twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 హౌజ్ లో దెయ్యం అరుపులు!.. భయంతో బాత్రూమ్ లో దాక్కున్న ఇంటి సభ్యులు

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఈసారి అనుకున్నంత స్థాయిలో అయితే రేటింగ్స్ తో రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. ఈసారి షో ప్లాప్ కావడానికి అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి బిగ్ బాస్ అయితే చివరి దశకు చేరుకుంటున్న కొద్ది ఎంతో కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హౌజ్ లో తగ్గించిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి తెచ్చుకునేందుకు టాస్క్ లు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో దెయ్యాలు ఉన్నట్లు వింత శబ్ధాలు వినిపించాయి. దీనికి సంబంధించిన డిసెంబర్ 6 మంగళవారం నాటి ఎపిసోడ్ మూడో ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

    నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్..

    నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్..

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. అయితే ఈ 14వ వారం నామినేషన్ల ప్రక్రియ జరగలేదు. ఇంటి సభ్యులను నేరుగా బిగ్ బాస్ నామినేట్ చేశాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి ఫినాలేకు వెళ్లిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీహాన్ నిలిచాడు. దీంతో అతను నామినేట్ కాలేదు. అతను తప్పా మిగతా ఇంటి సభ్యులందరిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అంటే ఈ 14వ వారం నామినేషన్లలో రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా, శ్రీసత్య, కీర్తి భట్ ఆరుగురు ఉన్నారు.

     ప్రైజ్ మనీ నుంచి కోత..

    ప్రైజ్ మనీ నుంచి కోత..

    ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఇదివరకు టాస్కుల రూపంలో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని కోత విధించిన విషయం తెలిసిందే. ఆ డబ్బు సుమారు రూ. 12 లక్షలుగా ఉన్నట్లు గత ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలిపాడు. అయితే ఆ డబ్బును మళ్లీ తిరిగి పొందేందుకు ఇంటి సభ్యులచేత టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్. మొదటి ఛాలెంజ్ లో రోహిత్, శ్రీసత్య పాల్గొనగా రెండో ఛాలేంజ్ లో రేవంత్, ఇనయా పాల్గొన్నారు.

     ప్రైజ్ మనీలోకి యాడ్ అయిన డబ్బు..

    ప్రైజ్ మనీలోకి యాడ్ అయిన డబ్బు..

    ఈ రెండో ఛాలెంజ్ లో రేవంత్ గెలిచినట్లు బీబీ విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఇంటి సభ్యులందరూ కూడా రేవంత్ గెలుస్తాడని, ఇనయా ఓడిపోతుందని ఓట్లు వేశారు. దీంతో బిగ్ బాస్ ప్రకటించిన రూ. లక్ష 10 వేల డబ్బుని విన్నర్ ప్రైజ్ మనీలోకి యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 6 మంగళవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ఎపిసోడ్ మూడో ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

     రాత్రిపూట ఇంటి సభ్యులకు శ్రీసత్య కథ..

    రాత్రిపూట ఇంటి సభ్యులకు శ్రీసత్య కథ..

    ప్రోమోలో రాత్రిపూట బెడ్ పై ఇంటి సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. శ్రీసత్య తనకు జరిగిన ఓ విషయం గురించి చెబుతుంటే రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయా, కీర్తి అంతా ఆసక్తిగా వింటున్నారు. శ్రీహాన్ మాత్రం తన బెడ్ పై పడుకున్నాడు. అందరం కూర్చున్నాం. పార్టీ చేసుకున్నాం. నేను వెళ్లి నిద్రపోయా. మా దాంట్లో ఉన్న ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు పిలుస్తుంటే అని శ్రీసత్య చెప్పింది.

    శ్రీహాన్ పై పడిన శ్రీసత్య..

    శ్రీహాన్ పై పడిన శ్రీసత్య..

    శ్రీసత్య అలా చెప్పడంతోపాటు ఆ అబ్బాయి ఏదో సౌండ్ చేశాడని అలానే చేసి చూపించింది. అలా అనుకుంటూ వెళ్లిపోతున్నాడు లోపలికి అని శ్రీసత్య అంటే రాత్రి పూట అని ఆదిరెడ్డి అన్నాడు. ఇంతలో ఒక్కసారిగా అదోలా నవ్వులు వినిపించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. శ్రీసత్య అయితే శ్రీహాన్ బెడ్ పైకి దూకింది. దీంతో అయోమయంగా లేచి చుట్టు చూశాడు శ్రీహాన్.

    భయంతో బాత్రూమ్ లో ఇంటి సభ్యులు..

    తర్వాత అందరూ బిగ్గరగా అరిచి నవ్వారు. కొద్దిసేపటికీ దుప్పటి కప్పుకున్న ఆదిరెడ్డి ఈసారి దెయ్యాన్ని నా దగ్గరికి రమ్మను చెబుతా అంటూ చిటికెలు వేశాడు ఆదిరెడ్డి. ఏం చేస్తారు అని శ్రీసత్య, కీర్తి అడిగారు. ఇంతలో బయట నుంచి భయంతో అరుస్తూ ఇనయా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. దీంతో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి బాత్రూమ్ లో దాక్కున్నారు. అలా దాక్కుని వాళ్లలో వాళ్లే నవ్వుకున్నారు.

    English summary
    Bigg Boss Telugu 6 Funniest Scary Tales In Bigg Boss House December 6 Episode Day 93 Promo 3 Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X