Biker On OTT: ఓటీటీలోకి బైకర్.. శర్వానంద్- రాజశేఖర్‌ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బైకర్. స్పోర్ట్స్, రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. బైకర్‌లో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా బైకర్ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ మ్యూజిక్ సంగీత దర్శకత్వం వహించగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా బైకర్ రిలీజ్ అయ్యింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? అనే దానిపై పరిశీలిస్తే..

బైకర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైకర్ మూవీకి 45 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. హైప్‌కు తగినట్లుగానే బైకర్‌‌కు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ బాగానే బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాం, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్‌ను 23 కోట్ల రూపాయలు చొప్పున ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారు. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ హక్కులు కలిపి వరల్డ్ వైడ్‌గా బైకర్ మూవీ 30 కోట్ల రూపాయలు చొప్పున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బైకర్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల రూపాయల షేర్.. 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.

Biker OTT Release Date Sharwanand s film Expected Streaming on Netflix from May 1

ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి పరిశీలిస్తే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అలాగే మ్యూజిక్, శాటిలైట్ సహా అన్ని రైట్స్ కలిపి మరో 8 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. మొత్తం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి బైకర్ మూవీకి 70 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

బైకర్ కలెక్షన్స్
శర్వానంద్ మూవీకి తొలివారం ఇండియాలో 11.07 కోట్ల రూపాయలు, రెండో వారంలో 1.70 కోట్ల రూపాయలు చొప్పున 19 రోజుల వరకు 12.98 కోట్ల రూపాయల నెట్.. 15.02 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇక ఓవర్సీస్‌లోనూ బైకర్ నిరాశపరిచింది. నార్త్ అమెరికాలో థియేట్రికల్ రన్ ముగిసేసరికి శర్వానంద్ మూవీకి 195K డాలర్లు (1.82 కోట్ల రూపాయలు) మాత్రమే వసూలు చేసింది. యూరప్, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ తదితర దేశాలలో మరో 70 లక్షల రూపాయలతో కలిపి ఓవర్సీస్‌‌లో 2.60 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దీని ప్రకారం చూస్తే భారత్‌లో వచ్చిన గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. అయితే తమ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 43 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టినట్లు బైకర్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 12.35 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.35 కోట్ల రూపాయలు, తమిళనాడులో 85 లక్షల రూపాయలు, కేరళలో 5 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 66 లక్షలు చొప్పున బైకర్ రాబట్టింది.

బైకర్ ఏ ఓటీటీలో?
థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కావాలనే నిబంధన మేరకు బైకర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీని ప్రకారం చూస్తే మే తొలి వారం శర్వానంద్ మూవీ థియేటర్‌ నుంచి ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న బైకర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: Biker sharwanand netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X