Bigg Boss Telugu 6: యాంకర్ కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన రాజశేఖర్.. ఆ మాటతో షాక్ లో శివ!

ఊహించని పరిణామాలు, అనుకోని సంఘనటలతో బిగ్ బాస్ ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచినావాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా క్వాలిటీ ఉన్న వ్యక్తులే ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. అయితే వాళ్ల ఆట తీరు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. కానీ మొదటిసారి ప్రేక్షకులు మెచ్చిన కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్ టీమ్.

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వ వారం ప్రేక్షకులు మెచ్చిన, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆఫీస్ బాయ్ గా జీవిత ప్రయాణం మొదలు పెట్టిన రాజ్ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అశేష ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకున్నాడు. తాజాగా రాజ్ బీబీ కేఫ్ కు హాజరు కాగా అతన్ని ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ. ఆ వివరాళ్లోకి వెళితే..

ఒకరిని కాపాడుకునేందుకు..

ఒకరిని కాపాడుకునేందుకు..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మొదటి నుంచి విచిత్రమైన సంఘటనలతో సాగుతోంది. కంటెస్టెంట్ల నుంచి బిగ్ బాస్ టీమ్ ప్లాన్స్ వరకు అన్ని షాకింగ్ గా ఉన్నాయి. బీబీ టీమ్ ఒకరిని కాపాడుకునేందుకు మరొకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రేక్షకుల మన్నననలు పొందిన మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజశేఖర్ కి శివ క్వశ్చన్స్..

రాజశేఖర్ కి శివ క్వశ్చన్స్..

మొత్తానికైతే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 12వ వారం రాజశేఖర్ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడాడు. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ (బీబీ కేఫ్) ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బీబీ కేఫ్ కు హాజరయ్యాడు తాజా ఎలిమినేట్ కంటెస్టెంట్ రాజశేఖర్. అతన్ని బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్ శివ పలు క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ రాబట్టాడు.

అదృష్టంతో ఎవరు రారు..

అదృష్టంతో ఎవరు రారు..

హౌజ్ లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి. ఈ రెండు జరగకుండా లక్ తో వచ్చావ్ చూశావా.. నక్కతోక తొక్కిచ్చినట్లుగా అని యాంకర్ శివ అన్నాడు. అందుకు అదృష్టంతో ఎవరు రారని రాజశేఖర్ సమాధానం ఇచ్చాడు. దీనికి నేను అదే అంటున్నా.. బిగ్ బాస్ లో ఎవరు అదృష్టంతో ఎవరు రారు.. నువ్ వచ్చావంటున్నా అని శివ అన్నాడు. శివ అలా అనడంతో రాజశేఖర్ తల దించుకున్నాడు.

70 కెమెరాలు తప్పించుకుని..

70 కెమెరాలు తప్పించుకుని..

నాకు తెలిసి బిగ్ బాస్ షో అనేది పర్సనాలిటీ షో.. నా పర్సనాలిటీని క్లియర్ గా చూపించుకున్నా అని అనుకుంటున్నా అని రాజ్ అన్నాడు. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీకి సంబంధించిన షో కాదు.. రియాలిటీ గేమ్ షో. మా బీబీ కేఫ్ కు వచ్చిన ఒక గెస్ట్ ఏమన్నాడో తెలుసా.. ఈ 70 కెమెరాలను తప్పించుకుని భలే ఆడాడే గేము అని వెటకారంగా అన్నాడు శివ. గేమ్ అని ఒప్పుకుంటున్నాడుగా బ్రో అని రాజ్ అంటే.. శివ చప్పట్లు కొడుతూ మాట్లాడాడు.

ఏం ఆడకుండా ఉంటే సంతోషమేగా..

ఏం ఆడకుండా ఉంటే సంతోషమేగా..

ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను (ఫైమా) గెలుచుకుంది. నువ్ ఎందుకు ఆడి గెలవలేదంటున్నా అని యాంకర్ శివ అడిగాడు. నేను ఆల్రెడీ చెక్ అమౌంట్ లో రూ. 5 లక్షల మనీ వాడాను కాబట్టి ఇది వాడొద్దని నేను అనుకున్న కాబట్టి అని రాజ్ చెప్పాడు. ఆరోజు ఆ స్టెప్ తీసుకోకపోతే ఈరోజు ఇలా ఉండేవాడివి కాదు కదా అని శివ అన్నాడు. నేను సంతోషంగానే ఉన్నా బ్రో.. నేనేం రిగ్రీట్ ఫీల్ అవ్వట్లే కదా అని రాజ్ అంటే.. ఏం ఆడకుండా అన్ని వారాలు ఉంటే సంతోషంగా ఉండవా అని సెటైర్ వేశాడు శివ.

నరాలు కట్ అయ్యాయా..

నరాలు కట్ అయ్యాయా..

'ఏం లేకుండా ఏంటీ బ్రో.. ఏం మాట్లాడుతున్నావ్.. నరాలు కట్ అయి పోయాయా ఏంటి?' అని యాంకర్ శివకు షాక్ ఇచ్చాడు రాజశేఖర్. తర్వాత ఫొటో ఫ్రేమ్స్ ఇచ్చి వాళ్ల గురించి చెబుతూ బ్రేక్ చేయమన్నాడు. కొంచెం చూసి మాట్లాడితే బాగుంటుందని ఇనయా ఫొటో బ్రేక్ చేశాడు రాజ్. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పాడు రాజశేఖర్.

కుందేలు పడుకుంది కాబట్టే..

12 వారాలు ఎలా వచ్చావ్.. ఏం ఆడావ్.. ఏం చేశావని యాంకర్ శివ అడిగాడు. ఎలా రావడం ఏంటి జనాలు ఓట్లు వేశారు వచ్చా అని రాజశేఖర్ సమాధానం ఇచ్చాడు. తాబేలు, కుందేలు కథలో తాబేలు పరిగెత్తినందుకు గెలవలేదు.. కుందేలు పడుకుంది కాబట్టి గెలిచింది అని యాంకర్ శివ అన్నాడు. దీంతో నవ్వుకుంటూ తలపట్టుకున్నాడు రాజ్. యాంకర్ శివ మాత్రం నవ్వుతూ ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X