twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss కంటెస్టెంట్లతో అదిరిపోయే డ్యాన్స్ షో.. జోడీలుగా ఎవరెవరంటే?

    |

    అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రధానంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులోనూ ప్రారంభమై వరుస సీజన్లతో దూసుకుపోతోంది. సెలబ్రిటీ షోగా పేరొందిన ఈ రియాలిటీ షోలో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తుంటారు. అలాగే పెద్దగా లైమ్ లైట్ లో లేని ఆర్టిస్ట్ లు, టాలెంటెడ్ యువతీయువకులు సైతం ఇందులో పాల్గొని విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో డ్యాన్స్ అండ్ కామెడీ షోస్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోనే బీబీ జోడి అనే డ్యాన్స్ షోని తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి బీబీ జోడిలో పాల్గొనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలోకి వెళితే..

    ముగింపు దశకు ఆరో సీజన్..

    ముగింపు దశకు ఆరో సీజన్..

    విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది.

    సీజన్ లు పెరిగిన కొద్దీ..

    సీజన్ లు పెరిగిన కొద్దీ..

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్బ్​ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది బిగ్​బాస్ రియాలిటీ షో. ప్రతి సీజన్​ను మరింత జోష్​తో, మరింత ఆదరణతో ముందుకు సాగుతోంది. అయితే బిగ్​బాస్​ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. సెలబ్రిటీ షో గా ప్రారంభమైన ఈ షోలో మొదట్లో సెలబ్రిటీలే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సీజన్ లు పెరిగినకొద్ది.. సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు.

     సెలబ్రిటీలుగా మారి..

    సెలబ్రిటీలుగా మారి..

    ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో అదివరకే ఫేమ్ ఉన్నవాళ్లు పార్టిస్ పేట్ చేయగా.. కొంతమంది పాపులారిటీ, ఫేమ్ కోసం బిగ్ బాస్ షోలో గేమ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందులో పాల్గొన్న అనేకమంది సెలబ్రిటీలుగా మారి సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు.. ఇంకా అందుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పార్టిస్ పేట్ చేసిన దివి వాద్యా త్వరగానే ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయిన పలు సినీ అవకాశాలు అందుకుంది.

    పోలీస్ ఆఫీసర్ గా బోల్డ్ బ్యూటీ..

    పోలీస్ ఆఫీసర్ గా బోల్డ్ బ్యూటీ..

    ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ కీలక పాత్ర చేసి అలరించింది దివి. అంతకుముందు మా నీళ్ల ట్యాంక్, పరంపర 2 వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఇదే సీజన్ లో పాల్గొన్న సోహైల్ కూడా రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇక నాలుగో సీజన్ రన్నర్ గా గెలిచిన అఖిల్ సార్థక్ ఢీ షోకు మెంటార్ గా ఉంటూ హైపర్ ఆదితో కామెడీ పండించాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ అండ్ మూడో సీజన్ లో పార్టిస్ పేట్ చేసిన బోల్డ్ బ్యూటి అషు రెడ్డి ఇటీవలే ఫోకస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది.

    పవన్ కల్యాణ్ చిత్రంలో ఛాన్స్..

    పవన్ కల్యాణ్ చిత్రంలో ఛాన్స్..

    బిగ్ బాస్ నాలుగో సీజన్ లోని బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరి.. ప్రస్తుతం బిగ్ బాస్ కేఫ్ కు యాంకర్ గా తనదైన శైలీలో ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆరో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన గీతూ రాయల్ పుష్ప 2 చిత్రంతోపాటు పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశం కొట్టేసినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షోతోపాటు బీబీ జోడి అనే కొత్త డ్యాన్స్ షోను కూడా తీసుకొస్తుంది.

    బీబీ జోడి ప్రోమో..

    బీబీ జోడి ప్రోమో..

    బిగ్ బాస్ షోలో పార్టిస్ పేట్ చేసిన కంటెస్టెంట్లలో ఎంతోమంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయించనున్నారు. తాజాగా ఈ బీబీ జోడీ ప్రోమోను విడుదల చేశారు. "బీబీ కోరిక మేరకు ఇంటి సభ్యులందరూ తక్షణమే డ్యాన్స్ చేయండి" అని బిగ్ బాస్ వాయిస్ తో ఈ ప్రోమో ప్రారంభమైంది.

    హోస్ట్ గా శ్రీముఖి ఎంట్రీ..

    బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-స్రవంతి, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. ఈ ప్రోమో రోల్ రైడా ర్యాప్ సాంగ్ తో స్టార్ట్ కాగా చివరలో శ్రీముఖి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. "డ్యాన్స్ అంటే ఇలా గ్రాండ్ గానే ఉంటుంది" అని చెప్పి తను కూడా డ్యాన్స్ చేసింది.

    English summary
    Bigg Boss Telugu 6: Arjun Kalyan Vasanthi Krishnan As A Pair BB Jodi Promo Released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X