషనల్ గా సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీబీ కేఫ్ కు నాలుగో వారం ఎలిమినేట్ అయిన ఆరోహి రావు హాజరైంది.

    ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..

    ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు ప్రస్తుతం ఈ ఆరో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ఆరోహి రావు హాజరైంది. ఆమె నుంచి పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టింది యాంకర్ అరియానా గ్లోరి.

    అది చాలా గొప్ప విషయం..

    అది చాలా గొప్ప విషయం..

    హాయ్ ఆరోహి అంటూ స్వాగతించిన అరియానా గ్లోరి.. బిగ్ బాస్ తర్వాత జీవితం ఎలా ఉంది.. గుర్తింపు ఎలా ఉందని ప్రశ్నించింది. ఇంతకుముందు ఒక 500 మందికి తెలిసిన మొహాలు ఇప్పుడు ఒక్కసారిగా 50 వేల మందికి తెలవడం అనేది చాలా గొప్ప విషయం అని ఆరోహి రావు తెలిపింది. అది చాలా అదృష్టం కూడా అని ఆరోహి మాటలను ఒప్పుకుంటున్నట్లుగా అరియానా గ్లోరి చెప్పింది.

    బయటకు వచ్చాక ఎలా ఉంది..

    బయటకు వచ్చాక ఎలా ఉంది..

    హౌజ్ లో గేమ్ ఎలా ఉంది.. హౌజ్ లో ఉన్నప్పుడు ఒకలా అనిపించి.. బయటకు వచ్చాక ఇంకోలా ఏమైనా అనిపించిందా నీకు అని అరియానా గ్లోరి అడిగింది. దీనికి అనిపించడం కాదు.. మబ్బులు విడిపోయినయ్ నాకు.. కొన్ని కొన్ని చూసిన తర్వాత నాకు ఏందిది.. హౌజ్ లో నాకు తెలియకుండా ఇంత జరిగిందా అని ఆరోహి రావు తెలిపింది. ఆరోహి సమాధానానికి అమ్మ బాబోయ్.. ఏం జరిగిందమ్మా అని క్వశ్చన్ వేసింది అరియానా. అందుకు నేను షాక్ అయ్యా అని ఆన్సర్ ఇచ్చింది ఆరోహి.

    క్లారిటీగా చెప్పట్లేదు..

    క్లారిటీగా చెప్పట్లేదు..

    ఏ హౌజ్ మేట్ గేమ్ నీకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అన్న అరియానా ప్రశ్నకు.. హౌజ్ లో ఉన్నప్పుడు రేవంత్ గారు ఎలా అనుకునేదాన్నంటే అని ఆరోహి చెప్పుకొస్తుంది. దీనికి మధ్యలో నువ్ సందర్భం చెబుతున్నావ్.. కానీ క్లారిటీగా చెప్పట్లేదని అరియానా అంది. దీంతో ఒక్కసారిగా నవ్వేసింది ఆరోహి రావు. అంటే నేను డిప్లమాటిక్ ఆన్సర్స్ చెప్పడం అనేది బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక నేర్చుకున్నా అని ఆరోహి రావు చెప్పుకొచ్చింది.

    ఒక్కసారి కనెక్ట్ అయితే..

    ఒక్కసారి కనెక్ట్ అయితే..

    ఆదిరెడ్డిలో ఏంటి నువ్ చూసిన మార్పులు గురించి అడగ్గా.. కొందరి పాయింట్స్ మాత్రమే తీస్తున్నారేమో అనిపించిందని చెప్పింది ఆరోహి. ఫైమా, ఆదిరెడ్డి బాండింగ్ ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు ఒక్కసారి కనెక్ట్ మాట్లాడరంటే వాళ్లను నామినేట్ చేయడానికి కూడా ఆదిరెడ్డికి మనసు ఒప్పదని తెలిపింది ఆరోహి.

    ఎందుకు అలా ఏడుస్తుంది..

    ఎందుకు అలా ఏడుస్తుంది..

    ఇనయా తనకు హౌజ్ లో సహాయం లేదంటూ ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తుంది.. ఎందుకు అలా చేస్తుందని అరియానా అడిగింది. హెల్ప్ చేసినవి మర్చిపోద్ది.. నెగెటివ్స్ చెబితే మైండ్ లో పెట్టేసుకుంటది అని చెప్పింది ఆరోహి. దీనికి షాక్ గా చూసింది అరియానా. సూర్యతో హౌజ్ లో ఫ్రెండ్ షిప్ ఉంది, బయట లేదు ఎలా అనిపిస్తుందన్న ప్రశ్నకు.. సూర్యతో బయట ఫ్రెండ్ షిప్ ఉందని ఆరోహి చెప్పుకొచ్చింది. దీనికి నవ్వేసింది అరియానా.

    టాప్ 5లో ఎవరుంటారు..

    రేవంత్ సెకండ్ టైమ్ కెప్టెన్ అయ్యాడు.. రేషన్ మేనేజర్ కూడా తనే అయ్యాడని అరియానా గ్లోరి అంటే.. రేవంత్ అన్న మాములుగానే కొంచెం ఉన్న విషయాన్ని ఎక్కువ చేస్తాడు అని ఆరోహి చెప్పుకొచ్చింది. హౌజ్ లో టాప్ 9 ఉన్నారు.. నీ గెస్ ప్రకారం హౌజ్ లో టాప్ 5లో ఎవరుంటారు అని అరియానా అడిగితే.. ఆలోచనలో పడిపోయింది ఆరోహి రావు.

    English summary
    Anchor And Bigg Boss Telugu 6 Ex Contestant Arohi Rao About RJ Surya Friendship In BB Cafe With Ariyana Glory
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X