Bigg Boss Telugu OTT 2 బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే.. రియాలిటీ షో స్టార్ట్ ఎప్పుడుంటే?
దేశంలోనే టాప్ రేటింగ్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ముగిసింది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్పందన లభించింది. అయితే బిగ్‌బాస్ షోను తెలుగు ప్రజలు ఆదరిస్తున్న నేపథ్యంలో మరోసారి బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 (Bigg Boss Telugu OTT Season 2) ను ప్రారంభించేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ షోలో పాల్గొనడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్‌కు టాప్ రేటింగ్:తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ షోకు టాప్ రేటింగ్ దక్కుతున్నది. ఈ క్రమంలో ఓటీటీ షోను గతంలో ప్రారంభించింది. అయితే తొలి ఓటీటీ సీజన్‌కు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో దానిని కంటిన్యూ చేయలేకపోయారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 7 కు రికార్డు లెవెల్‌లో వ్యూవర్ షిప్ రావడంతో మళ్లీ Bigg Boss Telugu OTT Season 2 ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కోసం:బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 సీజన్ కోసం ఎండెమాల్ షైన్ ఇండియా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో చర్చలు జరుపుతున్నది. ఇప్పటికే చాలా మందిని ఎంపిక చేసినట్టు, అలాగే మరికొందరితో డిస్కస్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ సారి ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రభావితులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఓటీటీ బిగ్‌బాస్‌లోకి ఎవరెవరంటే?:
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో పాల్గొనడానికి అవకాశం ఉన్న వారి జాబితాలో ఉన్న ప్రముఖ వివరాల్లోకి వెళితే..
1. రిచా పనాడ్ (హీరోయిన్)
2. హ్యాపీడేస్ ఫేమ్ సోనియా దీప్తి
3. కమెడియన్, యాక్టర్ శ్రీ
4. కమెడియన్ భద్రం
5. యాక్టర్ గిరిధర్
6. కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్
7. సినీ, టెలివిజన్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సోనియా సింగ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సింగర్స్:
8. కుర్చి మడతపెట్టి బాస్టర్డ్ బాబాయ్
9. సూపర్ సింగర్ ఫేమ్ సింగర్ పార్వతి
10. కపుల్ ఎంట్రీతో సింగర్ కృష్ణ చైతన్య, మృదుల
11. మోడల్ నిఖిత
12. నవాబ్ కిచెన్, యూట్యూబర్ మోయిన్
13. ఎయిర్ హోస్టెస్, సోషల్ మీడియా ఇన్ఫ్యయెన్సర్ ప్రణిత
14. యాంకర్ శశి
ఇక బిగ్‌బాస్ తెలుగు 7 సక్సెస్ తర్వాత ఓటీటీ 2 షోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీల ఎంపికపై ఫోకస్ పెట్టిన నిర్వాహకులు త్వరలోనే ఈ షోను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అయితే త్వరలోనే ఈ షో గురించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటీకే సోషల్ మీడియాలో ఈ షో గురించి భారీగా చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











