Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్.. వీడియోతో షాక్ ఇచ్చిన యాంకర్!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో మొదటి నుంచే ఎలిమినేషన్స్ షాకింగ్ గా మారాయి. టైటిల్ ఫెవరెట్ గా నిలిచినవాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇక ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బ్యూటిఫుల్ శ్రీసత్య ఎలిమినేట్ అయింది. దీంతో హౌజ్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. శ్రీసత్య ఎలిమినేషన్ తో శ్రీహాన్, రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా బీబీ కేఫ్ కు హాజరైన శ్రీసత్యను యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నాకు తెలీకుండానే మారిపోయా..
ఎలా ఉంది ఈ 15 వారాల ప్రయాణం అని యాంకర్ శివ అడిగాడు. నాలాంటి ఒక అమ్మాయికి అయితే అది ఒక డిఫరెంట్ ప్రపంచం. బయట నా మైండ్ సెట్ వేరేలా ఉండింది. అదే మైండ్ సెట్ పెట్టుకుని హౌజ్ లోకి వెళ్లాను. కానీ, నాకు తెలీకుండానే నేను మారిపోయా అని శ్రీసత్య తెలిపింది. నీ కెప్టెన్సీ.. గుడ్ కెప్టెన్సీ చేశానని అనుకుంటున్నావా శివ అడిగితే అవును అని సమాధానం ఇచ్చింది శ్రీసత్య.

ఫ్లిప్పింగ్ ల గురించి నువ్ మాట్లాడుతున్నావా..
శ్రీసత్య ఇచ్చిన సమాధానానికి మరి ఇనయా ఎందుకు బెస్ట్ కెప్టెన్ అయిందని యాంకర్ శివ అడిగాడు. ఇక్కడ కొద్దిసేపు సస్పెన్స్ మ్యూజిక్ రన్ చేశారు. తర్వాత శ్రీహాన్ ఈ మధ్య మారిపోయాడని చెప్పి అని శివ అంటే.. నువ్ చేంజ్ అవ్వు కాదనట్లేదు.. కానీ, సడెన్ గా ఫ్లిప్ అయ్యావ్ అని శ్రీసత్య అంది. దీనికి ఫ్లిప్పింగ్ ల గురించి నువ్ మాట్లాడుతున్నావా సత్య అని శ్రీసత్యకు యాంకర్ శివ పంచ్ వేశాడు.

ప్లేట్ తీసి ఇలా విసిరేసావ్..
ఫ్లిప్పింగ్.. నేనేప్పుడు ఫ్లిప్ అయ్యా అని శ్రీసత్య అనుమానంగా అడిగితే.. గెలుపును తీసుకుంటున్నావ్.. ఓటమిని తీసుకోవా అని రేవంత్ తో అన్నావ్.. ఇదే శ్రీసత్య ప్లేట్ తీసి ఇలా విసిరేసావ్ కిచెన్ దగ్గర అని యాంకర్ శివ చెప్పాడు. దీనికి నేను ఫుడ్ మీద చూపించలేదు. జస్ట్ ఇలా ప్లేట్ ఇసిరా అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. దానికి అందులో ఫుడ్ ఉంది కదా అని యాంకర్ శివ అన్నాడు. ఇలా ఈ టాపిక్ పై కొద్దిసేపు వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్లు చూపించారు.

వీళ్లిద్దరితో కొంచెం క్లోజ్..
ఇనయా విషయంలో శ్రీహాన్, నువ్వు చాలాసేపు ఒక డ్రామా చేశారుగా. అది ఎంతవరకు కరెక్ట్ అని యాంకర్ శివ ప్రశ్నించాడు. తెలుసు, బాగా రెచ్చగొట్టేశాం అని శ్రీసత్య అంటే రెచ్చగొట్టడమనే కాదు.. పర్సనల్ కూడా అయిపోయారని అనిపించిందని యాంకర్ శివ తెలిపాడు. హౌజ్ లో నీకు రేవంత్, శ్రీహాన్ తప్పా మిగతా వాళ్లు ఎవరు అని శివ అంటుంటే.. అందరితో మాట్లాడా.. కానీ వీళ్లిద్దరితో కొంచెం క్లోజ్ అని శ్రీసత్య చెప్పింది.

బ్యాక్ సైడ్ చెప్పేది ఫ్రెండ్షిప్ కాదు..
కావాలనే ఫ్రెండ్స్ అయినట్లు అనిపించింది. మీ గ్రూప్ లో వాళ్లే కొట్టుకుంటారు.. వాళ్లకు వాళ్లే స్టాండ్ తీసుకోరు అని యాంకర్ శివ అంటే.. ఫ్రెండ్స్ అంటే కొట్టుకోవడమే.. ఫ్రెండ్స్ అంటే ప్రతీసారి ముస్తఫా.. ముస్తఫా కాదు కదా అని శ్రీసత్య అంది. దీనికి ముస్తఫా ముస్తఫా అవసరం లేదు. మీ తప్పులు పక్కకు వెళ్లి బ్యాక్ సైడ్ చెప్పేది ఫ్రెండ్షిప్ కాదు అని యాంకర్ శివ అన్నాడు. దీంతో శ్రీసత్య షాక్ అయి అలా చూస్తూ ఉండింది.
ట్రయాంగిల్ లవ్ స్టోరి గురించి..
అర్జున్ కల్యాణ్ పై నీ ఒపినీయన్ ఏంటీ అని శివ అడిగితే.. గుడ్ డీసెంట్ బాయ్ అని శ్రీసత్య చెప్పింది. అర్జున్ కల్యాణ్ కు నీపైన ఏం ఒపినీయన్ ఉండి ఉంటుందని అనుకుంటున్నావ్ అని మరో ప్రశ్న వేశాడు శివ. ఇష్టము.. లవ్వు.. అని శ్రీసత్య అంటే.. వీడియో ప్లీజ్ అని చాలా జోష్ గా అన్నాడు యాంకర్ శివ. ఆ వీడియోలో వాసంతి కృష్ణన్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరితో కంటెంట్ క్రియేట్ అయ్యేదని అర్జున్ కల్యాణ్ చెప్పడం ఉంది. అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు యాంకర్ శివ.