For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఆ జంటకు 'బిగ్' బాస్ 'షాక్'.. ఇకనుంచి సింగిల్ గా.. ఇది కప్పు కాఫీ కాదు

  |

  తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. సీజన్.. సీజన్ కు కొత్త వేరియేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది బిగ్ బాస్ తెలుగు. ఇందులో భాగంగానే భారీ అంచనాల అంచనాల నడుమ సెప్టెంబర్ 4న బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌ను నిర్వహకులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నామినేషన్లు, టాస్కులు, ఎలిమినేషన్లతోపాటు సీజన్ మొత్తం కెప్టెన్సీ బ్యాన్ చేయడం వంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అందులోని ఆసక్తికర విషయాలు ఓసారి చూద్దాం.

  ప్రవర్తన తీరుపై రివ్యూలు..

  ప్రవర్తన తీరుపై రివ్యూలు..

  రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇక ప్రతి శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇంటి సభ్యుల ఆట తీరు, మాట తీరు, ప్రవర్తన తీరుపై రివ్యూలు చేస్తూ రేటింగ్ ఇస్తున్నాడు.

  గట్టిగానే వార్నింగ్..

  గట్టిగానే వార్నింగ్..

  గతంలో కంటే ఈసారి బిగ్ బాస్ హౌజ్ కంటెస్టెంట్లకు గట్టిగానే వార్నింగ్ లు ఇస్తున్నాడు. ఇంటి సభ్యులను నేరుగా నామినేట్ చేయడంతో పాటు సీజన్ మొత్తం కెప్టెన్సీకి అనర్హత వేటు వేయడం వంటి చాలా షాకింగ్ డెసిషియన్స్ తీసుకున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇంతకుముందు కంటే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్లకు బేడీలు వేసి ఉంచి వారిలో నామినేట్ కాకుండా ఉండటానికి గల అర్హతలు చెప్పాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

  ఇద్దరిని ఎంపిక చేసి..

  ఇద్దరిని ఎంపిక చేసి..

  ఇంతకుముందులా నామినేషన్లలో ఫైటింగ్ లు గొడవలు లేకుండా బిగ్ బాసే ఇద్దరిని ఎంపిక చేసి వారిలో ఒకరిని నామినేట్ అవ్వాల్సిందిగా చెప్పాడు. అయితే ఎవరు నామినేట్ అవుతారో వారిద్దరే వాదించుకోవాలి. ఈ క్రమంలో ఇంటిలోకి జంటగా, ఇద్దరు ఒక్కరిగా ఆడుతున్న మెరీనా-రోహిత్ లు ఇక నుంచి జోడిగా కాకుండా విడివిడిగా సింగిల్ గా ఆడతారని చెప్పి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

  మెరీనా-రోహిత్ లలో ఎవరినో ఒకరిని..

  మెరీనా-రోహిత్ లలో ఎవరినో ఒకరిని..

  మెరీనా-రోహిత్ లలో ఎవరినో ఒకరిని నామినేట్ అవ్వమని అడిగాడు. వారిద్దరిలో మెరీనా నామినేట్ అయినట్లు తెలుస్తోంది. తాను ఉన్న లేకున్నా భర్తను బాగా ఆడమని చెప్పి మెరీనా నామినేట్ అయినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ఇక సుదీప-వాసంతి ఇద్దరూ కొద్దిసేపు వాదించుకున్నారు. తాను టెన్షన్ జోన్లకు వెళ్లనని, అందుకే నామినేట్ అవ్వనని చెప్పింది. తనకు ఒక్క అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని వాసంతి చెప్పగా.. ఇదేం ఒక కప్పు కాఫీ కాదు అడిగితే ఇచ్చేయడానికి అని సుదీప ఆన్సర్ ఇస్తుంది. దీంతో కోపంగా వాసంతి వెళ్లిపోయింది.

   నీకు చాలా హెల్ప్ చేశాను కదా..

  నీకు చాలా హెల్ప్ చేశాను కదా..

  ఇక అర్జున్ కల్యాణ్-శ్రీ సత్య మధ్య మంచి ఆసక్తికర వాదన జరిగింది. గత వారం నీకు చాలా హెల్ప్ చేశాను కదా అని అర్జున్ అంటే.. దానికి నువ్ ఫ్రీగా ఏం చేయలేదు కదా సర్వీస్ చేయించుకున్నావ్ కదా అంటూ చెప్పింది. నువ్ నామినేషన్లలో ఉంటే కచ్చితంగా సేవ్ అవుతావ్ అని నమ్ముతున్నా అని అర్జున్ కల్యాణ్ అన్న మాటలకు.. నువ్ నా మీద పెట్టుకోవడం కంటే నీ మీద నమ్మకం పెట్టుకో అని చెబుతున్నా అని శ్రీసత్య అంది.

   ఎప్పటిలానే రసవత్తరంగా

  ఎప్పటిలానే రసవత్తరంగా

  తర్వాత వచ్చిన ఇనయా సుల్తానా-శ్రీహాన్ మధ్య ఎప్పటిలానే రసవత్తరంగా మాటలు జరిగాయి. నేను అన్నిట్లో హండ్రెడ్ పర్సంట్ ఇస్తున్నాను.. నేనైతే అస్సలు నామినేట్ అవ్వాలనుకోవట్లేదు అని ఇనయా అంటే.. పనులు చేస్తున్నావ్, గేమ్ ఆడుతున్నావ్.. మరి ఎంటర్ టైన్ మెంట్ ఏమైనా చేస్తున్నావా అని తిరిగి ప్రశ్నిస్తాడు శ్రీహాన్. దీనికి బిగ్ బాస్ అంటే ఎంటర్ టైన్మెంట్ ఒక్కటే కాదు అన్నింట్లో ఉండాలి అని ఇనయ అంటుంది.

  ఎంటర్ టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్..

  ఎంటర్ టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్..

  దీనికి బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్ టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అని ఇనయా సుల్తానాను మాట్లాడకుండా చేస్తాడు శ్రీహాన్. ఫైనల్ గా అడుగుతున్న నామినేట్ అవుతున్నావా అని ఇనయా అడిగితే శ్రీహాన్ అస్సలు అవ్వను అంటాడు. దీంతో బిగ్ బాస్ కనీసం ఫ్రెండ్స్ తో పెట్టిన బాగుండేది అని ఇనయా అంటే నువ్ నా ఫ్రెండే అని శ్రీహాన్ అంటాడు. ఫ్రెండ్ అయితే కెప్టెన్సీకి అర్హత లేదని అంతా ఈజీగా చెప్పరు అని అంటుంది ఇనయా.

  మొత్తం 8 మంది నామినేట్ అయినట్లు..

  అప్పుడు కాదు ఇప్పుడు అని శ్రీహాన్ అన్న మాటతో.. ఇప్పుడు ఇచ్చేయాలి కాబట్టి ఫ్రెండ్ అంటున్నావ్.. వావ్.. గ్రేట్ యాక్టర్ అని ఇనయా అంటే థ్యాంక్యూ అని శ్రీహాన్ వెటకారంగా అన్నాడు. దీంతో నేనే నామినేట్ అవుతున్నా.. ఇక్కడే ఉంటాను.. టైటిల్ కొట్టుకునే వెళతాను.. నేను నీకన్న డిజర్వ్ అని చాలా కాన్పిడెంట్ గా నామినేట్ అవుతుంది ఇనయా సుల్తానా. ఇక ఈ ఐదో వారం మొత్తం 8 మంది నామినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

  English summary
  Bigg Boss Telugu 6 Fifth Week Nominations In House. And October 3rd 2022 Episode Promo Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X