Bigg Boss Telugu 6: రణ్‌బీర్, అలియ భట్ స్పెషల్ ఎంట్రీ.. మళ్ళీ తెలుగులో మాట్లాడుతూ..
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అట్టహాసంగా మొదలైంది. నాగార్జున హోస్టింగ్ తో కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రత్యేకమైన డ్యాన్సులతో పాటలతో స్పెషల్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ షోలోకి ప్రత్యేకంగా బాలీవుడ్ జంట కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. గతంలోనే ఒకసారి రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇద్దరు కూడా బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ విడుదలవుతున్న సందర్భంగా బిగ్ బాస్ లోకి వచ్చి ఆడియెన్స్ కు సినిమా గురించి తెలియజేశారు.
అయితే ఇప్పుడు మరోసారి నాగార్జున వారిని 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే తీసుకురావడం విశేషం. ఇక బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా రణ్‌బీర్ కపూర్ అలియా భట్ ఇద్దరు కూడా సినిమా గురించి ప్రత్యేకంగా తెలియజేయడమే కాకుండా వారి లవ్ గురించి కూడా వివరణ ఇచ్చారు. ఇక రణ్‌బీర్ కపూర్ ప్రత్యేకంగా తెలుగులో కూడా మాట్లాడి మెప్పించాడు. బ్రహ్మాస్త్ర సినిమా నా కెరియర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాస్త్ర సినిమాను కూడా ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. అలాగే నేను సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి తెలుగులో పూర్తిగా మాట్లాడతాను అని రణబీర్ వివరణ ఇచ్చాడు.

ఇక రణ్‌బీర్ తెలుగు భాషకు అలియా భట్ వందకు 10 మార్కులు ఇస్తాను అని తెలిపింది. కానీ అతను పెట్టిన ఎఫర్ట్ కు మాత్రం పదికి పది మార్కులు వేస్తానని తెలియజేసింది. అలాగే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేము తెలుగు భాష నేర్చుకున్నాము అని కూడా రణ్‌బీర్ చెప్పాడు. అలాగే ప్రత్యేకంగా బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ను కూడా బిగ్ బాస్ హౌస్ లో ప్రదర్శించారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ఈ సినిమాను నేను ఇంతకుముందే చూసాను అని నాగార్జున కూడా వివరణ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని కూడా తెలియజేశారు.
ఇక మొదటిసారి మీ ప్రేమ కథ ఎలా మొదలైంది అనే ప్రశ్నలు కూడా వేయడంతో మొదట రణ్‌బీర్ కపూర్ చాలా సిగ్గుపడుతూ చెప్పాడు. ముందే మేము సినిమా చూసినప్పటికీ కూడా బ్రహ్మాస్త్ర సినిమా మొదటి రోజు షూటింగ్ అప్పుడే మేము కొన్ని మాటలతో దగ్గరయ్యామని ఆ తర్వాత రోజులు గడిచిన అనంతరం ఒకరరిని ఒకరం అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు కూడా రణ్‌బీర్ కపూర్ తెలియజేశాడు.
ఇక అలియా భట్ కూడా అదే తరహాలో రణ్‌బీర్ పై తన ప్రేమను చూపించింది. అలాగే రణ్‌బీర్ కపూర్ నాగర్జునకు సంబంధించిన ప్రత్యేకమైన లవ్ స్టోరీని గురించి అడిగాడు. మీరు అమల గారిని ఎప్పుడు చూసారు మీ ప్రేమ ఎలా మొదలైంది అన్నప్పుడు శివ సినిమా షూటింగ్లో మొదటిసారి అమలను చూశాను అని ఆ తర్వాత తన గురించి తెలిసిన అనంతరం పెళ్లి చేసుకోవాలని అనిపించింది అని నాగార్జున వివరణ ఇచ్చాడు. ఇక వీరి సంభాషణ అనంతరం తప్పకుండా బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి నేను తెలుగులో కూడా తప్పకుండా మాట్లాడతాను అని రణ్‌బీర్ కపూర్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











