Don't Miss!
- News
Lady: భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రియుడికి రసగుల్లా ఇచ్చింది, ప్రియురాలి కూతుర్ని ఏం చేశాడంటే ?
- Sports
Joginder Sharma: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్ హీరో!
- Lifestyle
మీ తలలో మొటిమలు ఉన్నాయా?మొటిమలు దురుదపెడుతున్నాయా? వాటికి కారణాలు, నివారణ ఇక్కడ తెలుసుకోండి!
- Finance
Vidya Deevena: విద్యార్థుల ఆశలకు 'విద్యా దీవెన' రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Winner పై బెట్టింగ్, ఆయన గెలిచాక పండగ చేసుకుందాం.. రోల్ రైడా హింట్?
షాకింగ్ ట్విస్ట్ లతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు 6 సీజన్. 14వ వారం పూర్తి చేసుకుని 15వ వారాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. 14వ వారం ఇనయా సుల్తానా ఎలిమినేట్ కాగా 15వ వారంలో మిడ్ వీకి ఎలిమినేషన్ లో భాగంగా బుధవారం మరొకరిని హౌజ్ నుంచి బయటకు పంపనున్నారు. గత రాత్రి జరిగిన 99వ రోజు 100వ ఎపిసోడ్ లో సింగర్ రేవంత్, శ్రీసత్య బిగ్ బాస్ జర్నీని ఎమోషనల్ గా చూపించారు. ఇదిలా ఉంటే తాజాగా బీబీ కేఫ్ కు ప్రముఖ ర్యాప్ సింగర్ రోల్ రైడా హాజరయ్యాడు. అతన్ని క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఇంటర్వ్యూ చేసింది.

హాజరైన రోల్ రైడా..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు టాలీవుడ్ ప్రముఖ ర్యాప్ సింగర్, బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ కంటెస్టెంట్ రోల్ రైడా హాజరై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మంచి ర్యాప్ తో అలరించిన రైడా..
రోల్ రైడాకు గట్టిగా అరుస్తూ స్వాగతం పలికింది బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి. తర్వాత ఒక మంచి ర్యాప్ తో అదరగొట్టాడు రోల్ రైడా. ఫైనల్ వీక్.. ఫినాలే వీక్.. బయట ఆడియెన్స్ పల్స్ ఎలా ఉంది.. ఏమనుకుంటున్నారు అని అరియానా గ్లోరి అడగ్గా.. బెట్టింగ్ పెడుతున్నారు.. మావోడు గెలిస్తే నీకు మిక్సర్ ఇస్తా.. వీడు గెలిస్తే ఫ్రిజ్ ఇస్తా.. ఇట్ల ఉన్నది అని రోల్ రైడా చెబుతుంటే ఆశ్చర్యపోయింది అరియానా గ్లోరి.

100 రోజుల పండుగ..
ఫినాలే వీక్.. టాప్ 6 అంటే.. ఈ 6 అనేది కొత్తగా ఉంది. ఇప్పటివరుకు ఉన్న సీజన్ లో ఎప్పుడూ టాప్ 5యే. అంటే సీజన్ 6 అని ఆరుగురిని పెట్టారా అని అనుమానంగా అడిగాడు రోల్ రైడా. దీంతో ఇద్దరు హైవ్ ఫైవ్ ఇచ్చుకున్నారు. బిగ్ బాస్ 100 రోజుల పండుగ. సో చూద్దాం. ఎవరు విన్నరో. ఆయనతో పండుగ చేసుకుందాం అని రోల్ రైడా అంటే.. ఆయనా.. అని యాంకర్ అరియానా గ్లోరి అనుమానంగా అడిగింది.

రేవంత్ కి సపోర్ట్ చేస్తూ..
అరియానా గ్లోరి అలా అడగడంతో ఆయన అంటే నిజానికి బిగ్ బాస్ తో అని రోల్ రైడా చెప్పాడు. దీనికి కవరింగ్ ఆ అని అరియాన అంటే రోల్ రైడా నవ్వేశాడు. రోల్ రైడా ఆయన అన్నది సింగర్ రేవంత్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు ఫ్యామిలీ వీక్ తర్వాత రేవంత్ ను సపోర్ట్ చేసేందుకు రోల్ రైడా బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చిన విషయం తెలిసిందే. రోల్ రైడాతో పాటు రేవంత్ బ్రదర్ కూడా వచ్చారు.

ఎవరు ఎలిమినేట్ అవుతారు..
ఇదిలా ఉంటే ఎవరైనా సూట్ కేస్ పట్టుకుని వస్తారా అని అరియానా గ్లోరి అడిగింది. దానికి చాలా సేపు రోల్ రైడా ఆలోచిస్తుంటే అరియానా షాకింగ్ గా చూసింది. అయితే అతను చెప్పిన దాన్ని ప్రోమోలో ఇవ్వలేదు. ఫినాలే వీక్ లో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. మీ గెస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు అని అడగ్గా.. నాకు అనిపించి.. అంటూ రోల్ రైడా అంటే అరియానా గ్లోరి ఓ.. అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.