OTT హీరోగా మారిన పాపులర్ సింగర్.. బిగ్‌బాస్ తెలుగు రన్నర్ మూవీ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అంటే!
వినోద రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీతో జర్నీ చేస్తున్నారు. ఓటీటీలో తనకంటూ ప్రతిభను చాటుకొంటున్నాడు. ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ 1 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు. తాజాగా నేను సూపర్ ఉమెన్ అనే షోకు కూడా హోస్ట్‌గా పనిచేస్తున్నాడు. అలాగే మూడోసారి ఆహా రూపొందిస్తున్న పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో నటించాడు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు సింగర్‌గా కోట్లాది మందిని ఆకట్టుకొన్న గాయకుడు శ్రీరామచంద్ర మరో అవతారం ఎత్తబోతున్నాడు. వేలాది పాటలతోపాటు, ఇండియన్ ఐడల్‌లో సత్తా చాటిన ఆయన ఇప్పుడు యాక్టర్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పాపం పసివాడు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీలో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అవుతున్నదంటే?

సింగర్ శ్రీరామచంద్ర విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు గాయకుడిగా సుపరిచితులు. తొలి నేషనల్ ఛానెల్‌లో జో జీతా వహీ సూపర్ స్టార్ 2 సీజన్‌లో అద్బుతంగా రాణించి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇండియన్ ఐడల్ 5 సీజన్‌లో విజేతగా నిలిచాడు. ఇక బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో 2 రన్నరప్‌గా నిలిచాడు.
సింగర్ శ్రీరామచంద్ర పాటల విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్ సినిమాలో గెలుపు తలుపులు అనే పాట ఆయనకు మంచి గుర్తింపును, పాపులారిటీని తెచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిందీ రాయిస్, చిచ్చోరే, బేబీ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాటలకు అద్బుతమైన రెస్సాన్స్ వచ్చింది.

తెలుగులో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఆహా ఓటీటీలో పాపం పసివాడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది. ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని అని నిర్వాహకులు ఓ ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే వైజాగ్‌ృలో రిలీజ్ చేసిన పాపం పసివాడు సినిమా టీజర్‌కు మంచి బజ్ క్రియేట్ అయింది.
వినోదభరితంగా సున్నితమైన హాస్యంతో గిలిగింతలు పెట్టే కామెడీతో వెబ్ సిరీస్ ఉండబోతుంది. 25 ఏళ్ల యువకుడు ముగ్గురు అమ్మాయిలతో కలిస ఎలాంటి ప్రయాణం చేశాడనే కథను అత్యంత ఆసక్తికరంగా దర్శకుడు లలిత్ కుమార్ చెప్పాడని నిర్మాత అఖిలేష్ వర్ధన్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











