OTTలో దుమ్మురేపుతున్న కామెడీ ఎమోషనల్ డ్రామా.. 120000000 వ్యూస్‌తో టాప్ రేటింగ్‌లో!

ప్రేక్షకుల కోసం ఓటీటీ సంస్థలు ఎన్నో కొత్త కంటెంట్ ను తీసుకువస్తున్నాయి. ఇక వారి అభిరుచికి తగ్గట్లుగానే థ్రిల్లర్, కామెడీ, ఎమోషనల్ సిరీసులు, సినిమాలు డైరెక్టుగా రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఓ కామెడీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ అయింది. హీరో శివాజీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. బిగ్ బాస్ తెలుగు 7లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల నటించిన వెబ్ సిరీస్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతుంది. అంతే కాదు ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ సాధించుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఓటీటీలో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు... ఓటీటీలోనూ సినిమాలను, సిరీసులను ఆదరిస్తున్నారు. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాయి. చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా వెబ్ సిరీస్ లకే ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ తో మంచి పేరుతెచ్చుకున్న హీరో శివాజీ.. ఇటీవల ఓ కామెడీ ఎమోషనల్ డ్రామా సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Bigg Boss Telugu Contestant Sivaji 90s Middle Class Biopic Web Series Top Trending in ETV Win OTT Full Details Here

హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో హీరో శివాజీ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సిరీస్.. విడుదల అయిన మొదటి రోజు నుంచే మంచి ఆధరణ సొంతం చేసుకుంది. దీనికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. హ్యాష్ ట్యాగ్ 90 మిడిల్ క్లాస్ బయోపిక్ అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు , అప్పటి పరిస్థితులు ఈ వెబ్ సిరీస్ లో దర్శకుడు చక్కగా చూపించాడు.

చక్కటి ఎమోషన్స్, ఆకట్టుకునే సంభాషణలు, చక్కటి మ్యూజిక్.. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చూసే విధంగా దీన్ని తెరకెక్కించారు. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ సిరీస్ ఇటీవల ప్రముఖ తెలుగు ఓటిటి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్ తో ముందుకు వెళ్తోంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఈటీవీ విన్.

Bigg Boss Telugu Contestant Sivaji 90s Middle Class Biopic Web Series Top Trending in ETV Win OTT Full Details Here

అంతే కాదు ఈ సిరిస్ కు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB)లో 9.6 రేటింగ్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక ఇటీవల మంచి సిరీసుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇక ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. శివాజీ, మౌళి, వసంతిక, రోహన్ రాయ్, వాసుకీ ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం దీనిని సంయుక్తంగా నిర్మించారు. మీరు కనుక ఈ సిరీస్ ను మిస్ అయితే.. ఈటీవీ విన్ లో చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X