Bigg Boss Telugu 6: ఇద్దరి అమ్మాయిల ముందు శ్రీహన్ నవ్వులపాలు.. ఆపుకోలేకపోతున్నా అంటూ
ఈసారి కంటెస్టెంట్లలో కొందరు చాలా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక అందులో శ్రీహన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. ఇతను బిగ్ బాస్ లోకి మూడవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. చిల్ బ్రో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన శ్రీహాన్ నవ్వుతూ మాట్లాడాడు.
జూనియర్ నానిగా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక అతను అదిరిపోయే డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు.
శ్రీహన్ మాట్లాడుతూ.. ఇదే వేదికపై మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకోవడం ఆనందంగా ఉంది అంటూ శ్రీహన్ నాగార్జునకు వివరించాడు. ఇక సిరి కూడా చాలా బాగుంది అంటూ సిగ్గుపడుతూ చెప్పాడు. సిరిని వదిలేసి వంద రోజులు ఇందులో ఉండగలవా అని నాగార్జున అడిగితే.. ఉండగలను సార్ అంటూ.. ఎక్కడికి వెళ్ళినా చాలా తొందరగా వచ్చేయమని సిరి చెప్పేది.. కానీ ఇప్పుడు మాత్రం తొందరగా రావద్దు అని చెప్పి పంపించింది అని అన్నాడు.

నా జీవితంలో జరిగిన తప్పులు నేను ఇక్కడ జరగకుండా ఎంత స్ట్రాంగ్ గా అయ్యాను అనేది చూపించాలి అని అనుకుంటున్నాను. సిరి ఏదైతే కోల్పోయిందో ఇక్కడ నేను అది ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను. అలాగే సిరి ఎన్ని అడ్వైస్లు ఇచ్చినా కూడా నేను పట్టించుకోలేదు అని శ్రీహన్ అన్నాడు. ఇక సిరి కోసం ప్రత్యేకంగా ఒక సాంగ్ పాడమని నాగార్జున చెప్పగా సీతారామంలోని ఇంతందం అనే పాటను ప్రత్యేకంగా పాడాడు. ఇక ఈసారి ఇన్ట్యూషన్ అనే ఒక గేమ్ ద్వారా ఒక కార్డు తీసుకోవాలి అని నాగర్జున చెప్పాడు. అంతర దృష్టి ఇందులో ఉంటుంది అని కూడా అన్నాడు.
ఇక నాగ్ చెప్పినట్లు శ్రీహన్ ఒక కార్డు తీసుకోగా గుంటనక్క వస్తుంది. ఇక ఈ కార్డు ఏంటి అనేది హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని అప్పటివరకు మీ దగ్గర పెట్టుకోవాలి అని నాగార్జున చెప్పి లోపలికి పంపించాడు. ఇక శ్రీహన్ వచ్చి రాగానే పరుగు పరుగున బాత్రూం లోకి వెళ్ళాడు. అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది అని వెళ్ళాడు. అయితే లోపల అమ్మాయిలు ఇద్దరు కీర్తి, సుదీప అతన్ని పలకరించాలని అనుకుంటారు. కానీ వారిని పట్టించుకోకుండా శ్రీహాన్ బాత్రూంలోకి వెళ్లడంతో వాళ్ళిద్దరూ కూడా నవ్వుతారు. ఇక తర్వాత బయటకు వచ్చిన శ్రీహన్ గంట నుంచి ఆపుకుంటున్నాను అని నవ్వుతూ చెబుతాడు. ఈ సంభాషణ మొత్తం చాలా కామెడీగా జరగడంతో శ్రీహన్ కొంత సిగ్గుపడ్డాడు. మరి వీరి నవ్వులు ఎన్ని రోజులు కొనసాగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











