Bigg Boss Telugu 6 ఆమె ఆటకు పెద్ద దండం, అతని రాకకోసం వెయిటింగ్.. హమిదా కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఈ సీజన్ 81 రోజులు పూర్తి చేసుకోగా 82వ ఎపిసోడ్ గురవారం ప్రసారమైంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఈవారం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క కంటెస్టెంట్ పేరెంట్స్, రిలేటివ్స్ రావడంతో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ సీజన్ తెలుగు 6 ఇలా సాగుతుంటే ఇందులోని కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీబీ కేఫ్ కు ఐదో సీజన్ కంటెస్టెంట్ హమిదా హాజరైంది.

ఆ ఇద్దరు సేఫ్..

ఆ ఇద్దరు సేఫ్..

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ నుంచి 11 వారాల్లో 12 మంది ఇంటి సభ్యులు బయటకు వెళ్లారు. ఇక ఇప్పుడు ఈ 12 వారం నామినేషన్లలో 9 మంది ఇంటి సభ్యులు ఉండగా అందులో ఏడుగురు నామినేట్ అయ్యారు. కెప్టెన్ అయిన కారణంగా రేవంత్, ఎవరు నామినేట్ చేయకపోవడంతో కీర్తి భట్ సేఫ్ కాగా.. రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, రాజ శేఖర్, ఫైమా, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.

బిగ్ బాస్ బ్యూటి హమిదా హాజరు..

బిగ్ బాస్ బ్యూటి హమిదా హాజరు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు ఐదో సీజన్ కంటెస్టెంట్ హమిదా హాజరైంది.

అది చూస్తుంటే రేవంతే అనిపిస్తుంది..

అది చూస్తుంటే రేవంతే అనిపిస్తుంది..

బీబీ కేఫ్ కు హాజరైన హమిదా నుంచి పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టింది యాంకర్ అరియానా గ్లోరి. హమిదా.. నీతో మాటలు కాదు ఒక ఆట ఆడిస్తా అని చెప్పిన అరియానా ఆమె ముందు ఎమోజీస్ ను చూపించింది. అందులో ఒక్కో ఎమోజీ ఏ కంటెస్టెంట్ కు సూట్ అవుతుందో చెప్పాలని అంది అరియానా. కోపంతో ఉన్న సింబల్ వస్తే.. దాన్ని చూస్తుంటే రేవంతే ఎప్పుడు అలా ఉంటాడని అనిపిస్తుందని చెప్పింది హమిదా.

శ్రీసత్యకు పెద్ద దండం..

శ్రీసత్యకు పెద్ద దండం..

నవ్వుతున్న ఎమోజీని చూసి ఫైమా అని చెప్పింది హమిదా. అలాగే పంచ్ ఎవరికీ అంటే ఆదిరెడ్డి అని చెప్పింది. ఎందుకు అని అడిగిన అరియానా ప్రశ్నకు.. కొన్ని కొన్నిసార్లు రివ్యూస్ ఇస్తున్నారు.. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని హమిదా తెలిపింది. దండం పెడుతున్న సింబల్ వస్తే.. ఎవరి గేమ్ కు మీకో దండం అని అనిపించిందన్న అరియానా క్వశ్చన్ కి.. శ్రీ సత్య అని చెప్పింది హమిదా.

ఇనయాకు పెద్ద ఫ్యాన్..

ఇనయాకు పెద్ద ఫ్యాన్..

చాలా వారాలు అనిపించింది.. శ్రీ సత్య ఈ వీక్ వెళ్లిపోతుందేమో.. ఈ వీక్ వెళ్లిపోతుందేమో అని హమిదా తర్వాత వివరణ ఇచ్చింది. దీంతో మీ రాక కోసం హమిదా ఎదురు చూస్తుంది అని అరియానా గ్లోరి అంటే.. అయ్యయ్యో.. అని హమిదా అంది. టాప్ 9 హౌజ్ లో ఉన్నారు.. మీ ఫేవరెట్స్ ఎవరు అని అడగ్గా.. మా మమ్మీ అండ్ డాడ్ ఇనయాకు పెద్ద ఫ్యాన్స్ అని హమిదా తెలిపింది. దీంతో షాక్ అవుతూ నోరెళ్ల బెట్టింది అరియానా గ్లోరి.

అక్కడికి వెళ్లింది దేనికోసం..

అక్కడికి వెళ్లింది దేనికోసం..

బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి గేమ్ గానీ, స్ట్రాటజీస్ గానీ ఎలా అనిపిస్తుంది అని అరియానా అడగ్గా.. నేను నిజంగా ఒక కంటెస్టెంట్ కోసం వెయిట్ చేసేది అంటే అది ఆదిరెడ్డినే అని హమిదా చెప్పింది. దీనికి పెద్ద సమస్యే వచ్చింది ఆదిరెడ్డి గారు అని అరియానా డైలాగ్ కొట్టింది. శ్రీ సత్య గేమ్ గురించి అడగ్గా.. హౌజ్ లో ఉన్నప్పుడు తను ఫుటేజ్ కోసం మాట్లాడుతుంది.. తను కెమెరాల కోసం మాట్లాడుతుంది.. అక్కడికి వెళ్లింది దేనికోసం.. కెమెరాస్ ఉన్నాయి తెలుసు కదా అని చెప్పుకొచ్చింది బ్యూటిఫుల్ హమిదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X