twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: గీతూ వెళ్లిపోయిన వారం నుంచే అలా, ఆమె మార్చుకుంటే బెస్ట్.. ఫైమా ఆసక్తికర కామెంట్స్

    |

    బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో మొదటి నుంచే ఎలిమినేషన్ షాకింగ్ గా మారింది. టైటిల్ ఫెవరెట్ గా నిలిచినవాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చారు. ఇలా తాజాగా మరొక ఎంటర్టైనర్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. జబర్దస్త్ లేడి కమెడియన్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా ఫైనల్ లో ఉంటానని కాన్ఫిడెంట్ గా చెప్పిన ప్రేక్షకుల ఓటింగ్ తో ఈవారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఫైమా బీబీ కేఫ్ కు హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

    ఎంటర్టైనర్ గా..

    ఎంటర్టైనర్ గా..

    జబర్దస్త్ కమెడియన్ గా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో చోటు దక్కించుకుని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఫైమా. హౌజ్ లోకి ఎంటర్ కాగానే తనదైన కామెడీతో ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. వెటకారమనే విమర్శలు పొందినప్పటికీ ఇంటి సభ్యుల దృష్టిలో మంచి ఎంటర్టైనర్ అనిపించుకుంది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వ వారం ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది.

    ఆసక్తికర క్వశ్చన్స్ తో..

    ఆసక్తికర క్వశ్చన్స్ తో..

    ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినట్ అయిన ఇంటి సభ్యులను బీబీ కేఫ్ ద్వారా నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 13వ వారం ఎలిమినేట్ అయిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా బీబీ కేఫ్ కు హాజరైంది. ఆమెకు పలు ఆసక్తికర క్వశ్చన్స్ వేసి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టాడు యాంకర్ శివ. కామెడీ చేస్తానని హౌజ్ లోపలికి వెళ్లి వ్యంగానికి, వెటకారానికి మధ్యలో ఇరుక్కుపోయింది అని చెప్పి ఫైమాను ఆహ్వానించాడు శివ.

    గీతూ వెళ్లిపోయిన వారం నుంచే..

    గీతూ వెళ్లిపోయిన వారం నుంచే..

    నీ మీద నీకు కాన్ఫిడెంట్ టాప్ 5లో ఉంటానని ఎప్పుడు అనిపించిందని ఫైమాను యాంకర్ శివ ప్రశ్నించాడు. అసలు అనిపించలేదని ఫైమా ఆన్సరిచ్చింది. గీతూ రాయల్ వెళ్లిపోయిన వారం నుంచే టోటల్ చేంజ్ అయ్యాను. అంతా ఓవర్ కాన్ఫిడెంట్ వద్దనిపించింది. ఉన్నన్ని రోజులు మంచిగా ఉందామని చెప్పేసి ఉన్నా అని ఫైమా చెప్పింది. మంచిగా ఉన్నావా అని తిరిగి ప్రశ్నించాడు శివ. దీంతో షాక్ అయి చూస్తూ ఉండిపోయింది ఫైమా.

    మార్చుకుంటే ఫైమా ఎలా అవుతా..

    మార్చుకుంటే ఫైమా ఎలా అవుతా..

    ఫైమా.. నవ్విస్తానని చెప్పి లోపలికి వెళ్లి.. నవ్వు కాస్తా అలా వెటకారంగా మారిపోయి చాలా మంది హౌజ్ లో ఇబ్బంది పడ్డారు తెలుసా అని యాంకర్ శివ అన్నాడు. వెటకారం అంటే అది వాళ్లకు అనిపించింది. వాళ్ల అభిప్రాయాన్ని మనం మార్చలేమని ఫైమా అంది. నువ్ మార్చుకోవాలని నీకు ఎప్పుడు అనిపించలేదా.. అని మళ్లీ శివ అడగ్గా.. అలా మార్చుకుంటే నేను ఫైమాను ఎందుకు అవుతా అని ఫైమా జవాబిచ్చింది.

     డిసైడ్ చేసుకోలేకా స్టార్ట్ చేశావా..

    డిసైడ్ చేసుకోలేకా స్టార్ట్ చేశావా..

    అది మార్చుకున్నంత మాత్రానా నువ్ మారిపోయినట్లు కాదు.. నువ్ అంతా అయిపోయినట్లు కాదు అని యాంకర్ శివ అన్నాడు. నేను నాలాగే ఉందామనుకున్నాను.. ఒకరు చెబితే మారడానికి సిద్ధంగా లేను అని ఫైమా అంది. దీంతో యాంకర్ శివ షాక్ అయ్యాడు. తర్వాత డిసైడ్ చేసుకోలేకా మాటలు ఆపేసి స్టార్ట్ చేస్తావా అని అంటే.. నేను మాట్లాడింది నా బాడీ లాంగ్వేజ్ కనిపించింది కానీ, అవతల వాళ్లు వెటకారంగా నవ్వడం మాత్రం ఎవ్వరికీ కనిపించలేదని ఫైమా చెప్పింది.

    ఆమె మార్చుకుంటే బెస్ట్..

    ఆమె మార్చుకుంటే బెస్ట్..

    అనంతరం ఒక్కొక్కరి గురించి చెబుతూ.. కీర్తిలో బెస్ట్ తన ఫిజికల్ స్ట్రెంత్ అని చెప్పింది ఫైమా. టాస్క్ లు ఆడి దెబ్బలు తగిలించుకోవడం నాకిష్టం లేదని చెప్పిన శ్రీసత్య మూడో వారం నుంచి మారిపోయి దెబ్బ తాకిన భరిస్తూ టాస్క్ ల్లో పాల్గొందని ఫైమా తెలిపింది. మార్చుకుంది అని శివ అంటే.. అది బెస్ట్ అని ఫైమా అంది. దీంతో మార్చుకున్నందుకు బెస్ట్ అని అన్నావ్.. నీది నువ్వు మార్చుకోమంటే ఫైమా ఎలా అవుతుంది అని అన్నావ్ అని ఫైమాకు కౌంటర్ వేశాడు శివ.

    హర్టింగ్ అంటే ఏంటీ..

    రోహిత్ గురించి చెబుతూ.. తన మాట్లాడే విధానం.. ఎవరికీ హర్టింగ్ గా ఉండదు అని ఫైమా చెబుతుంటే.. హర్టింగ్ అంటే ఏంటీ.. అని యాంకర్ శివ అడిగాడు. ఏదైనా సిచ్యుయేషన్ జరిగినప్పుడు ఏదో ఒక మాట వదిలేస్తారుగా అలా అని ఫైమా చెప్పింది. దీంతో నీలాగా అని మళ్లీ పంచ్ వేశాడు యాంకర్ శివ. దీనికి నవ్వుతూ సరే వేసుకోండి అని సరదాగా సమాధానం ఇచ్చింది జబర్దస్త్ కమెడియన్ ఫైమా.

    English summary
    Bigg Boss Telugu 6th Season 13th Week Eliminated Contestant Jabardasth Faima Interview With Anchor Shiva In BB Cafe And Gives Interesting Answers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X