Bigg Boss Telugu 6 Week 3rd Voting అందాల భామలపై ఎలిమినేషన్ కత్తి.. ఆ ముగ్గురు ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ మూడో వారం ఆసక్తిగా కొనసాగుతున్నది. ఈ వారం ఇంట్రెస్టింగ్ గేమ్‌తోపాటు వాడివేడిగా నామినేషన్లు జరిగాయి. అయితే గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ల ప్రక్రియ తీవ్ర గందరగోళాల మధ్య జరిగింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ కత్తి ఎవరిపై వేలాడుతున్నదంటే..

డబుల్ ఎలిమినేషన్‌తో
బిగ్‌బాస్ తెలుగు 6లో రెండోవారం కంటెస్టెంట్లకు ఊహించని ట్విస్ట్ బిగ్‌బాస్ ఇచ్చారు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలివారం నామినేషన్ లేకుండానే ముగించిన బిగ్‌బాస్.. రెండో వారం ఇంటి నుంచి ఇద్దరిని బయటకు పంపించారు. షానీ సల్మాన్, అభినయశ్రీ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే.

నామినేట్ అయిన వారి జాబితా
రెండోవారాంతంలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులందరికి క్లాస్ పీకడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. నామినేషన్ ప్రక్రియను వేడివేడిగా ముగించారు. ఒకరిపై మరొకరు ఇంటి సభ్యులు ఆరోపణలు చేసుకొన్నారు. వాడివేడి వాదనల మధ్య నామినేషన్ ప్రక్రియను ముగించారు. బిగ్‌బాస్ ఇంటిలో మూడో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యులు తొమ్మిది మందిని ఫైనల్ చేశారు. నామినేషన్ జాబితాలో ఉన్నవారిలో వసంతి, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి రావు, నేహా చౌదరీ, ఇనయ సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ ఉన్నారు.

ఓటింగ్‌పై కెప్టెన్సీ టాస్క్ ఆట ప్రభావం
అయితే బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్‌లో మూడో వారం ఓటింగ్‌లో ఊగిసలాట కనిపించింది. ఇంటిలో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా జరిగిన అడవిలో ఆట ఆసక్తికరంగా జరిగింది. గార్డెన్ ఏరియాను అడవిగా మార్చేశారు. కొందరు ఇంటి సభ్యులు పోలీసులుగా, కొందరు ఇంటి సభ్యులు దొంగలుగా, ఒకరు అత్యాశ పరురాలైన వ్యాపారస్తులుగా నటించాలని చెప్పాడు.

ఎపిసోడ్‌కు ఎపిసోడ్‌కు మారుతున్న ఓటింగ్
పోలీసులుగా ఆదిరెడ్డి, ఫైమా, శ్రీ సత్య, ఇనయ, చంటీ, ఆదిత్య, రోహిత్ జట్టుగా ఏర్పడ్డారు. పోలీసుల నాయకుడిగా ఆదిరెడ్డి వ్యవహరించాడు. దొంగల జట్టుగా రేవంత్, అరోహి, సుదీప, వాసంతి, శ్రీహాన్, ఆర్జే సూర్య, అర్జున్ ఏర్పడ్డారు. దొంగల నాయకుడిగా సూర్య వ్యవహరించారు. అత్యాశపరురాలైన వ్యాపారిగా గీతూ రాయల్ నటించింది. అయితే ఈ గేమ్‌లో ఆటగాళ్లు చూపిన ప్రతిభ కారణంగా ఓటింగ్ ప్రభావితమైంది. ఎపిసోడ్ ఎపిసోడ్‌కు ఓటింగ్ మారుతూ వచ్చింది.

మూడో వారం టాప్ ఓటింగ్ ఎవరికంటే?
మూడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్‌లో రేవంత్.. 30 శాతం ఓట్లతో టాప్ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత శ్రీహాన్ 20 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో గీతూ రాయల్ , బాలదిత్య 9 శాతం, చంటి 7 శాతం ఓట్లు సాధించారు.

డేంజర్ జోన్‌లో ముగ్గురు భామలు
అయితే మూడో వారం డేంజర్ జోన్‌లో వాసంతి కృష్ణన్, అరోహి రావు, నేహా చౌదరీ ఉన్నారు. వాసంతి, అరోహి, నేహా 5 శాతం ఓట్లతో ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరు ఇంటి నుంచి వెళ్లడం ఖాయమనే విషయం ఓటింగ్ ద్వారా స్పష్టమవుతున్నది. ఈ ఎలిమినేషన్‌కు మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారనున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











