నేరుగా OTTలోకి రాబోతున్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఈ మధ్య అనేక సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి సారించి ఓటీటీ వేధికగా తెగ అలరిస్తున్నారు. థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలకు ఏ రేంజ్ లో పేరు దక్కుతుందో ఓటీటీలో విడుదల అయ్యే చిత్రాలకు కూడా అదే స్థాయిలో పేరు వస్తోంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా కథలు బాగుంటే ఎక్కడైనా నెగ్గుకురాగలవనే నమ్మకం అందరిలోనూ ఏర్పడుతోంది. అయితే తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా ఓటీటీ వేధికగా రిలీజ్ కాబోతుంది. అయితే ఆ కెంటెస్టెంట్ ఎవరు ఆ సినిమా ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1లో పాల్గొన్న అజయ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ముఖ్యంగా అఖిల్ సార్థక్, యాంకర్ స్రవంతి చొక్కారపులతోనే ఎక్కువగా కలిసి ఉంటూ.. ఎప్పుడూ బిందు మాధవితో గొడవ పడుతూ కనిపించేవాడు. అయితే ఆయన తాజాగా ఓ సినిమాలో నటించాడు. ఆయనే కాదు ఈయనతో పాటు హీరోయిన్ గా నటించింది కూడా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ యే. ఆమె మరెవరో కాదు భాను శ్రీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కనిపించి సందడి చేసిన ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాకా అనే చిత్రాల్లో నటించింది. కేవలం సినిమాలే కాకుండా టీవీ షోల్లో కూడా రచ్చ చేసింది.

Bigg Boss Telugu OTT Contestant Ajay Kathurvar Ajay gaadu Movie Streaming Details

అయితే తాజాగా భాను శ్రీ, అజయ్ కుమార్ కతుర్వార్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా చేశారు. ఈ సినిమా ఏడాదిన్నర క్రితమే పూర్తి అయినప్పటికీ.. ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. హీరోగా, ప్రొడ్యూసర్, ఆఖరికి డైరెక్టర్ గా కూడా అజయ్ యే బాధ్యతలు వహించడం చెప్పుకోదగ్గ విషయం. ఈయనతో పాటు ప్రొడ్యూసర్ గా చందన కొప్పిశెట్టి కూడా వ్యవహరించారు. అయితే ఈ సినిమా పేరు "అజయ్ గాడు". సినిమా పనులు ఎప్పుడో పూర్తి అయినప్పటికీ విడుదల కానీ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Bigg Boss Telugu OTT Contestant Ajay Kathurvar Ajay gaadu Movie Streaming Details

అయితే పండుగ సమయం కావడం అనేక పెద్ద పెద్ద చిత్రాలు వస్తుండడంతో.. థియేటర్లలో కంటే ఓటీటీ వేధికగా రిలీజ్ చేయడం బెటర్ అని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వివరించారు. లవ్ అండ్ ఫుల్ ఎమోషనల్ వేలో ఈ సినిమా సాగుతుందని.. అందరినీ ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుందని మూవీ మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X