Bigg Boss Telugu 6 grand launch live.. ఒకే రోజు రాజమౌళి ఆఫర్.. నా తల్లి మరణం.. కంటెస్టెంట్ ఎమోషనల్

బుల్లితెర ప్రేక్షకులు, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ అట్టహాసంగా మొదలైంది. హోస్ట్ నాగార్జున అక్కినేని ఈ షోను రాజసంగా ప్రారంభించారు. ఇంటిని మొత్తం పరిచయం చేస్తూ నాగ్.. ఆటను మొదలుపెట్టాడు. ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు ఎవరు? గ్రాండ్ లాంచ్ హైలెట్స్ ఏమిటి అనే విషయంలోకి వెళితే..

తొలి కంటెస్టెంట్‌గా కార్తీకదీపం ఫేమ్

తొలి కంటెస్టెంట్‌గా కీర్తి కేశవ్ భట్ వేదికపైకి వచ్చారు. మనసిచ్చి చూడు, కార్తీకదీపం సీరియల్ ద్వారా కీర్తి ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే తాను ఒంటరిని. నా కుటుంబం మొత్తం యాక్సిడెంట్‌లో చనిపోయారు. నేను ఒక్కరినే బతికాను. ఆ తర్వాత నా ఆస్తిని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కాజేసి.. నన్ను రోడ్డుపైకి నెట్టారు. నేను ఒక అమ్మాయిని దత్తత తీసుకొన్నాను. ఆమె నాకు తొడు అంటూ కీర్తి చెప్పింది.

రెండో కంటెస్టెంట్‌గా బాలనటి సుదీప

నువ్వు నాకు నచ్చావు సినిమాలో పింకిగా అందరికి పరిచయమైన సుదీప అలియాస్ పింకి రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అందరూ నన్ను పింకి అంటారు. కానీ నా పేరు సుదీప అని చెప్పింది. తన తల్లిదండ్రులు క్లాసికల్ డ్యాన్సర్లు. వారి వద్ద నుంచి నేను డ్యాన్స్ నేర్చుకొన్నాను అని చెప్పింది. కొన్ని టాస్కులకు డ్యాన్స్ రూపంలో స్టెప్పులేసి ఆకట్టుకొన్నది.

మూడో కంటెస్టెంట్‌గా శ్రీహాన్

గత బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంతు బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ మూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు 6 లోకి అడుగుపెట్టారు. గత ఏడాది నేను వేదికపైన పాడిన పాటతోనే నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పారు. అలా తొలి మేల్ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి వెళ్లారు.

నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరీ

నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరీ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు. ఐపీఎల్ హోస్ట్‌గా నేహా అందరికి సుపరితులు. బిగ్‌బాస్‌లోకి వెళ్లు.. లేకపోతే పెళ్లి చేసుకో అని ఇంటివాళ్లు అంటే.. చివరకు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాను అని చెప్పారు. తనకు నీలాంటి మన్మథుడు భర్తగా వస్తే హ్యాపీ అని నేహా చౌదరీ చెప్పింది.

ఐదో కంటెస్టెంట్‌గా చలాకీ చంటీ


జబర్దస్త్‌లో చలాకీ చంటీగా అందరికి సుపరితులైన సెలబ్రిటీ బిగ్‌బాస్‌ తెలుగు 6లోకి అడుగుపెట్టారు. తన జీవితం గురించి, ప్రేమ, పెళ్లి గురించి చెప్పి వేదికపై ఆకట్టుకొన్నాడు. ఇంటిలోకి వెళ్లే ముందు హార్ట్ సింబల్ ఉన్న ఓ కార్డును నాగార్జున ఇచ్చారు. దానిని తీసుకొని ఇంటిలోకి అడుగుపెట్టారు.

ఆరో కంటెస్టెంట్‌గా యాక్టర్ శ్రీ సత్య

ఆరో కంటెస్టెంట్‌గా యాక్టర్ శ్రీ సత్య

శ్రీ సత్య మిస్ ఆంధ్రా, మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో రామ్ పోతినేని మాజీ ప్రేయసిగా నటించింది. ఆ తర్వాత పలు టెలివిజన్ సీరియల్స్, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లో నటించింది. ఆరో కంటెస్టెంట్‌గా యాక్టర్ శ్రీ సత్య
శ్రీ సత్య మిస్ ఆంధ్రా, మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో రామ్ పోతినేని మాజీ ప్రేయసిగా నటించింది. ఆ తర్వాత పలు టెలివిజన్ సీరియల్స్, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లో నటించింది. శ్రీ సత్య మిస్ ఆంధ్రా, మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో రామ్ పోతినేని మాజీ ప్రేయసిగా నటించింది. ఆ తర్వాత పలు టెలివిజన్ సీరియల్స్, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లో నటించింది.

ఏడో కంటెస్టెంట్‌గా అర్జున్ కల్యాణ్

ఏడో కంటెస్టెంట్‌గా అర్జున్ కల్యాణ్

తెలుగు ఫిల్మీ ఇండస్ట్రీలో నటుడిగా అర్జున్ కల్యాణ్ రాణించే ప్రయత్నాల్లో ఉన్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. నేను నా గర్ల్ ఫ్రెండ్, మిస్సమ్మ, నారీ నారీ నడుమ మురారీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్‌లో నటించారు. ఇటీవల ఆహాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ప్లే బ్యాక్ సినిమాలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్

ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్


బిగ్‌బాస్ తెలుగు 6 షోలోకి గీతూ రాయల్ 8వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. గీతూ రాయల్ యాక్టర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. టిక్ టిక్ ద్వారా మరింత పాపులారిటిని సాధించారు. జబర్తస్త్‌లో రోహిణి టీమ్‌లో మెంబర్‌గా ఉన్నారు.

తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయ శ్రీ

సీనియర్ నటి, డ్యాన్సర్ అనురాధ కూతురిగా అభినయ శ్రీ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆర్య చిత్రంలో అ అంటే అమలాపురం అనే పాటతో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఆ తర్వాత ఆమె సినిమా పరిశ్రమలో కనిపించకుండా పోయారు. తాజాగా తొమ్మిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు.

10, 11వ కంటెస్టెంట్‌గా రోహిత్, మణి

బిగ్‌బాస్ తెలుగు 6లోకి మరో జంట రోహిత్ సాహ్నీ, మారినా అబ్రహం అడుగుపెట్టారు. గతంలో హీరో వరుణ్ సందేశ్, వితికా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గోవాకు చెందిన మారినా రొమాన్స్ విత్ ఫైనాన్స్ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రోహిత్ నీలి కలువలు, అభిలాష సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న వీరిద్దరూ జంటగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు.

12వ కంటెస్టెంట్‌గా బాలాదిత్య

బిగ్‌బాస్‌ తెలుగు 6 రియాలిటీ షోలోకి నటుడు బాలాదిత్య ప్రవేశించారు. 12వ కంటెస్టెంట్‌గా వేదిక మీదకు వచ్చిన ఆయన తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకొన్నారు. షోలోకి వచ్చే ముందు తనకు రెండో బిడ్డ జన్మించిందని చెప్పారు. తాను హలో బ్రదర్‌లో మీతో కలిసి నటించానని నాగార్జునకు గుర్తు చేశారు. అలా బాలాదిత్య బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు.

13వ కంటెస్టెంట్‌గా వాసంతి కృష్ణన్

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలోకి వాసంతి కృష్ణన్ అడుగుపెట్టారు. వాసంతి యాంకర్‌గా, యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2022లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో వెండితెర మీద మెరిసారు. తాజాగా బిగ్‌బాస్‌లోకి ప్రవేశించారు.

14వ కంటెస్టెంట్‌గా షానీ సల్మాన్

పాలమూరు జిల్లాలోని జడ్చర్లకు చెందిన షానీ సాల్మన్ వాస్తవంగా స్పోర్ట్స్ పర్సన్. జాతీయ స్థాయిలో పరుగు పందాలలో పాల్గొన్నాడు. కాలికి గాయం కావడంతో క్రీడలకు స్వస్తి చెప్పాడు. ఆ సమయంలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై సినిమాలో నటించే అవకాశం దక్కించుకొన్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగులోకి 14వ కంటెస్టెంట్‌గా ఇంటిలోకి ప్రవేశించారు.

15వ కంటెస్టెంట్‌గా ఇనయా సుల్తానా

యాక్టర్ ఇనయా సుల్తానా మోడల్‌గా రాణిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈమె ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బర్త్ డే రోజున జరిగిన పార్టీలో హంగామ జరగడంతో పాపులర్ అయ్యారు. తెలుగులో ఏవమ్ జగత్, బుజ్జి ఇలా రా, నట రత్నాలు, యాద్బావం తద్బవతి చిత్రాల్లోనటిస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 6 షోలోకి ప్రవేశించారు.

16వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య

పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 6 లోకి ఆర్జే సూర్య అడుగుపెట్టారు. ఆర్జే సూర్య అసలు పేరు సూర్య నారాయణ. అతడిని కొండబాబు అని కూడా పిలుస్తారు. రేడియో జాకీగా, యాంకర్, మిమిక్రీ ఆర్టిస్టుగా, రైటర్, యాక్టర్‌గా రాణిస్తున్నాడు. ఈస్ట్ గోదావరి జిల్లాలో పసువుల్లంకలో జన్మించారు. భీమవరంలో పుట్టి పెరిగారు. గుంటూరు టాకిస్, గరుడవేగ చిత్రాల్లో నటించాడు.

16వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య

పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 6 లోకి ఆర్జే సూర్య అడుగుపెట్టారు. ఆర్జే సూర్య అసలు పేరు సూర్య నారాయణ. అతడిని కొండబాబు అని కూడా పిలుస్తారు. రేడియో జాకీగా, యాంకర్, మిమిక్రీ ఆర్టిస్టుగా, రైటర్, యాక్టర్‌గా రాణిస్తున్నాడు. ఈస్ట్ గోదావరి జిల్లాలో పసువుల్లంకలో జన్మించారు. భీమవరంలో పుట్టి పెరిగారు. గుంటూరు టాకిస్, గరుడవేగ చిత్రాల్లో నటించాడు.

17వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫైమా

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలోకి జబర్దస్త్ ఫేమ్ ఫైమా అలియాస్ ఫైమా షేక్ అడుగు పెట్టారు. తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకొన్న ఈమె గమ్మత్తుగా సెలబ్రిటీగా మారిపోయారు. యాంకర్ రవి హోస్ట్‌గా వ్యవహరించే పటాస్ షోలోకి ప్రేక్షకురాలిగా వెళ్లి.. ఆమె మాట్లాడిన మాటలకు ప్రేక్షకులతోపాటు హోస్ట్‌ కూడా నవ్వడంతో ఆమె పటాస్, జబర్దస్త్ షోలో ఆఫర్లు రావడంతో మరింత పాపులారిటి సంపాదించింది. అలా బిగ్‌బాస్‌లో ఆఫర్ పట్టేసి.. ఇంటిలోకి వెళ్లింది.

18వ కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి


యూట్యూబర్‌గా, క్రికెట్ అనలిస్టుగా, బిగ్‌బాస్ రివ్యూవర్‌గా ప్రేక్షకులకు ఆదిరెడ్డి సుపరిచితులు. నెల్లూరుకు చెందిన ఆదిరెడ్డి మూవీ క్రిక్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. సినిమా, క్రికెట్ వార్తలను అందిస్తూ మరింత పాపులారిటిని సంపాదించుకొన్నారు. సోషల్ మీడియాలో 1 లక్ష ఫాలోవర్స్ ఉన్నారు.

19వ కంటెస్టెంట్ యాంకర్ రాజశేఖర్


నటుడిగా, యాంకర్‌గా రాజశేఖర్ గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే పెద్దగా తెలియని ఈ యాంకర్‌ ఇంటిలోకి రావడం ఆశ్చర్యం కలిగించింది. రాజశేఖర్ మాస్ ఎంట్రీతో ఇచ్చారు. అమ్మాయిలతో స్టెప్పులేస్తూ రావడం నాగార్జున ఆకట్టుకొన్నది. పలు ప్రశ్నలు వేసి రాజశేఖర్‌ను ఇంటిలోకి పంపించారు.

20 కంటెస్టెంట్ అరోహి రావు


అరోహి రావు అలియాస్ అంజలి టీవీ9 యాంకర్. వరంగల్‌‌లో పుట్టి పెరిగారు. హనుమకొండలోని వాగ్దేవీ డిగ్రీకాలేజీలో చదువుకొన్నారు. భీమ్స్ మీడియాలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. తుపాకీ, స్టూడియో న్యూస్, స్టూడియో వన్ చానెల్‌లో పనిచేశారు. ప్రస్తుతం టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

21 కంటెస్టెంట్‌గా సింగర్ రేవంత్

సింగర్ రేవంత్ అసలు పేరు లోల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ. ఇండియన్ ఐడల్ సీజన్ 9 విన్నర్. ఇప్పటి వరకు 200 పాటలు పాడారు. బాహుబలిలో మనోహరి పాటకు అవార్డులు అందుకొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. విశాఖపట్నంలో చదువుకొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 6 షోలో చివరి కంటెస్టెంట్‌గా ఇంటిలోకి ప్రవేశించారు.

Read more about: bigg boss telugu 6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X