For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: కాంట్రవర్సీ అనిపించుకోవడానికి అలా మాట్లాడకు.. యాంకర్ పై నేహా ఫైర్

    |

    బిగ్ బాల్ తెలుగు 6 రియాలిటీ షోలో మూడో వారం ఎలిమినేషన్ కింద యాంకర్ నేహా చౌదరి అనూహ్యంగా బయటకు వచ్చింది. అయితే వాసంతి, లేదా ఇనయ సుల్తానా ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలతోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల మనో భావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బీబీ కేఫ్. ఈ బిగ్ బాస్ కేఫ్ కు హాజరైన నేహా చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలతోపాటు యాంకర్ పై ఫైర్ అయింది.

    మూడో వారం మాత్రం..

    మూడో వారం మాత్రం..

    బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షో మొత్తానికి మూడో వారం పూర్తి చేసుకుంది. మొదటి రెండు వారాల సంగతి ఎలా ఉన్న ఈ మూడో వారం మాత్రం కొంత ట్రాక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున ఇచ్చిన కోటింగ్ తరువాత కంటెస్టెంట్స్ అందరూ కూడా సరిహద్దులు దాటి గట్టిగానే పోరాడుతున్నారు. ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా మరికొందరు ప్రయత్నం చేస్తున్నారు.

    పలు రకాలుగా స్పందన..

    పలు రకాలుగా స్పందన..

    అలా రెండో వారంలో బాగానే పర్ఫామ్ చేశారు కొంతమంది కంటెస్టెంట్లు. అయితే ఈ క్రమంలో మూడో వారం నేహా చౌదరి బయటకు వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్ ఇక్కడ ఏమైనా జరగొచ్చు అన్నట్లుగా నేహా చౌదరి ఎలిమినేట్ అయినట్లు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుతం ఆరో సీజన్ లో ఆడుతున్న కంటెస్టెంట్ల ఆట తీరుపై గత సీజన్ లోని కంటెస్టెంట్ల అభిప్రాయాలను బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయటపెడతున్నారు.

    హోస్ట్ గా యాంకర్ శివ..

    హోస్ట్ గా యాంకర్ శివ..

    ఈ బిగ్ బాస్ కేఫ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలతోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల మనో భావాలను బయట పెడుతున్నారు. ఈ కేఫ్ కు మొన్నటి వరకు ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ వ్యాఖ్యతగా వ్యవహరించగా తాజాగా కాంట్రవర్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ శివ హోస్ట్ గా ఉన్నాడు. అయితే ఈ బీబీ కేఫ్ కు ఎలిమినేట్ అయిన నేహా చౌదరి హాజరైంది.

    అందుకు కోసం మాత్రమే వెళ్లలేదు..

    అందుకు కోసం మాత్రమే వెళ్లలేదు..

    ఈ బిగ్ బాస్ కేఫ్ కు హాజరైన నేహా చౌదరి తోటి ఇంటిసభ్యులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాకుండా యాంకర్ గా వ్యవహరిస్తున్న శివపై ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈ ప్రోమోలో పెళ్లి సంబంధం తప్పించుకోవడానికే ఈ షోకి వెళ్లావా.. లేదా గేమ్ ఆడేందుకు వెళ్లావా ఆని యాంకర్ శివ అడగ్గా.. పెళ్లి స్కిప్ చేసేందుకని మాత్రమే బిగ్ బాస్ కు వెళ్లలేదు అని నేహా చౌదరి సమాధానం ఇచ్చింది.

    షాక్ ఇచ్చిన యాంకర్ శివ..

    షాక్ ఇచ్చిన యాంకర్ శివ..

    ఆ తర్వాత మరి నిజంగా నువ్ గేమ్ ఆడావా అన్న యాంకర్ ప్రశ్నకు 'లేదు శివ. నేను గేమ్ సరిగ్గా ఆడలేదు' అని నేహా చెప్పడంతో 'నువ్ గేమ్ సరిగ్గా ఆడలేదని మాకు కనిపించింది' అని హోస్ట్ శివ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత నువ్ మాట్లాడిన మాటలు అని శివ అంటుండగా.. లోపల మాట్లాడినవా.. ఇక్కడ మాట్లాడినవా అని నేహా అంది. దీంతో అక్కడ మాట్లాడినవి అర్థం కాలేదు, ఇక్కడ మాట్లాడినవి అర్థం కావట్లేదు అని యాంకర్ శివ అన్నాడు.

    చెప్పేసరికి 3 వారాలు పూర్తయ్యాయి..

    చెప్పేసరికి 3 వారాలు పూర్తయ్యాయి..

    దీనికి నాకు 'ఏదైనా క్రిస్పీగా చెప్పడం నాతో తొందరగా అవదు. వివరిస్తూ నా పాయింట్స్ జోడించుకుంటూ చెబుతా' అని నేహా అంటుండగా.. 'అవి చెప్పేసరికి మూడు వారాలు పూర్తయి.. ఇక్కడికి వచ్చి కూర్చున్నావ్..' అని శివ అంటాడు. దీంతో కోపం తెచ్చుకున్న నేహా.. 'కాంట్రవర్సీ అనిపించుకోవడానికి అలా మాట్లాడకు శివ.. పర్సనాలిటీనీ డిఫర్ చేయకు, నా పర్సనాలిటీ ఇది. ఇది రాంగ్ అని చెప్పకు' అని నేహా అంటుండగా.. 'దానికి దీనికి సంబంధం ఏంటీ' అని యాంకర్ శివ అంటాడు.

    కన్నీళ్లు తుడుచుకుంటూ..

    దీంతో నేహా చౌదరి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రేవంత్ గురించి మాట్లాడుతూ 'ఫెమినిస్ట్ అనేవాడు బొట్టు పెట్టుకో బావుంటుంది.. అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉండు అని చెప్పడు. నువ్ ఎలా ఉన్న రెస్పెక్ట్ చేస్తాడు' అని నేహా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 'నువ్ కాకుండా అర్హత లేని వారు హౌజ్ లో ఎవరున్నారు' అన్న ప్రశ్నకు ఆరోహి రావు, గీతూ రాయల్, వాసంతి తదితరులు ఫొటోలను చింపేస్తూ వివరణ ఇచ్చింది నేహా చౌదరి.

    English summary
    Bigg Boss Telugu 6th Season Third Week Eliminated Contestant Neha Chowdary Angry On Anchor Shiva In BB In BB Cafe Latest Promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X