Bigg Boss Telugu 6 కెమెరాలకు కనపడకుండా అతను అలా, ఆమెకు ఏడవటం నేర్పించాలి: ఎక్స్ ప్రెస్ హరి

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. తాజాగా ప్రసారమైన శుక్రవారం నాటి ఎపిసోడ్ లో సింగర్ రేవంత్ భార్య అన్వితతో వీడియో కాల్ లో మాట్లాడించారు. అది మధ్యలోనే ఆపేసి షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. రేవంత్ తల్లి ఎంట్రీతో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులందరితో సరదాగా ముచ్చటించారు రేవంత్ తల్లి. కానీ హౌజ్ విడిచివెళ్లిపోయేముందు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ల ఆట తీరుపై పై బీబీ కేఫ్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. ఈ కేఫ్ కు హాజరవుతున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

 కీలకంగా ఎలిమినేషన్..

కీలకంగా ఎలిమినేషన్..

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ నుంచి 11 వారాల్లో 12 మంది ఇంటి సభ్యులు బయటకు వెళ్లారు. ఇక ఇప్పుడు ఈ 12 వారం నామినేషన్లలో 9 మంది ఇంటి సభ్యులు ఉండగా అందులో ఏడుగురు నామినేట్ అయ్యారు. కెప్టెన్ అయిన కారణంగా రేవంత్, ఎవరు నామినేట్ చేయకపోవడంతో కీర్తి భట్ సేఫ్ కాగా.. రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, రాజ శేఖర్, ఫైమా, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ చాలా కీలకంగా మారనుంది.

కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి హాజరు..

కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి హాజరు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి హాజరయ్యాడు.

కవరింగ్ తో బతికేస్తున్నారు..

కవరింగ్ తో బతికేస్తున్నారు..

బీబీ కేఫ్ కు హాజరైన ఎక్స్ ప్రెస్ హరిపై పంచ్ లు వేస్తూ అతని నుంచి పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టింది యాంకర్ అరియానా గ్లోరి. కేఫ్ కు వస్తూనే.. "అంతా సెట్.. మన పీఆర్ టీమ్ రెడీ కదా.. రేయ్ మర్చిపోకు కటౌట్ మెయిన్" అంటూ ఎక్స్ ప్రెస్ హరి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి నీలాంటోళ్లు ఇలా కంటెంట్ లేకపోయినా కవరింగ్ తో బతికేస్తున్నారని సెటైర్ వేసింది యాంకర్ అరియానా గ్లోరి. దీంతో సేమ్ మనిద్దరం ఒకటే రివర్స్ పంచ్ విసిరాడు హరి.

గ్యాస్ స్టవ్ మీద డ్యాన్స్..

గ్యాస్ స్టవ్ మీద డ్యాన్స్..

ఫస్ట్ మాట్లాడం రావాలి కదరా అని అరియానా గ్లోరి అంటే.. ఇంత అందాన్ని చూసినప్పుడు తడబడమా చెప్పు అని ఎక్స్ ప్రెస్ హరి అన్నాడు. దీంతో సిగ్గు పడుతూ తల దించుకుంది అరియానా. నాన్ స్టాప్ (బిగ్ బాస్ ఓటీటీ సీజన్)లో ఒకటి నేర్చుకున్నా.. బిగ్ బాస్ డ్యాన్స్ చేసేందుకు అంతా ప్లేస్ ఇచ్చినప్పుడు కిచెన్ లో గ్యాస్ స్టవ్ పైన డ్యాన్స్ చేయకూడదని నేర్చుకున్నా అని హరి అంటే.. రేయ్ అంటూ కాఫీ మగ్ తో కొట్టబోయింది అరియానా.

అతనికి మంచి టాలెంట్ ఉంది..

అతనికి మంచి టాలెంట్ ఉంది..

అతికి అక్కలా ఉండకూడదని చెప్పా దేనికి.. చూశావా అక్కడ అక్కే.. నాన్ స్టాప్ లో అతికి అమ్మ అయిపోయావ్ ఏకంగాను అని హరి అంటే.. అతికి అమ్మా, అక్కా కాదురా.. అంకుల్ గాడిలా ఉన్నావని అరియానా కౌంటర్ ఇచ్చింది. నేను అంకుల్ నువ్ అతికి ఆంటీ అని మళ్లీ పంచ్ వేశాడు. రాజశేఖర్ గురించి మాట్లాడుతూ "అతనికి మంచి టాలెంట్ ఉంది. హౌజ్ లోని 70 కెమెరాలకు కనపడకుండా ఆడతాడు. అదొకరకమైన ఆట" అని హరి చెప్పాడు.

ఉప్పెనలో హీరోగా అడగలేదు..

కీర్తికి కొంచెం తెలుగు నేర్పించాలి. సేమ్ టైమ్.. ఏడవటం నేర్పించాలి, ఆ ఏడవటం ఆపేయడం నేర్పించాలి అని హరి అన్నాడు. తర్వాత హరి తలకు గాయం చూసి.. ఆ మార్క్ ఏంట్రా అని అరియానా అడిగితే.. ఓ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. మార్క్ కావాలన్నారు.. వెళ్లి ఫ్లాట్ కి గుద్దుకున్నా అని ఎక్స్ ప్రెస్ హరి అంటే.. అమ్మో ఇంకా నయం ఉప్పెనలో హీరోలా అడగలేదు నిన్ను అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అరియానా. దీంతో ఏం మాట్లాడలేకపోయాడు హరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X