Bigg Boss Telugu 6 elimination ముగ్గురు కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ కత్తి.. తొలివారం షాకింగ్‌గా సెలబ్రిటీ బ్యూటీ
తెలుగు బుల్లితెరపై రికార్డు వ్యూవర్‌షిప్‌తో కొనసాగుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 రియాలిటీ షో యువ సెలబ్రిటీలతో కళకళలాడుతున్నది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు, గొడవలు, అలకలు, ఆనందం లాంటి అంశాలతో ముందుకెళ్తున్నది. అయితే తొలి వారం ఇంటి నుంచి ఓ సెలబ్రిటీని బయటకు పంపించేందుకు రంగం సిద్దమైంది. ఈ క్రమంలో తాజా ఓటింగ్ వివరాలు ఎలా ఉన్నాయి? ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

బాలాదిత్య కెప్టెన్‌గా
బిగ్‌బాస్ తెలుగు 6 షోలో ఇంటికి కెప్టెన్ ఎంపిక ప్రక్రియ సరదాగా జరిగిపోయింది. అంతకు ముందు క్లాస్, ట్రాష్ టాస్క్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా కెప్టెన్సీ టాస్క్ పోటికి ఎంపిక చేశారు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు ఫైమా సంచాలకులుగా వ్యవహరించారు. ఈ గేమ్‌లో గెలిచిన బాలాదిత్య ఇంటికి తొలి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

జైలుకు వెళ్లిన గీతూ రాయల్
ఇక ఇంటిలో తొలివారం చెత్త ప్రదర్శన ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనే టాస్క్‌ను ప్రారంభించాలని బిగ్‌బాస్ ఆదేశించారు. దాంతో తమ దృష్టిలో వరస్ట్ ఫెర్ఫార్మర్‌గా ఎవరనే విషయాన్ని కారణాలతో చెప్పారు. చివరకు ఈ టాస్క్ ముగిసిన తర్వాత ఎక్కువ ఓట్లు రావడంతో గీతూ రాయల్‌కు శిక్ష విధిస్తూ.. జైలులో బంధించారు.

నామినేషన్‌లో ఏడుగురు
బిగ్‌బాస్ తెలుగు 6 ఇంటి నుంచి తొలి వారం బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యుల్లో ఏడుగురు ఉణ్నారు. సింగర్ రేవంత్, చలాకీ చంటీ, శ్రీ సత్య, జబర్దస్త్ ఫైమా, ఇనయా సుల్తాన్, కొరియోగ్రాఫర్ అభినయ శ్రీ, యాంకర్ అరోహిరావును నామినేట్ అయ్యారు. అయితే శుక్రవారం నామినేషన్లు ముగిసిన తర్వాత ఓటింగ్ శాతం కింది విధంగా ఉంది.

సేఫ్ జోన్‌లో నలుగురు కంటెస్టెంట్లు
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొదలైన ఓటింగ్ లైన్లకు ప్రేక్షకులు భారీగా స్పందించారు. ఈ నామినేషన్‌లో ఉన్న సింగర్ రేవంత్ 31 శాతం ఓటింగ్‌తో టాప్ పొజిషన్ ఉన్నారు. ఆ తర్వాత 24 శాతం ఓటింగ్‌తో జబర్దస్త్ ఫైమా రెండోస్థానంలో సేఫ్‌గా ఉన్నారు. చలాకీ చంటి 14 శాతం ఓటింగ్‌తో 3వ స్థానం ఉన్నాడు. శ్రీ సత్య 12 శాతంతో 4వ స్థానంతో సేఫ్ జోన్‌లోకి వెళ్లింది.

డేంజర్ జోన్‌లో ముగ్గురు కంటెస్టెంట్లు
ఇక యాంకర్ అరోహి రావు విషయానికి వస్తే.. దూకుడుగా ఆడుతూ వివాదాస్పదంగా మారింది. అరోహి రావు 8 శాతం ఓటింగ్‌తో 5వ స్థానంలో ఉన్నారు. ఇక అభినయ శ్రీకి తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమెకు 6 శాతం 6వ స్థానంలో ఉన్నారు. ఇనయా సుల్తానా 5 శాతం ఓటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆమె ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నారు.

మిస్డ్ కాల్ డేటా కీలకంగా
ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం తొలి వారం ముగ్గురిపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. అరోహిరావు, అభినయ శ్రీ, ఇనయా సుల్తానా ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఈ ఓటింగ్‌ను పక్కన పెడితే.. మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు గానీ.. పైన సేఫ్ ప్లేస్‌లో ఉన్న మరో వ్యక్తి కూడా ఎలిమినేషన్‌కు గురి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











