"బిగ్‌బాస్ 8" కొత్త చరిత్ర .. ఫినాలే ఎపిసోడ్‌కి కళ్లు చెదిరే వ్యూస్, ఐపీఎల్‌కే చెమటలు పట్టించేలా
ప్రస్తుతం ఉన్న తరంలో జనం ఎంటర్టైన్మెంట్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా చాలా మంది తమ పనులు అయ్యాక లేదా చేస్తూనో కూడా తమ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు లేదా ఓటిటి లపై ఆధారపడుతున్నారు. అయితే ఒకో సమయంలో ఒకో షో మంచి ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాయి. ఇలా వరల్డ్ వైడ్ గా టెలివిజన్ దగ్గర ఓ షో హిట్ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
మరి ఇలా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయ్యిన ఒకే ఒక్క రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పొచ్చు. మిడ్ రేంజ్ లేదా మినిమమ్ ఫేమ్ ఉన్న ప్రముఖ ఆర్టిస్ట్ లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో నడిచే ఈ గ్రాండ్ షో మన దేశంలో కూడా పెద్ద హిట్ అయ్యింది. తొలుత హిందీలోనే స్టార్ట్ అయ్యిన ఈ షో ఇపుడు తెలుగు సహా తమిళ , కన్నడ, మలయాళ భాషల్లో ఓ పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సాగుతుంది.

అయితే హిందీలో ఎన్నో ఏళ్ళు కితం నుంచి ఈ షో సాగుతుండగా అక్కడ ఏకంగా 18 సీజన్లను జరుపుకుంది. ఇక ఇదే క్రమంలో మన తెలుగులో ఎప్పుడైతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసారో అక్కడ నుంచే కొత్త ఇంట్రెస్ట్ ఆడియెన్స్ లో మొదలయ్యింది. ఇక్కడ బిగ్ హిట్ అయ్యిన ఈ గ్రాండ్ షో ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. ఇండియాలోనే టాప్ రేటింగ్ సాధించిన షోగా తెలుగు వెర్షన్ నిలిచింది.
దీనితో మన తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇండియా మొత్తం చూసారు. ఇలా రీసెంట్ గానే ఎనిమిదో సీజన్ ని పూర్తి చేసుకుంది బిగ్‌బాస్. ఈ ఎనిమిదో సీజన్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ ఇపుడు వచ్చినట్టుగా తెలుస్తుంది. మాములుగా బిగ్ బాస్ షోకి కర్టెన్ రైజర్ ఎపిసోడ్ అంటే సీజన్లో మొదటి ఎపిసోడ్ రేటింగ్, అలాగే మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్ ని రివీల్ చేస్తారు.
కానీ ఈసారి కొంచెం ట్రెండ్ మారడంతో కేవలం టీవీ లోనే కాకుండా ఓటిటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ ని తీసుకొచ్చారు. ఇలా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంచలన రికార్డు నమోదు అయ్యినట్టుగా లేటెస్ట్ గా స్టార్ మా అండ్ హాట్ స్టార్ ప్రకటించింది. దీని ప్రకారం బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని హాట్ స్టార్ ఓటీటీలో ఏకంగా 2 కోట్లకి మందికి పైగా ఎక్స్ క్లూజివ్ గా వీక్షించారట.
దీనితో ఇది ఒక ఐపీఎల్ మ్యాచ్ కి దాదాపుగా సమానం అని చెప్పవచ్చు. అలాగే ఇందులోనే 2 బిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ కూడా నమోదు అయ్యినట్టుగా రివీల్ చేశారు. మరి ఇదంతా ఆ ఒక్క ఎపిసోడ్ కే కావడం అనేది గమనార్హం. దీనితో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఒక సరికొత్త హిస్టరీనే సెట్ చేసింది అని చెప్పి తీరాలి.


Click it and Unblock the Notifications











