Sivaji: ఆ పార్టీలోకి వెళ్తా. అందరి దూల తీర్చేస్తా...బిగ్ బాస్ శివాజీ సంచలన వ్యాఖ్యలు

హీరో శివాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మెప్పించారు. అయితే ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7లో మెరిశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన బిగ్ బాస్ ఇటీవల #90S మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీసులో నటించారు. ఇక ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే #90S మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీసు మేకర్స్... సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న శివాజీ.. కీలక కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శివాజీ.. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7లో మెరిశారు. ఇక ఆయన మైండ్ గేమ్ తో బిగ్ బాస్ హౌల్ అందరితో ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హీస్టరీలోనే ఆయనకు చాణక్య అంటూ ఓ బిరుదు కూడా లభించింది. అయితే ఈ సారి విన్నర్ కావాల్సిన శివాజీ బిగ్ బాస్ తెలుగు 7 లో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలువగా.. అమర్ దీప్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Bigg Boss Telugu 7 Contestant Sivaji Sensational Comments on Politics

ఇక శివాజీ ఇటీవల #90S మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరిస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ఆ సిరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత శివాజీకి మంచి సక్సెస్ వచ్చింది. ఈటీవీ విన్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సీరిసుకు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ జరుపుకుంది సిరీస్ బృందం. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న శివాజీ కీలక కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో శివాజీ మాట్లాడుతూ... నేను సమైఖ్య వాది కాదు.. నేను ప్రత్యేక హోదా గురించి పోరాడాను తప్ప... సమైఖ్య వాదం గురించి కాదు.. 60 సంవత్సరాల తెలంగాణ కల.. అది సాకారం అయింది ఓవర్. రెండు రాష్ట్రాలు.. ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారు.. అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా.. డైరెక్టుగా పాలిటిక్స్ లో ఎప్పుడు పాల్గొనలేదు. నాకు సంబంధం లేదు. నాకు రాజకీయాల కన్నా.. నా పిల్లల కోరిక ప్రకారం యాక్టింగ్ బిజీలో ఉన్నానని వెల్లడించారు.

Bigg Boss Telugu 7 Contestant Sivaji Sensational Comments on Politics

శివాజీ మాట్లాడుతూ... ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ప్రజలకు అండగా ఉంటాను. నన్ను కావాలని మాత్రం ఓ పార్టీకి అంటగట్టొద్దు.. ఒకవేళ అంటగట్టాలి అనుకుంటే.. ఆ పార్టీలోకి కచ్చితంగా వెళ్తాను.. అందరి దూల తీర్చేస్తాను. నా జోలికి రావొద్దు.. నేను నిజాలు మాట్లాడుతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే.. అటువంటి వాడు రాజకీయాల్లోకి పనికిరాడు.. నేను రాజకీయాలకు పనికి రాను. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను.. దయచేసి ఫలానా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డికో, కేసీఆర్ కో.. నాకేం సంబంధం లేదు.. నేను ప్రజల సమస్య గురించే మాట్లాడుతా.. గుర్తించకపోయినా నాకేం నష్టం లేదు. శివాజీ.. శివన్న.. ప్రజల గొంతుక.. అంటూ చెప్పుకువచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X