ఆదిరెడ్డి నీవేమైనా తోపువా? తురుమువా?.. తీరు మార్చుకో లేకపోతే, గేట్లు తీసి బయటకు.. నాగార్జున వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 6 ముగింపుకు చేరుకొన్నది. టైటిల్‌ను, భారీ పారితోషికాన్ని సొంతం చేసుకొనేందుకు కంటెస్టెంట్లు తమ వ్యూహాలను పన్నుతున్నారు. అయితే ఎవిక్షన్ పాస్‌కు సంబంధించి ఆదిరెడ్డి తీసుకొన్న నిర్ణయంపై హోస్ట్ నాగార్జున ఘాటుగా మందలించారు. నీవు గేట్లు తెరవమనడం కాదు.. ఆడియెన్స్ వచ్చి నిన్నే బయటకు తీసుకెళ్తారు అంటూ నాగార్జున గట్టిగా తలంటాడు. ఈ వారాంతం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇచ్చిన వార్నింగ్ వెనుక కథ ఏమిటంటే?

 ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్

ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్


బిగ్‌బాస్ తెలుగు 6 టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉన్న ఎవిక్షన్ పాస్ ఆప్షన్‌ను ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఇచ్చారు. ఎవిక్షన్ పాస్ కోసం జరిగే టాస్క్ కోసం ఓ గేమ్‌ను ఆడించారు. ముందుగా బజర్ నొక్కిన ముగ్గురు కంటెస్టెంట్లకు ఈ అవకాశం లభిస్తుంది. ఈ పాస్ సొంతం చేసుకోవాలంటే.. పారితోషికం కోసం కొంత మొత్తం చెల్లించి గేమ్‌లో భాగం కావాల్సి ఉంటుంది అని రూల్స్ చెప్పారు.

 ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ ఆడకపోవడమే నా టాస్క్

ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ ఆడకపోవడమే నా టాస్క్


అయితే ఎవిక్షన్ పాస్ గేమ్ నుంచి తప్పుకొంటూ ఆదిరెడ్డి విచిత్రమైన కామెంట్స్ చేశాడు. నాకు ఎవిక్షన్ పాస్ వద్దనిపిస్తున్నది అని ఆదిరెడ్డి అంటే.. పాస్ ఎప్పుడు ఉపయోగించేది కాకుండా.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను ఆడాల్సి ఉంటుందని ఇనియా చెప్పింది. అయితే ఈ టాస్క్ ఆడకూడదనేది నా టాస్క్. నీవు విన్నర్ కాకపోతే.. వేరే వాడి డబ్బుతో మరో వారం ఇంటిలో ఉంటావు. ఈ పాస్ వస్తే.. ఆడియెన్స్ నీకు ఓట్లు వేయకపోవడమని రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ టాస్క్ ఆడకపోవడమనేది నా సొంత నిర్ణయమని ఆదిరెడ్డి అన్నాడు.

అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా

అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా


ఆదిరెడ్డి తీసుకొన్న నిర్ణయంపై హోస్ట్ నాగార్జున స్పందిస్తూ.. ఆది.. నీకు ఇనయా ఒక విషయం చెప్పింది. బిగ్‌బాస్ ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలి కానీ.. అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా ఉండటానికి చూసుకోకూడదు. ఒకవేళ నీవే కనుక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఆడి.. నీకు వచ్చి ఉంటే.. ఒక జెన్యూన్ కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడం జరిగిది కదా.. అది సపోర్ట్ కదా. అది ఆట తీరు కాదా.. నిన్ను ఎంతమంది మెచ్చుకొంటారు అని నాగార్జున మందలించాడు.

 ఎవిక్షన్ పాస్ వేస్టా? నాగ్ ఫైర్

ఎవిక్షన్ పాస్ వేస్టా? నాగ్ ఫైర్


ఆదిరెడ్డికి నాగార్జున మరింత క్లాస్ పీకుతూ.. ఎవిక్షన్ పాస్ వేస్టా? ఆ పాస్ ఎవరికి వస్తే.. ఓట్లు రావా? నీవు ఏమైనా తోపువా? తురుమువా? గేమ్ విషయంలో ఎక్కువగా ఆలోచించి.. కారణాలు వెతికితే ఏమౌతుందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో నాగార్జునకు సమాధానం ఇస్తూ.. నేను నిజంగా గెలిస్తే.. నాకు నేను దానిని వాడుకోను కదా.. అని అన్నాడు. దాంతో నీవు గెలిచి.. ఆ మాట చెప్పు అంటూ గట్టిగా మందలించాడు.

గేట్లు తీసి.. బయటకు పంపిస్తారు..


నాగార్జున చెప్పిన మాటలపై ఆదిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం ఆడటం డబ్బులు వేస్ట్ అని అంటే.. నీకు ఇమ్యునిటీ ఎందుకు కావాలనుకొంటున్నావు అని నాగ్ ప్రశ్నించాడు. ఇమ్యునిటీ వస్తే.. నేను కెప్టెన్ అవుతాను. దాని వల్ల నేను సేఫ్ అవుతానని ఆదిరెడ్డి అంటే.. ఆది.. బిగ్‌బాస్ హౌస్‌లో తీరు మార్చుకో. మార్చుకోకపోతే.. గేట్లు తీయండి.. నేను వెళ్లిపోతాను అనడం కాదు.. ఆడియెన్స్ వచ్చి.. నిన్ను బయటకు తీసుకు వెళ్తారు అని నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X