Bigg Boss Telugu 6: అతని గురించి అమ్మాయిల్లో ఎలాంటి టాక్ ఉందో తెలుసా? చైతు షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌజ్ లో గత నాలుగు రోజులుగా టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. గత రాత్రి ఎపిసోడ్ లో అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలుగా జరిగింది. ఫినాలే టాస్క్ లో తర్వాతి గేమ్ లో పాల్గొనేందుకు పోటీదారులను సెలెక్ట్ చేసిన శ్రీసత్య, ఇనయా, కీర్తి నిర్ణయాన్ని మేల్ కంటెస్టెంట్స్ అందరూ తప్పుపట్టారు.
ఈ క్రమంలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ల ఆట తీరుపై పై బీబీ కేఫ్ ద్వారా రివ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ కంటెస్టెంట్, ఆర్జే చైతు హాజరయ్యాడు.

హోస్ట్ గా ఆర్జే కాజల్..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి, ఆర్జే కాజల్ హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ (ఓటీటీ) సీజన్ కంటెస్టెంట్ ఆర్జే చైతు హాజరయ్యాడు. కాజల్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరకంగా సమాధానాలిచ్చాడు చైతు.

చిరంజీవి పాటకు స్టెప్పులు..
బిగ్ బాస్ అంటే పిచ్చి అందరికీ ఉంటుంది. కానీ బిగ్ బాస్ కి వెళ్లి పిచ్చెక్కించేవాళ్లు కొందరే ఉంటారు. అందులో నా ఫ్రెండ్, చాటర్ బాక్స్ చైతు ఒకడు అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే చైతుని స్వాగతించింది ఆర్జే కాజల్. బీబీ కేఫ్ కి ఆర్జే చైతు రాగానే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చిరంజీవి గాడ్ ఫాదర్ తార్ మార్ టక్కర్ మార్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ గురించి ఎగ్స్ రూపంలో చైతు పాయింట్స్ ఇవ్వాల్సిందిగా ఉంది.

శ్రీహాన్ కి 5 కోడిగుడ్లు..
శ్రీహాన్ ఆట గురించి చెప్పమని కాజల్ అడగడంతో.. శ్రీహాన్ ఆట తీరుకు 5 కోడిగుడ్లు (పాయింట్స్) ఇస్తాను. గేమ్ లో తన వంద శాతం ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అలాగే నిన్నటి ఫినాలే టాస్క్ కు సంబంధించిన అన్ని గేమ్స్ లో తన బెస్ట్ ఇచ్చాడని ఆర్జే చైతు చెప్పాడు. తర్వాత శ్రీసత్య ఫొటోను మానిటర్ లో చూపించారు. ఆమెకు సింగిల్ ఎగ్ ఇచ్చాడు చైతు అంటే ఒక పాయింట్ అన్నమాట.

పెద్ద మాట సార్..
ప్రతి కంటెస్టెంట్ గురించి ఏదో ఒక మాట చెప్పొచ్చు. కానీ శ్రీసత్య విషయానికొస్తే గనుక అబ్బా.. శ్రీసత్య ఇది అని చెప్పడానికి ఏం లేదు. నిజానికి చెప్పాలంటే శ్రీసత్య జనాల్లో మానిప్యులేటివ్, కన్నింగ్ అని మార్క్ చేసుకుందని చెప్పొచ్చు తప్పా ఇంకేం లేదు అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు ఆర్జే చైతు. దీంతో ఆశ్చర్యపోయిన ఆర్జే కాజల్ పెద్ద మాట సార్ అని అంది. తర్వాత ప్రోజెక్టర్ లో రోహిత్ ఫొటో వేశారు.

హద్దుల్లో ఉంటాడు.. హస్బండ్ మెటేరియల్..
రోహిత్ కు ఆర్జే చైతు నాలుగు పాయింట్స్ ఇచ్చాడు. రోహిత్ స్పోర్టివ్ స్పిరిట్ చాలా బాగుంటుంది. అర్థం చేసుకునే మెంటాలిటీ బాగుంటుంది. రోహిత్ గురించి అమ్మాయిల్లో బయట టాక్ ఏంటో తెలుసా.. హద్దుల్లో ఉంటాడు హస్బండ్ మెటేరియల్ అని చెప్పేసి అని ఆర్జే చైతు అన్నాడు. ఇనయా గేమ్ కు కూడా 4 పాయింట్స్ ఇచ్చాడు ఆర్జే చైతు. ఫైర్ కొంచెం తగ్గింది కాబట్టి.. గేమ్ ఎక్కడో తగ్గిందనిపించిందని చెప్పాడు ఆర్జే చైతు.
నువ్ రేవంత్ సైడా..
చైతు నువ్ లాస్ట్ టైమ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 6లో గేమ్ లో ఎంతవరకు మార్పు వచ్చిందని ఆర్జే కాజల్ అడగ్గా.. మొదటి రోజు నుంచి వన్ సైడ్ ఉండే, రేవంత్ సైడే ఉండేది గేమ్. రేవంత్ కు వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తారా అని ఎదురుచూశాను. కానీ అలా జరగకపోవడంతే గేమ్ అంతా రేవంత్ సైడే ఉందని ఆర్జే చైతు చెప్పాడు. దీనికి గేమ్ రేవంత్ సైడ్ ఉందా.. నువ్ రేవంత్ సైడ్ ఉన్నావా అని కాజల్ కౌంటర్ వేసింది. దీంతో చైతు సీరియస్ గా అలా చూస్తూ ఉండిపోయాడు.


Click it and Unblock the Notifications











