For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: బిందు మాధవి అందాల ఆరబోత.. తొలిసారి అలాంటి డ్రెస్‌లో కనిపించడంతో!

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు పెద్దగా రాణించిన దాఖలాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇలా ఎంతో మంది అమ్మాయిలు అరకొర అవకాశాలతో కెరీర్‌ను అర్థాంతరంగా ముగించేశారు. మరికొందరేమో వేరే భాషల్లోకి వెళ్లి సక్సెస్‌లను అందుకున్నారు. అలాంటి వారిలో చిత్తూరు చిన్నది బిందు మాధవి ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, తమిళంలో మాత్రం స్టార్‌డమ్‌ను అందుకుంది. ఇటీవలే బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అలా పరిచయం.. మంచి గుర్తింపు

  అలా పరిచయం.. మంచి గుర్తింపు

  చదువుకునే రోజుల్లోనే బిందు మాధవి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే శరవణ స్టోర్స్ కోసం పలు యాడ్స్ చేసింది. ఆ తర్వాత అలా ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. అనంతరం కమల్ కామరాజు హీరోగా నటించిన 'అవకాయ్ బిర్యానీ' సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది.

  యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్‌ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!

  తెలుగులో చేసిన సినిమాలు ఇవే

  తెలుగులో చేసిన సినిమాలు ఇవే

  'ఆవకాయ్ బిర్యానీ' తర్వాత బిందు మాధవికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో ఈ అమ్మడు 'బంపర్ ఆఫర్', 'ఓం శాంతి', 'రామ రామ కృష్ణ కృష్ణ', 'ప్రతి రోజు', 'పిల్ల జమిందార్' వంటి సినిమాల్లో నటించింది. వీటిలో పెద్దగా విజయాలు లేకపోవడంతో బిందు మాధవికి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు దూరంగా ఉండిపోయింది.

   తమిళంలో మాత్రం ఫుల్ ఫేమస్

  తమిళంలో మాత్రం ఫుల్ ఫేమస్

  తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన బిందు మాధవి.. తమిళంలో మాత్రం స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. 'పొక్కిశామ్' అనే సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అందులో చాలా వరకూ విజయాలు ఉండడంతో ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగింది. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుని ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది.

  తెలుగు హీరోయిన్‌కు నెటిజన్ షాక్: నువ్వు నా లవర్‌లా ఉన్నావు.. ఆ ఫొటోలు చూపించు అంటూ!

  అక్కడ బిగ్ బాస్... సత్తా చాటింది

  అక్కడ బిగ్ బాస్... సత్తా చాటింది

  కోలీవుడ్‌లో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమయంలోనే బిందు మాధవి 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆటతీరుతో పాటు మంచి వ్యక్తిత్వంతో విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, చివర్లో మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

  తెలుగు బిగ్ బాస్‌లో బిందు రికార్డ్

  తెలుగు బిగ్ బాస్‌లో బిందు రికార్డ్

  ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను తీసుకొచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సీజన్‌ ద్వారా బిందు మాధవి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన ఆటతీరుతో పాటు దూకుడైన వ్యవహార శైలితో మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఈ సీజన్‌లో విజేతగా నిలిచింది. తద్వారా తెలుగులో మొదటి లేడీ విన్నర్‌గా రికార్డు కొట్టింది.

  టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

  అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై సందడి చేయకున్నా.. బిందు మాధవి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

   బిందు మాధవి అందాల విందు

  బిందు మాధవి అందాల విందు

  సినిమాల్లో గ్లామర్ పాత్రలను పెద్దగా చేయని బిందు మాధవి.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బుల్లి గౌను మాత్రమే ధరించిన ఈ అమ్మడు.. విపరీతంగా క్లీవేజ్ షో కూడా చేసింది. దీంతో ఆమె అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి.

  English summary
  Bigg Boss Non Stop First Season Winner Bindu Madhavi Very Active In Social Media. Now She Shares Hot Photos in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X