Bigg Boss Telugu 6: తను గుంటనక్క.. బిగ్ బాస్ కు ఒక విలన్ కావాలి, అది ఆమెనే..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక సెప్టెంబర్ 24 శనివారం ప్రసారమైన 20వ రోజు 21వ ఎపిసోడ్ లో ఎప్పటిలానే నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.

స్టేజ్ పైకి వచ్చిన నాగ్ అక్కడ ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ సభ్యులపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నవ్వించారు. మరోసారి కొందరికి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే.

బీబీ కేఫ్..

బీబీ కేఫ్..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుతం ఆరో సీజన్ లో ఆడుతున్న కంటెస్టెంట్ల ఆట తీరుపై గత సీజన్ లోని కంటెస్టెంట్ల అభిప్రాయాలను బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయటపెడతున్నారు. ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

నటరాజ్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

నటరాజ్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ కేఫ్ కు వచ్చే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత ఇంటి సభ్యులపై అభిప్రాయాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేఫ్ కు కొద్దిరోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఐదో (ఓటీటీ) సీజన్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ హాజరయ్యాడు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ ఒకరిని గుంటనక్కగా, బిగ్ బాస్ కు కావాల్సిన విలన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అతను జెన్యూన్ గా ఆడట్లేదు..

అతను జెన్యూన్ గా ఆడట్లేదు..

'ముసుగేసుకోని వెనుక సేఫ్ గా ఎవరు ఆడుతున్నారు' అని అరియానా గ్లోరీ అడిగిన ప్రశ్నకు.. 'శ్రీహాన్ ఇంకాస్త ముందుకు వచ్చి కొద్దిగా జెన్యూన్ గా ఆడితే బాగుంటుంది' అని నటరాజ్ మాస్టర్ సమాధానిమిచ్చాడు. దీంతో 'శ్రీహాన్ జెన్యూన్ గా ఆడట్లేదా' అని అరియానా అంటే ''చూశాను దొంగతనం'' అని నటరాజ్ మాస్టర్ అన్నాడు. దీనికి గట్టిగా 'మాస్టర్ దొంగతనం చేయకూడదా టాస్క్ లో' అన్న అరియానా గ్లోరీతో 'చేయకూడదు' అని నటరాజ్ మాస్టర్ తెలిపాడు.

ఆరోహి దిష్టి చుక్క మాత్రమే..

ఆరోహి దిష్టి చుక్క మాత్రమే..

'మరి మిగతా క్యారెక్టర్స్ ఏంటీ' అని అరియానా అడగ్గా.. 'ఆరోహి.. అసలు ఎందుకు ఈ షోలో ఒక దిష్టి చుక్కే తప్ప ఏం లేదు' అని అసహనంగా సమాధానమిచ్చాడు నటరాజ్ మాస్టర్. 'వరెస్ట్ కంటెస్టెంట్ రా నాయనా అని అనిపించింది' ఎవరు అన్న ప్రశ్నకు 'శ్రీ సత్య' అని సమాధానమిచ్చాడు నటరాజ్ మాస్టర్. తర్వాత బెస్ట్ యాక్టర్ ఎవరనే దానికి నేహా చౌదరి అంటూ నవ్వేశాడు నటరాజ్.

నేను ఉంటే ఏమైపోయేదో..

నేను ఉంటే ఏమైపోయేదో..

'డిస్ హానెస్ట్ లో ఆయన ఒక్క ఫొటోనే అభినయ పెట్టింది' అనే విషయాన్ని అరియాన ప్రస్తావించగా.. 'పక్కవాళ్లు నూరిపోస్తే అభినయ కూడా ఇన్ ఫ్లూయెన్స్ అయిందని నా డౌట్' అని చెప్పాడు నటరాజు. ఈ సీజన్ లో 'గుంటనక్క ఎవరు' అని అడిగిన ప్రశ్నకు 'గీతూ రాయల్. అసలు నేను ఉంటే ఏమైపోద్దేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. గేమ్ చూస్తుంటే హెయిర్ ఇలా లేస్తుంది. అంత కోపం వస్తుంది. బిగ్ బాస్ ఒక ఒక విలన్ కావాలి. అది తనే' అన్న నటరాజ్ మాస్టర్ ఆన్సర్ కు 'అయ్యయ్యో..' అని షాక్ అయింది అరియానా.

అనూహ్యంగా నేహా చౌదరి..

ఇక ఇదిలా ఉంటే బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో మూడో వారం ఎలిమినేషన్‌కు సిద్దమైంది. గతవారం ఇంటిలో కెప్టెన్సీ టాస్క్‌లో ఆటగాళ్ల టాలెంట్ ఓటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపడంతో కొందరు కంటెస్టెంట్ల తలరాతలు తారుమారయ్యాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆసక్తికరంగా ఊహించని విధంగా యాంకర్ నేహా చౌదరి ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X